Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్: రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకూ లెక్క తేల్చడం, కస్ట మ్ మిల్లింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకతను తీసుకురా వ డమే తెలంగాణ ప్రభుత్వ ప్రధా న లక్ష్యమని రాష్ట్ర నీటిపా రుదల, ఆహార–పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉ త్తమ్‌కుమా ర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన ధా న్యం, బియ్యం ని ల్వలను దారి మళ్లించడం, దుర్వి నియో గం చేయడం లేదా సీఎం ఆర్ బకాయిలను సకాలంలో చె ల్లించకుండా ప్రజాధనానికి నష్టం కలిగించడం వంటి చర్య లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరిం చా రు.ధాన్యం సేక రణ, నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగిం త, బకాయిల వసూలు, ప్రభుత్వ నిల్వల పరిరక్షణతో పాటు డిఫాల్టర్ రైస్ మిల్లులపై తీసుకోవాల్సి న చట్టపరమైన చర్యలపై సోమ వారం సాయంత్రం ఉన్నతస్థా యి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలి పారు. ఈ సమీక్షా సమావేశంలో పౌర స రఫరాల శాఖాధి కారులు పాల్గొనాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించే వ రకు మొత్తం వ్యవస్థలోని ప్రతి దశను సమగ్రంగా పరిశీలిం చాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష రైస్ మిల్లింగ్ పరిశ్రమ మొత్తానికి వ్యతిరేకంగా చే పట్టిన చర్య కాదని మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి స్పష్టం చే శారు. తెలంగాణలో వందలాది మంది రైస్ మిల్లర్లు దశాబ్దా లుగా ప్రభుత్వం తో నిజాయితీగా పనిచేస్తూ రాష్ట్ర వ్యవసా య ఆర్థిక వ్యవస్థకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు విశేషంగా సహ కరిస్తున్నారని పేర్కొన్నారు.నిబంధనలకు అనుగుణంగా బా ధ్యతలు నిర్వర్తిస్తున్న నిజాయితీ గల మిల్లర్లకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అయి తే, కొంతమంది మిల్లర్లు ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మ కా న్ని దుర్వినియోగం చే స్తూ అనేక సంవత్సరాలుగా ప్ర భు త్వ ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, నిర్ణీత స మయంలో కస్టమ్ మిల్లింగ్ బి య్యం అప్పగించకపోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి తెలిపారు. ఇటు వం టి చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, అం తిమంగా ఆభారం తెలంగాణ ప్రజలపైనే పడుతోందన్నారు.
రైతుల కోసం భారీ కొనుగోలు వ్యవస్థ
దేశంలో అత్యధికంగా వరిసాగు, ధాన్యం సేకరణ జరుగు తు న్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొ న్నారు. ప్రతి వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతులు దళా రుల చేతిలో నష్టపోకుండా, కనీస మద్దతు ధర పొందేలా ప్ర భుత్వం దేశంలోనే అతి పెద్ద ధాన్యం కొనుగోలు కార్యక్ర మా ల్లో ఒకదాన్ని నిర్వహిస్తోందన్నారు.రైతులు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యా న్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫ రాల సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. సాధార ణంగా 48 గం టల్లోనే ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రై తుల బ్యాంకు ఖాతా ల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వి వరిం చారు. ప్రభుత్వ హామీతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూ పాయలు రుణంగా సమీకరించి ఈ కొనుగోలు ప్రక్రియను నిర్వహి స్తున్నామని చెప్పారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్ట మ్ మిల్లింగ్ రైస్ విధానం లో రైస్ మిల్లులకు అప్పగిస్తామని, మిల్ల ర్లు నిర్ణీత నిష్పత్తి లో ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభు త్వానికి అం దించాల్సి ఉంటుంద ని తెలిపారు. ఆ బియ్యాన్ని భారత ఆ హార సంస్థకు అప్పగించ డంతో పాటు జాతీయ ఆహార భద్ర తా చట్టం, ఇతర సంక్షేమ ప థకాల కింద ప్రజలకు పంపిణీ చే స్తున్నామని వివరించారు.ఈ ప్ర క్రియలో ప్రతి సంవత్స రం లక్షలాది మంది రైతులు, వేలాది కొనుగోలు కేంద్రాలు, లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం భాగస్వాముల వుతున్నా యని చెప్పారు.ధాన్యం కొనుగోలు విలువ పదివేల కోట్ల రూపాయల్లో ఉంటుందని, బ్యాం కుల నుంచి తీసుకున్న రుణాలపై కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ పూర్త య్యే వరకు ప్రభు త్వం వడ్డీ చెల్లిం చాల్సి వస్తోందన్నారు. మిల్లింగ్, బియ్యం అప్పగింతలో ప్రతి రోజు ఆలస్యం జరిగినా ప్రభుత్వంపై అ దనపు వడ్డీ భారం పడుతుందని మంత్రి గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆస్తుల దారిమళ్లింపు తీవ్రమైన నేరం
అధిక శాతం రైస్ మిల్లర్లు తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వ ర్తిస్తున్నప్పటికీ, కొంతమంది మిల్లర్ల వద్ద తీవ్రమైన అక్ర మాలు వెలుగుచూశాయని మంత్రి తెలిపారు. నిర్ణీత గడు వులో కస్టమ్ మిల్లింగ్ బియ్యం అప్పగించకపోవడం, ప్రభు త్వ ధాన్యాన్ని అనధికారికంగా విక్రయించడం, ప్రభుత్వ బి య్యాన్ని దారి మళ్లించడం, తక్కువ పరిమాణంలోబియ్యం అప్పగించడం, నిల్వలను దాచిపెట్టడం, రికార్డులను తారు మారు చేయడం, చట్టబద్ధమైన స్టాక్ రిజిస్టర్లను నిర్వహించ కపోవడం వంటి అక్రమాలను గుర్తించినట్లు చెప్పారు.
మిల్లులకు అప్పగించిన ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా విక్ర యించడం, అనేక సీజన్లుగా భారీ సీఎం ఆర్ బకాయిలను పేరుకుపోయేలా చేయడం కూడా తీవ్రంగా పరి గణిస్తున్నా మని తెలిపారు. దారి మళ్లించిన ప్రతి కిలో ధాన్యం ప్రజాధ నంతో కొనుగోలు చేసిన ప్ర భుత్వ ఆస్తేనని మంత్రి స్పష్టం చే శారు. ప్రభుత్వానికి తిరిగి చేరని ప్రతి టన్ను బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనపరుస్తుందని, ఆ నష్టాన్ని చివర కు పన్నులు చెల్లించే ప్రజలే భరించాల్సి వస్తుందని పేర్కొ న్నారు.
నాలుగు సూత్రాలతో ప్రభుత్వ విధానం
ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలో ప్రభుత్వం నాలుగు స్పష్టమైన సూత్రాలను అనుసరి స్తుందని మంత్రి వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుం డా ధాన్యంకొనుగోలు నునిరంత రాయంగా కొనసాగించడం మొ దటి ప్రాధాన్యమన్నారు. ఇతరులు చే సే తప్పులకు రైతులు నష్ట పోకూడదని స్పష్టం చేశారు. రెం డో సూత్రంగా నిజాయితీగల రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అం డగా నిలుస్తుందని చెప్పారు. ఒప్పంద నిబంధనలకు అను గుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిల్లర్లు ఎటువంటి ఆం దోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మిల్లులకు అప్పగించిన ప్రతి ధా న్యం గింజకూ పూర్తి లెక్క ఉండే లా జవాబుదారీతనం కల్పించడం మూడో సూత్ర మని తెలిపారు. ధాన్యం మిల్లుకు చేరిన క్షణం నుంచి బి య్యం ప్రభుత్వానికి అ ప్పగించే వరకు ప్రతి దశకు స్పష్ట మై న రికార్డు ఉండాలన్నారు. ప్రభుత్వ నిల్వల దారి మళ్లింపు, మోసం, నమ్మకద్రోహం, ప్రజాధ నం దుర్వినియోగానికి పా ల్పడిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చట్టాన్ని అమలు చేయడం నాలుగో సూత్రమని మంత్రి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రధృవీకరణ
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ధృవీకరణ కార్యక్రమాన్ని చేపట్టాల ని విజి లెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైస్ మిల్లుల్లో ప్రత్య క్షంగా నిల్వలను పరిశీలించడం, స్టాక్ రిజిస్ట ర్లను తనిఖీ చేయడం, సీఎంఆర్ నిల్వలను ధృవీకరించడం, కొనుగోలు రికార్డులను వాస్తవ నిల్వలతో సరిపోల్చడం వం టి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.ప్రభుత్వ ధాన్యం, బి య్యం నిల్వల్లో కొరత, దారి మళ్లింపును గుర్తించడంతో పా టు అనుమానా స్పద లావాదేవీలపై లోతైన విచారణ జరు పుతామని తెలిపారు.
అక్రమాలకు బాధ్యులైన వ్యక్తుల ను గుర్తించి, అవసరమైన చోట క్రి మినల్ కేసులు నమోదు చేయా లని ఆదేశించారు. ప్రభుత్వ ఆ స్తులు, బకాయిల వసూలుకు చట్టపరమైన చ ర్యలు చేపట్టడంతో పాటు నిరంతరం నిబంధనలు ఉ ల్లం ఘించే మిల్లులను బ్లాక్‌లిస్టు లో పెట్టడం సహా పరిపాలనా పర మైన చర్యలను పరిశీలిస్తామని చెప్పారు.తనిఖీలు, వి చారణల విషయంలో ఏ వ్యక్తికీ, సంస్థకూ మినహాయింపు ఉండదని మంత్రి తేల్చిచెప్పారు.
ప్రజాధనంలో ప్రతి రూపాయినీ వసూలు చేస్తాం ప్రభుత్వా నికి రా వాల్సిన ప్రతి రూపాయినీ సాధ్య మైనంత వరకు తి రిగి వసూలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్ప మని మంత్రి పేర్కొన్నారు. పెండిం గ్ సీఎంఆర్ బకాయిలను మిల్లు లవా రీగా సమీక్షించాలని, వసూ లు ప్రక్రియను వేగవంతం చేయా లని అధికారులను ఆదేశించారు.
ఒప్పందాల కింద ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సెక్యూ రిటీ లను అవసరమైన చోట వినియోగించాలని, బ్యాంకు గ్యారంటీలు, ఇతర ఒప్పందపరమైన రక్షణలను అమలు చే యాలని సూచించారు. అవసరమైన కేసుల్లో సివిల్, క్రిమిన ల్ చర్యలను ఏకకాలం లో చేపట్టాలని ఆదేశించారు. కేవలం శిక్షించడం మాత్రమే ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రభుత్వ ఆస్తు లను తిరిగి స్వాధీనం చేసుకోవడం, ప్రజాధనాన్ని రికవరీ చే యడం, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.సాంకేతికతతో పక డ్బందీ పర్యవేక్షణ భవిష్యత్తులో అక్రమాలకు అవకాశం లేకుండా ధాన్యం కొను గోలు నుంచి బి య్యం అప్పగింత వరకు పటిష్ఠ మైన వ్యవ స్థను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ధాన్యం రవాణాను ప్రారంభ స్థా నం నుంచి గమ్యస్థానం వర కు డిజిటల్‌గా పర్యవేక్షించడం, జీపీఎ స్ ఆధారిత రవాణా పర్యవేక్షణ, నిల్వలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో సరిపో ల్చడం వంటి సం స్కరణలను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. గో దాములు, రైస్ మిల్లుల తనిఖీలను మరింత బలోపేతం చే యడం, గత పనితీరు ఆధారం గా మిల్లులపై రిస్క్ ఆధారిత ఆ డిటింగ్ నిర్వహించడం, ధాన్యం సేకరణ–మిల్లింగ్–ఎఫ్ సీఐకి బియ్యం అప్పగింతకు సంబంధిం చిన డేటాబేస్‌లను అనుసంధా నం చేయడం వంటి చర్యలను చే పట్టనున్నట్లు తెలిపారు. సీఎంఆ ర్ ఖాతాలను నిర్దిష్ట గడువులోగా సరి చూడటం, జిల్లా–రాష్ట్ర స్థా యిలో పర్యవేక్షణను మెరుగుప రచడం, నిర్దిష్ట వ్యవధుల్లో థర్డ్ పార్టీ ధృవీకరణ నిర్వహిం చ డం ద్వారా మొత్తం సరఫరా వ్యవస్థ లో పారదర్శకత, జవా బుదారీత నాన్ని పెంచుతామని మంత్రి పేర్కొన్నారు.
రైస్ మిల్లర్లు తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగ స్వాములని ప్రభుత్వం భావిస్తోoదని మంత్రి తెలిపా రు. పెండింగ్ సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని, రికార్డుల నిర్వ హణలో పారదర్శకత పాటించాలని మిల్లర్లను కోరారు. త మకు అప్పగించిన ప్రభుత్వ ని ల్వలను కాపాడుతూ ప్రభు త్వం –మిల్లింగ్ పరిశ్రమ మధ్య పరస్పర విశ్వాసాన్ని మరిం త బలోపేతం చేయాలని సూచించారు.
చట్టాన్ని, ఒప్పంద నిబంధనలను పాటించే మిల్లర్లకు ప్రభు త్వ సం పూర్ణ సహకారం ఉంటుందని, ప్ర జల ఆస్తులను దు ర్వినియోగం చేసే వారిపై మాత్రం కఠినమైన చట్టపరమైన చ ర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.రైతులకు పూర్తి భరో సా రాష్ట్రంలోని రైతు లు ఎటువంటి ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చా రు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు యథావిధిగా కొ నసాగుతుందని, కనీస మద్దతు ధరకు పూర్తి రక్షణ ఉంటుం దని చెప్పారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ధా న్యం కొనుగోలు అనం తరం మిల్లింగ్, నిల్వలు,బియ్యం అ ప్పగింతలో జరిగే అక్రమాల ప్రభావం రైతులపై పడకుండా ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.“ ప్ర భుత్వం కొనుగోలు చేసే ప్రతి ధాన్యం బస్తా వెనుక రైతు చె మట, కష్టం ఉ న్నాయని, ఖర్చు చేసే ప్రతి రూ పాయి తెలం గాణ ప్రజలకు చెం దిందని ఆయన చెప్పారు. ప్రభు త్వానికి అప్పగించిన ప్రతిధాన్యం గింజ అంతిమంగా అర్హులైన లబ్ధి దారులకు చేరాలి. రైతులను ర క్షించడం, ప్రజాధనాన్ని కాపా డటం, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రతి ద శలో జవాబుదారీతనాన్ని నెలకొల్పడం కోసం ప్రభుత్వం ని ష్పక్షపాతంగా, నిర్భయంగా, కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి కె ప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.




