Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉం చు కొని రైతులు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. కొంత మంది రైతులు ఇదివరకే పత్తి, కంది వంటి పంటలు సాగు చేయ డం జరిగిందని, అలాంటి పంట ల్లో అంతర పంటలు వేసుకోవాలని, తద్వారా పంటల సాగు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహించిన “రైతు నేస్తం 100 వ ఎపిసో డ్” కార్యక్రమానికి హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాగా, జిల్లా లోని దోమలపల్లి రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యక్ర మానికి హాజరైన రైతులను ఉద్దే శించి మాట్లాడుతూ అల్పపీడన ద్రోణి వల్ల సెప్టెంబర్ మాసంలో కూడా వర్షాలు వచ్చే అవకాశం లేదని, అంతేకాక ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లలో కూడా వర్షాలు లే నందున, శ్రీశైలం ప్రా జెక్టు నిండే అవకాశం లేదని, అం దువ ల్ల నల్గొండ జిల్లాకు జీవనా ధారమైన నాగార్జునసాగర్, ఏ ఎంఆర్పి ప్రాజెక్టులు కూడా నిండే పరిస్థితి లేదని, వీటన్నిటిని దృష్టి లో ఉంచుకొని వాస్తవ పరిస్థితు లను గమనించి ఆరు తడి పంటలు వేసుకోవాలని చెప్పారు. ఇది వరకే పత్తి,కంది పంటలు వేసుకు న్న వారు అంతర పంటలు వేసు కోవచ్చని సూచించారు. వీ టితో పాటు, ఉద్యాన పంటలు, కూర గా యల సాగు చేయవచ్చని, ప్ర భుత్వం సబ్సిడీపై బిందు పరి కరాలను అందజేస్తుందని తెలిపారు. రైతులు ఆరుతడి పం టల కింద సబ్జ, కొర్రలు ,సామలు వంటి పంటలను సాగు చే యాలని రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే ఏర్పా టు చేస్తుందని తెలిపారు.
అంతకుముందు రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు “రైతు నేస్తం 100వ ఎపిసోడ్” లో మాట్లా డుతూ రై తు నేస్తం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు వాతా వరణ పరిస్థి తులు, సాగు పద్ధతులు, పంట లు, ఎరువులు, నూతన విష యాలన్నీ రైతుల ముందు ఉంచడం జరుగు తుందని, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, ఆలోచనలు ,అలాగే రై తుల అభిప్రాయాలను పంచుకు నేం దుకు రైతు వేదికలు సమన్వయ వేదికలుగా ఉన్నాయని, రై తు నేస్తం కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని కో రారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బోర్లు ,ఎత్తి పోతల పథకా ల కింద, అలాగే సాధారణ వ్యవసాయం ఎ లా చేయాలో కూడా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేస్తారని చెప్పారు.
ఎల్ నినో దృష్ట్యా రైతులు ఉద్యాన పంటలు,ఆరు తడి పం టల వైపు వెళ్లాలని,సజ్జలు ,సామలు, కొర్రలు వంటి పంటలు నెలరోజు ల వరకు నీళ్లు లేకున్నా పండు తాయని, వీటిని అంతర పంటలుగా వేసుకోవచ్చని, అంతేకాక ఆయిల్ ఫా మ్ వల్ల స్థిరమైన ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ తో టలు సాగుకు పురుగుల బెడద, ఎలిమినో , కోతుల బెడద వంటివి ఉండదని అన్నారు. రైతు నేస్తం ద్వారా అందించే వ్యవసాయ యాంత్రీకరణ, పద్ధతులు తెలుసుకుంటూ వ్యవ సాయం సాగు చేస్తే త్వరగా వ్యవసాయం ముందుకు వెళు తుందని, రైతు లు కష్టాల భారం నుండి తప్పిం చుకోవచ్చని అన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా వ్యవసాయ అధి కారి వి నోద్ కుమార్, జిల్లా హర్టిక ల్చర్ డిడి శేఖర్ , హార్టికల్చర్ అధి కారులు తదితరులు పాల్గొన్నారు.
వినూత్న ఆలోచనలతో అభివృద్ధి కార్యక్రమాలు
నల్లగొండ : గ్రామాలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా వినూ త్న ఆ లోచనలతో అభివృద్ధి కా ర్యక్రమాలను అమలు చే యాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళ వా రం నల్గొండ మండల పరిషత్ కార్యాలయం లో వి బి-జీ రాం-జీ, జలసిరి ప నులపై గ్రామ సర్పంచులు, గ్రామ కార్య దర్శులు, టెక్నికల్ సిబ్బం దికి నిర్వహించిన అవగాహన కా ర్యక్రమానికి ఆయన హాజర య్యారు.వి బి.జీ రాం-జీ పను ల్లో భాగంగా గ్రామా ల్లో ఇంకుడు గుం mతలు, ఊట కుంట లు, నిర్మించి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేలా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్ అన్నారు.
గ్రామాల్లో నీటి కొరత లేకుండా ఉండే విధంగా జల సంరక్షణ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గ్రా మంలో ప్రజలతో చర్చిం చి గ్రా మానికి అవసరమైన పనులను గుర్తించి వాటిపై అవ గాహన కల్పించాలని తెలిపారు. రైతులు కేవలం పత్తి పం టపైనే ఆధారపడకుండా కందులు, పెసర్లు, సజ్జలు, కొర్రలు వంటి ఆరుతడి పం టల సాగుపై దృష్టి సారించేలా పూర్తి స్థా యిలో అవగాహన క ల్పించాలని అధికారులను ఆదేశించా రు.
గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చూడా లని, చెత్త వల్ల జ్వరాలు సోకే అవకాశం ఉందని, పరిశుభ్రత కు ప్రాధాన్య త ఇవ్వాలని, ప్లాస్టిక్ ని సేకరించి అమ్మితే గ్రా మానికి ఆదాయం వ స్తుందని, గ్రామాలు అభివృద్ధి చెందా లంటే ఏం చేయాలో ఆలోచించాలని, ప్రజా ప్రతినిధుల స హకారంతోపాటు, మన వంతుగా గ్రామానికి ఏం చేస్తున్నా మో ఆలో చించాలని, ఇందులో భాగంగా రై తులను కూడా ప్రోత్సహిం చాల ని, ఫుడ్ ప్రాసెసింగ్ గోదాముల ని ర్మాణం కోల్డ్ స్టోరేజ్ వంటి వాటి వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని, తద్వారా గ్రామాలు ముందుకువెళ్తాయని అన్నారు. ఈ కార్య క్రమంలో డిపిఓ శంకర్ నాయక్ , ఎంపీడీవో యా కూబ్ నాయక్, స ర్పంచులు, కార్యదర్శులు టెక్నికల్ సిబ్బం ది హాజరయ్యారు.
ఆరుతడి పంటల వైపు ఆస క్తి చూపాలి
నల్లగొండ: వర్షాభావ పరిస్థితుల ను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేసే పంటల వైపు జిల్లా రైతులు మొ గ్గు చూపాల్సి న అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ అన్నారు. మంగళ వారం ఆయన నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో కంది పంటను సాగు చేసిన రైతుల వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరు తడి పంటలు సాగు చేస్తున్నందుకు రైతులను అభినందిం చారు. జిల్లా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ వంటి ఆరు తడి పంటలను సాగు చేసి నీటి వినియోగాన్ని తగ్గిస్తూ స్థిర మైన ఆదాయాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ వానాకాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షా భావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను సాగు చేయాలని , వరి పంటకు బదులు ప్రత్యామ్నయ పంటలు వేసుకోవాలనిజిల్లా కలెక్టరు తెలిపారు . ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ రైతు అజేందర్ రెడ్డి, కంది రైతు దంపతులు అంజయ్య పార్వ తమ్మ లను సన్మానిం చారు. జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ డిడి శేఖర్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
సీజనల్ వ్యాధులను పట్ల చురుకుగా వ్యవహరించాలి
నల్లగొండ: సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంలో వైద్య బృం దాలు ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ను ఆ దేశించారు. ప్రత్యేకించి జ్వరం, మలేరియా, టైఫాయి డ్, డెం గ్యూ వంటివి వస్తే తక్షణ చికిత్స అందించేందుకు మలేరి యా, ఫీవర్ బృందాలు చురుకుగా పని చేయాలని చె ప్పారు. రానున్న 2,3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ అధిక వర్ష పాతం నమోదయ్యే ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్ర విపత్తు నిర్వహణ సెక్రెటరీ తో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు సం బంధిత శాఖల అధికారులతో వాతావరణ పరిస్థితిలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వాతావరణ పరిస్థితులను సమీక్షిస్తూ జిల్లాలో ఒక వేళ అధిక వర్షాలు నమోదైనట్లైతే ఎక్కడా రహదారి వ్యవస్థ దెబ్బ తినకుండా ఆర్ అండ్ బి ,పం చా యతీరాజ్ అధికారులు ముందు జా గ్రత్త చర్యలు తీసుకోవాలని చె ప్పారు. ప్రజలు సీజనల్ వ్యా ధుల బారిన పడకుండా చర్యలు తీ సుకోవాలని వైద్యాధికా రులను ఆదేశించారు. జ్వరం, టైఫాయి డ్, మలేరియా వం టి వ్యాధులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలు, ఆ సుపత్రుల్లో మందుల అందుబాటు, చికి త్సలకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో సమీక్షించారు.
మలేరియా ప్రాజెక్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో తిరగాలని, ప్రత్యేకిం చి మున్సిపాలిటీలపై దృష్టి సా రించి ప్రతి మంగళ, బుధ, గురు వారాలు మున్సిపాలిటీలలో ప ర్యటించాలని ,శుక్ర, శనివారాలు గ్రామపంచాయతీలలో పర్యటిం చాలని ఆదేశించారు. ఎక్కడైనా మలేరియా, టైఫాయిడ్, డెంగీ వం టి వ్యాధులు సోకితే తక్షణమే చికిత్స ప్రారంభించాలని చె ప్పా రు. ఈ టెలికాన్ఫెరెన్స్ కు జిల్లా రెవిన్యూ అధికారి దశ రథ్ ,రోడ్లు, భవనాల శాఖ ఎస్ ఈ పున్న మో హన్, ఆర్ అం డ్బి ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఎంహెచ్ ఓ డాక్టర్ రాహు ల్ , జిల్లా వ్యవసాయ అధికారి వి నోద్ కుమార్, జిల్లా మలేరియా అధికారి, తదితరులు హాజరయ్యారు.






