Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జి ల్లా కనగల్ మండలం వేదికగా తె లం గాణ రహదారుల చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొద లుకాబోతోంది. ఈనెల 17న (బుధవారం) రాష్ట్ర ముఖ్యమం త్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న భారీ ప్రా జెక్టులకు ఆయన ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నా రు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివా రం కనగల్ పరిధి లోని సభా స్థలి, హెలిప్యాడ్, పైలాన్ నిర్మాణ పనులను అధి కారులతో కలిసి స్వయంగా పరిశీలించి, దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున ఊ హించని స్థాయిలో నిధుల వరద కురవబోతోందని ఈ సంద ర్భంగా ఆయన పేర్కొన్నారు. రూ. 14,000 కోట్ల ‘హ్యాం’ (H AM) రోడ్లు రాష్ట్రవ్యా ప్తంగా 34 ప్యాకేజీ లుగా విభజించి, 6,300 కిలోమీటర్ల మేర రహ దారులను డబుల్ రోడ్లుగా మార్చనున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్యాకేజీ (కన గల్, ధర్వేశిపురం నుండి డిండి వరకు) పనులకు సీఎం రే వంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.

రూ.7,000 కోట్ల పంచాయతీ రాజ్ రోడ్లు
గ్రామాల నుండి మండలాలకు, జి ల్లాలకు అనుసంధానం చేస్తూ వ చ్చే వారం మరో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టను న్నామని తెలిపా రు. ఈ హ్యాం రోడ్లన్నింటినీ రాబోయే రెండే ళ్లలో పూర్తి చేయడమే ల క్ష్యంగా పెట్టుకున్నామని, కేంద్రంతో సంప్రదింపులు జరిపి రిజర్వాంట్ ద్వారా నిధులు సమకూ ర్చినట్లు మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సంద ర్భంగా నల్గొండ జిల్లాకు పలు అభివృద్ధి పనుల మం జూరు పత్రాలు అందనున్నాయన్నారు. మంత్రి కోమటిరెడ్డి కలల ప్రాజెక్ట్ అయిన ఎ స్ఎల్ బిసి సొరంగ మార్గాన్ని 20 28 ఆగస్టు నాటికి పూర్తి చేసి జి ల్లా లో రెండు పంటలకు సా గునీరు అందిస్తామన్నారు.ఏఆర్పి కాలువల లైనింగ్:రూ. 45 0 కోట్ల వ్యయం తో చేపట్టే ఈ పనులకు కూడా అదే రోజు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో
నగరంలో తాగునీటి సమస్య పరి ష్కారానికి ప్రత్యేక నిధు లు మంజూరయ్యాయి, ఈ పనులకూ కనగల్ నుంచే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారన్నారు. అదేవిధంగా హైదరాబాద్ – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరైందని, దాని పక్కనే బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన డీపీఆర్ (DPR) కూడా సిద్ధ మవుతోందని మంత్రి కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతు సంక్షేమా నికి కట్టుబడి ఉందనడా నికి నల్లగొండ నియోజకవర్గమే నిదర్శన మని మంత్రి పేర్కొ న్నారు. ఈ ఏ డాది రికార్డు స్థాయిలో 2,40,000 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని పండిం చగా జిల్లా వ్యాప్తంగా రూ. 1800 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగో లు చేసిం దని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ, రైతు భరో సా తో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్ర యాణం, విద్యార్థుల కో సం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్న ట్లు తెలిపారు.
లక్ష మందితో భారీబహిరంగ సభ
ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని కనగల్ లో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించ నున్నామని, ఈ సభను విజయ వంతం చేయాలని మంత్రి కోమటి రెడ్డి పిలుపునిచ్చారు.సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా త్రాగునీరు, టెంట్లు, రవాణా సౌకర్యాలు క ల్పించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పక్కాప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించా రు. ఈ పర్యటనలో మంత్రి వెంట అదనపు కలెక్టర్లు జె. శ్రీని వాస్, వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ శంకర్ నాయక్, డిఎస్పి శివరాం రెడ్డి, ఆర్ అండ్ బి డిఈ గణేష్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, గడ్డం అనూప్ రెడ్డి, కూసుకుంట్ల రాజ శేఖర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

