Massive gold seizured in mumbai airport : ప్రజా దీవెన, ముంబై:ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ వి మానాశ్రయం అది. ఎప్పటిలాగే ప్ర యాణికుల రద్దీతో కో లాహలంగా ఉంది. కానీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజె న్స్ (DRI) అధికా రులకు మాత్రం అక్కడ ఏదో తేడాగా అని పించింది. పక్కా సమాచారంతో వారు రంగంలోకి దిగారు. కట్ చేస్తే…ఎవరూ ఊహించని ఒక భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ గుట్టురట్టయింది. సినిమా స్టైల్లో సాగిన ఆపరేషన్ గోల్డెన్ నెక్సస్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విదేశాల నుంచి ల్యాండ్ అయిన ముగ్గురు బంగ్లాదేశ్, శ్రీలం కకు చెం దినవిదేశీ ప్రయాణికులు చాలా క్యాజువల్‌గా ఎయి ర్‌పోర్టులో అ డుగుపెట్టారు. కస్టమ్స్ కళ్లు కప్పడానికి ఏకం గా తమ శరీరాల్లోనే (గుట్టుచప్పుడు కాకుండా) బంగా రాన్ని దాచుకుని తీసుకువచ్చారు. కానీ, ట్విస్ట్ ఏంటంటేవీరికి ఎ యిర్ పోర్ట్ లోపల పనిచేసే కొందరు సిబ్బంది కూడా తోడ య్యారు. విమానాశ్రయం లోపల తిరిగే బస్సు కోచ్ డ్రైవర్లు, మానిటర్ కలిసి ఈ బంగారాన్ని ఎయిర్పోర్ట్ దాటించి బ యటఉన్న ఒక లోకల్ రిసీవర్‌కు అందించాలని ప్లాన్ చేశా రు.
సీన్ లోకి డిఆర్ ఐ ఎంట్రీ
తమ గుప్త సమాచారంతో ఎయిర్ పోర్టులో మాటు వేసిన DRI ముం బై జోనల్ యూనిట్ అధికారులు, నిందితులు బంగారాన్ని చేతులు మారుస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు రూ.5కో ట్ల మార్కెట్ విలువ చేసే 3.2 కిలో ల విదేశీ మార్కు 24 క్యారెట్ల బంగారం స్వాధీనప రచుకొని ముగ్గు రు విదేశీ ట్రాన్సిట్ ప్రయాణికులు, ముగ్గురు ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, ఒక లోకల్ రిసీవర్‌తో కలిపి మొ త్తం ఏడుగురిని అధికారులు అరెస్ట్ చేశారు.
దేశ ఆర్థిక భద్రతను దెబ్బతీసేలా, పన్నులు ఎగ్గొట్టి విదేశీ బం గారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇలాంటి అంతర్జాతీయ స్మ గ్లింగ్ చైన్‌ను పూ ర్తిగా బ్రేక్ చేశామని అధికారులు తె లిపా రు. కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉ న్నారనే కోణంలో వి చారణను మ రింత ముమ్మరం చేశారు. ఒక సాధారణ వార్త వెనుక ఇంత పెద్ద ప్లా న్, సినిమా తరహా ఛేజింగ్ దాగుం టుందని ఎయిర్పోర్ట్ వర్గాలు కూడా ముక్కున వేలేసుకుం టున్నాయి.


