Sunday, September 27, 2026
More
    Homeఖమ్మం జిల్లాkhammam warangal highway fetal road accident : బిగ్ బ్రేకింగ్, నిప్పులకొలిమిగా ఖమ్మం రోడ్డుమార్గం,...

    khammam warangal highway fetal road accident : బిగ్ బ్రేకింగ్, నిప్పులకొలిమిగా ఖమ్మం రోడ్డుమార్గం, రెండులారీలు ఢీకొని డ్రైవర్ల సజీవదహనం

    📰 Generate e-Paper Clip

    khammam warangal highway fetal road accident : ప్రజా దీవెన, తిరుమలాయపాలెం: ఖమ్మం, వరంగల్ ప్ర ధా న రహదారి రక్తసిక్తమైంది. అది మంగళవారం ఉదయం ని త్యం వాహనాలతో రద్దీగా ఉండే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారి ఒక్కసారిగా రణ రంగ మైంది. క్షణాల్లో ఎగిసిప డిన నిప్పుకణికలు ఇద్దరు ప్రా ణాలను బూడిద చేశాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకలతండా శివారులో జరిగిన ఈ ఘోర రో డ్డు ప్రమాదం చోటుచేసు కుంది. దాంతో స్థానికులను భయాందోళనకు గురయ్యారు.

    ఈ ఘోర దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఏకల వ్య నర్సరీ సమీపంలో వేగంగా వస్తున్న రెండు లారీలు ము ఖాముఖి ఢీకొన్నాయి. వీటిలో ఒక లారీ ఆలుగడ్డల లోడు తో వస్తుండగా, మరొకటి బొగ్గులో డుతో వెళ్తోంది. డీజిల్ ట్యాంకులు పగిలిపోవడంతో పాటు, బొగ్గు ఉండటంతో మం టలు క్షణాల్లో భారీగా వ్యాపించాయి.

          లారీ డ్రైవర్ల సజీవ దహనం

    రెండు లారీలు డీకొన్న వెంటనే మంటల చెలరేగడంతో దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, క్యా బిన్లలో చిక్కుకు పో యిన ఇద్దరు డ్రైవర్లు బయటకు వచ్చే అవకాశం లేక అక్క డికక్కడే సజీవ దహనమ య్యారు. లారీల్లో ఉన్న ఇద్దరు క్లీనర్లు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలిం చారు.

    ప్రమాద సమాచారం అందిన వెంట నే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆకాశా న్నంటుతున్న మం టలను ఆర్పేం దుకు తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చా రు. అప్పటికే వాహనాలు పూర్తిగా అస్థిపంజరాలుగా మారి పోయాయి. భయంకరమైన శబ్దం తో లారీలు ఢీకొన్నాయి. మంటలు అంత ఎత్తున ఎగిసిపడుతుంటే దగ్గరకు వెళ్లడా నికే భయం వేసింది.

    ఈ ప్రమాదం కారణంగా వరంగల్, ఖమ్మం రహదారిపై కిలో మీటర్ల మే ర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సం ఘటనా స్థలానికి చే రుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించా రు. మృతుల వివరాలు ఇంకా పూ ర్తిగా తెలియరాలేదు. పోలీ సులు కేసు నమోదు చేసి, అతివేగమా లేదా డ్రైవర్ల నిద్రమ త్తా అనే కో ణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనా లను రోడ్డుపై నుంచి తొలగించే ప్రక్రి య కొనసాగుతోంది.రక్తమాంసాలు బూడిదై పోయిన ఈ ఘటన ఆ మార్గంలో ప్రయాణించే వారిని కల చివేసింది. పూర్తి వివరాలు తెలి యాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.