Tuesday, September 29, 2026
More
    HomeOpinionCM Revanth Reddy paddy review : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ఆ...

    CM Revanth Reddy paddy review : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ఆ దేశం, ధాన్యం తరలింపుకు లారీతో పాటు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ను వినియోగించoడి 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy paddy review : ప్రజా దీవెన హైద రాబాద్: మిషన్ మోడ్‌లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేక రణ, మొక్కజొన్న కొనుగో ళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొను గోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్ట ర్లు బాధ్యత వహించాలని స్పష్టం చే శారు. రాష్ట్రంలోధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై ముఖ్య మంత్రి క్యాంపు కార్యా లయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీ డియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

    వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్క జొన్న కొనుగోళ్ల విష యంలో తలెత్తిన ఇబ్బందులు, స మస్య లపై కలెక్టర్లను వివ రాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయం లో ఈ సందర్భం గా ముఖ్యమంత్రి కలెక్ట ర్లకు స్పష్టమైన ఆ దేశాలు జారీ చేశారు. కొనుగోళ్లపై ప్రభు త్వ ప్రధాన కార్యద ర్శికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిం చాలని కలెక్టర్లను ఆదేశించారు.

    కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఎ ప్పటికప్పుడు క్షేత్రస్థా యిలో పరిస్థి తులను పరిశీలించాలి. గన్నీ బ్యా గులు, హ మాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. కొనుగోలు చే సిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలి. ధా న్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీ లను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకా డొ ద్దు.ధాన్యం లోడింగ్‌ విషయంలో జాప్యం జరగకుండా స్థాని కంగా ఉ న్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించు కోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అం దేలా చర్యలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల తాలు, త రుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు.

     

    లారీల కొరత ఉంటే దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనా లను వినియోగించాలని, ధాన్యం తరలించడానికి అవసరమైన వా హనాలను అందుబాటులో ఉండేలా చూ డాలని ఈ సందర్భంగా రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశిం చారు. పలు ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలు స్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏ ర్పాట్లు చేసుకోవాలి. గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అవ సరాన్ని బట్టి తాత్కాలిక ఏ ర్పాట్లు చేసుకోవాలి.

    అవసరమైన చోట రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను అందుబా టులోకి తీసుకుని ధాన్యాన్ని తరలించాలి. వెసులుబాటు ఆ ధారంగా అక్కడినుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలుం డాలని సూచించారు. ప్రాంతాల వారిగా స మస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలె క్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారితనంతో వ్యవహరించాల్సిందేనని స్ప ష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, కలెక్టర్లపై చర్య లకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు.

    మొక్కజొన్న పంట ఎక్కువగా వ చ్చే జిల్లాల కలెక్టర్లు కొను గోళ్ల విష యంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొ ద్దు. అవసరమైన చోట పోలీస్ సహా యం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాల ని ఆదేశించారు.అకాల వర్షాల స మయంలో రై తులకు నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణా ళికలు సిద్ధం చేసుకోవాలి.

    ఇలాంటి సమయాల్లో ధాన్యం త డవ కుండా అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబా టులో ఉంచాలి. వాతా వరణ శాఖ సూచనల ఆ ధారంగా ఎప్పటికప్పుడు రైతుల ను అప్రమత్తం చేసేందుకు మండల స్థా యిలో ఒక ప్రత్యేక అధికారిని ని యమించాలి. వాతావ రణ సూచనలను రైతు లకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్య వస్థను ఏర్పాటు చేసు కోవాలన్నారు.

    ప్రతీ ఐకేపీ సెంటర్‌కు ఒక అధికా రి ని నియమించాలి. ప్రతి రైస్‌మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియ మించి పర్యవేక్షించా లని ముఖ్యమంత్రి ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, ధనస రి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కు మార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.