AI.Prof Career Guidance in Nalgonda: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఐటీ టవర్ (Nalgonda IT Tower) వేదికగా సరికొత్త చరిత్ర. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు మా ర్చడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇకో సిస్టమ్. లక్షలు ఖర్చు పెట్టి, నాలుగేళ్లు రాత్రింబవళ్లు కష్టపడి బిటెక్ (b.tech) పూర్తి చేసినా.. చేతిలో ఉద్యోగం లేక ఎంతో మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు రోడ్డున పడుతున్నారు. ఇ టు తల్లిదండ్రుల ఆశలు, అటు విద్యార్థుల కలలు (Stude nt Dreams) అడియాసలవుతున్నాయి. కానీ.. ఇక పై ఆ టెన్షన్లకి చెక్ పడనుంది.భవిష్యత్ అంతా ఆర్టి ఫిషియల్ ఇం టెలిజెన్స్ (AI) దే అని గ్రహించిన ‘ఏఐ.ప్రొఫ్’ (AI.Prof) సం స్థ, నల్లగొండ వేదికగా ఆది వారం నిర్వహించిన ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్కు విద్యా ర్థులు, తల్లిదండ్రుల నుండి అద్భు తమైన రెస్పాన్స్ లభించింది. ఇంటర్ పూర్తి చేసిన వందలాది మంది విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, భవిష్యత్ కెరీర్ పై ఒక స్పష్టత తెచ్చుకున్నారు.
ఏంటి ఈ ‘ఏఐ.ప్రొఫ్’ (AI.Prof) ?
ఇది కేవలం ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రవేశపెట్టిన ‘ఏఐ ఆధారిత బీటెక్ ఎకోసిస్టమ్’. అంతర్జాతీయ ప్రమాణాలు (International Standards) ప్రపంచ ప్రఖ్యాత కార్నెగీ మెలన్ యూనివర్సి టీ విద్యా ప్రమాణాల స్పూర్తితో దీనిని డిజైన్ చేశారు.మన హైదరా బాద్ జేఎన్టీయూ (JNTUH) పార్ట్నర్షిప్తో తె లంగాణలో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. సాంప్ర దాయ చదువులకు భిన్నంగా, ఏఐ సాంకేతికతను అందిపు చ్చుకుంటూ ప్రతి విద్యార్థిని నేరుగా విజయం వైపు నడి పిం చడమే లక్ష్యంగా ఈ సంస్థ అక్కా ప్రణాళి కతో ముందుకు సాగనుందన్న నమ్మకాన్ని నెలకొల్పింది.

సొంతూరిపై మమకారంతో.. ‘సాందీప్ కోణం’ సంకల్పం!
లక్షల రూపాయల ఫీజులు కట్టినా మెరుగైన అవకాశాలు లే క ఇబ్బంది పడుతున్న గ్రామీణ విద్యార్థుల కు భరోసా ఇవ్వా లనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. నల్లగొండ స్థానికుడు సాందీప్ కోణం. తన సొంత నేల మీదున్న మమకారంతో, ఇక్కడి విద్యార్థులు గ్లోబల్ లెవెల్లో రాణించాలనే ఉద్దేశంతో కోణం ఫౌండేషన్ ద్వారా దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు.
రాబోయే రోజుల్లో ‘ఏఐ’ ప్రభంజనం ఊహించని రేంజ్లో ఉం డబోతోంది. సాధారణ బీటెక్ కంటే.. ‘ఏఐ ఆధారిత బీటెక్’ వి ద్యార్థుల భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. తల్లిదం డ్రుల ఆకాంక్షలను, విద్యార్థుల కలలను నిజం చేసేందుకు ఏఐ.ప్రొఫ్ ఒక వరంలా మారనుందని ‘ఏఐ. ప్రొఫ్’ ప్రతినిధి పైళ్ల సాయిచరణ్ రెడ్డి

గ్రాండ్ సక్సెస్ చేసిన టీమ్
ఈ కెరీర్ గైడెన్స్ ఈవెంట్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు సరైన దిశానిర్దేశం చేయడానికి పలువురు ప్ర ముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘ఏఐ.ప్రొఫ్’ ప్రతినిధులు అజ్మీర భాను ప్రకాష్, మనీష్ల తో పాటు కోణం ఫౌండేషన్ ప్రతిని ధులు స్నేత, నవ్య, శ్రీనివాస్, అంజి, పరశురామ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు.
