BRS Dalit Organizations : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేసి ఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో మాజీ శా సనసభ్యు లు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని, ప్రధాన వీధుల వె డల్పు తో పాటు ఎంతో ఆకర్షణీ యమైన కూడళ్లను అభివృద్ధి చే సిన విషయం మనందరికీ తెలి సిందేనని బిఆర్ఎస్ దళిత సం ఘాల నేతలు ధ్వజమెత్తారు. అందులో భాగంగా మర్రి గూడ బై పాస్ రోడ్డు వద్ద అప్పటికే ఉన్న డాక్టర్ బి.ఆర్. అం బేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలతో పాటు ఎంతో ప్రశాంతమైన వాతా వరణంలో బుద్ధుని కాంస్య విగ్ర హాన్ని నెలకొల్పి ప్రత్యేక ‘బుద్ధ వ నం’ ఏర్పాటు చేశారు. చుట్టూ మనోహరమైన పూలతోటలు, అందమైన శిల్పాలు, వాటర్ ఫా ల్స్, విద్యుత్ దీపాల వెలుగుల తో రూపుదిద్దుకున్న ఈ ప్రాంతం సెలవు రోజుల్లో స్థానిక ప్రజలకు, చిన్నారులకు ఒక ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగా మారిందన్నారు.
అయితే మంగళవారం బైపాస్ రో డ్డు నిర్మాణం పేరుతో కాం ట్రాక్టర్, గత ప్రభుత్వం నిర్మించిన శిలాఫ లకాన్ని తొలగించి, కూడలిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. ఈ దాష్టీకాన్ని గమనించిన బిఆ ర్‌ఎస్ పార్టీ నాయకులు, దళిత, బహు జన, వామపక్ష సంఘాల నాయ కులు తక్షణమే రంగానికో చి ఘటనా స్థలంలో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూస్థానిక మంత్రి తమ అ నుయాయుల రియల్ ఎస్టేట్ భూములను కాపాడు కోవడానికి, రింగ్ రోడ్డు సాకుతో నగరం నడి బొడ్డు నుండి రో డ్డు నిర్మాణం చేప డుతూ అనేకమంది పేదల ప్లాట్ల కు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తీ వ్రంగా విమర్శించారు.ఇక్కడున్న మహానీయులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలకు గానీ, బుద్ధవనా నికి గానీ ఏమాత్రం నష్టం వాటిల్లి నా సహించేది లేదని హెచ్చరించారు. నిబంధ నలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ పై వెం టనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కే సు నమోదు చేసి కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశా రు.
పోలీసుల జోక్యం, అధికారుల దిగొచ్చిన తీరు
ధర్నాతో బైపాస్ రోడ్డు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం తో రంగంలోకి దిగిన పోలీసులు ఉన్న తాధికారులతో సంప్ర దింపులు జరిపారు. నాయకుల ఆందోళన, డిమాండ్ల న్యా యబద్ధతను గు ర్తించిన అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లా డి తొలగించిన శిలా ఫ లకాన్ని అప్పటికప్పుడే తిరిగి య థాస్థానంలో ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా, ధ్వంస మైన బేస్‌మెంట్‌ను కూడా వెంటనే కాంక్రీట్‌తో పునర్ని ర్మిం చేలా చర్యలు తీసుకున్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దొడ్డి రమేష్, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకటయ్య, పెరిక కరణ్ జయరాజ్, సిపిఎం నాయ కులు పాలడుగు నాగార్జున, ఎ మ్మార్పీఎస్ నాయకులు బకరం శ్రీనివాస్, బీసీ సంఘం నాయకు లు అయితగోని జనార్ధన్, మాజీ కౌన్సిలర్ గుండ్రెడ్డి యుగంధర్ రె డ్డి, నాయకులు బీపంగి యాద య్య, చందు వంశీ, కడారి యాద య్య, బొజ్జ దేవయ్యలతో పాటు పలువురు పార్టీల, ప్రజా సంఘాల ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.



