Monday, September 28, 2026
More
    HomeOpinionCollecter chandhrasekhar strong worning : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ కీలకఆదేశం, ధాన్యం అన్లోడింగ్...

    Collecter chandhrasekhar strong worning : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ కీలకఆదేశం, ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయకపోతే అంతే సంగతులు

    📰 Generate e-Paper Clip

     

    Collecter chandhrasekhar strong worning :  ప్రజా దీవెన, మిర్యాలగూడ: ధా న్యం అన్లోడింగ్ వేగవంతం చే యాలని, లేదంటే రాబోయే రోజుల్లో అంతే సంగతులు అం టూ మిల్లర్ల కు జిల్లా కలెక్టర్. బి. చంద్రశేఖర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శని వారం ఆయన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి మిర్యాల గూడ సబ్ కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో పౌర సరఫరా ల అధికారులు,రైస్ మిల్ యాజ మానులతో ధాన్యం ఆన్ లోడింగ్ పై సమీక్షించారు.

    జిల్లాలో ఇప్పటివరకు 6 లక్షల 76 వేల మెట్రిక్ టన్నుల ధా న్యం కొను గోలు చేసినట్లు తెలిపారు.ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం కేంద్రాలకు వచ్చే అవకాశ ముందని చెప్పారు. ఈ నేపథ్యం లో మిల్లర్లు జాప్యం చేయకుండా ధా న్యాన్ని అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు.హమాలీల కొర త లే కుండా చూడాలని, అవసరమైతే సుదూర ప్రాంతాల నుంచి హమా లీలను తీసుకురావాలని సూచించారు. ప్రతి రోజూ కనీసం 400 లా రీల ధాన్యాన్ని మిల్లులలో దించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    రైతుల ప్రయోజనాలకై అందరూ సమన్వయంతో పనిచే యాలని కో రారు.చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరి ష్కరిస్తామని, ఖాళీ అ యిన ఐకేపీ కేంద్రాల హమాలీలను కూడా అన్లోడింగ్ పనులకు విని యోగించుకోవాలని సూ చించారు. ధాన్యం అన్లోడింగ్ అయిన వెంటనే ట్రక్ షీట్లను తీసుకెళ్లాలని తెలిపా రు.రైస్ మిల్లులు,లారీ ట్యాగింగ్ స మ స్యలు ఉంటే అధికారులు వెం టనే పరిష్కరించాలని ఆదే శించారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మిర్యాలగూ డ లారీ అసోసియేషన్ అదనంగా 50 లారీలను అందుబా టులో ఉంచాలని, ధాన్యం తరలింపు పూర్తయ్యే వరకు స హకరించాలని కలెక్టర్ ఆదేశిం చారు.ఈ సందర్బంగా రైస్ మిల్లర్ అసోసియే షన్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అంది స్తామని హామీ ఇ చ్చింది. లారీలు, హమాలీల కొరత లేకుం డా ధాన్యం రవాణా, అన్లోడిం గ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చూడాలని అధికారుల కు సూచించారు.

    లారీలు, హమాలీల కొరత తలెత్త కుండా ముందస్తు ఏర్పా ట్లు చేసుకోవాలని తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం ధాన్యం సేక రణలో ప్రభుత్వా నికి పూర్తి సహకారం అందించాలని కోరా రు.మిగిలిన ధాన్యాన్ని 10 రోజుల్లో పూర్తిగా లిఫ్టింగ్ చేయా లని తెలిపారు. మిల్లులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాం గం వెంటనే పరిష్కరిస్తుందని , రైతులకు ఇబ్బం దులు కలగకుండా ప్రభుత్వ శాఖలు, మిల్లర్లు, లారీ యాజ మాన్యాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

    ఈ సమా వేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీ వో రమణారెడ్డి, జిల్లా పౌర సరఫరాల శా ఖ అధికారి వెంకటేష్, మిర్యా లగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు, పౌర సరఫరాల డిఎం రాంపత్తి నా యక్, తహసిల్దార్ శ్రీనివాస్, మిల్ల ర్లు గౌరు శ్రీనివాస్, బాబి ,నవీన్ శ్రీరామ్, రైస్ మిల్స్ యజమాను లు అధికారులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.