Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దామని నల్ల గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళ వారం నల్గొండ లోని ఎన్ జి ప్రభుత్వ కళాశాలలో సంక్షేమ, పోలీస్,ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాల యం, కళాశాల ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి విభాగాల సంయుక్త ఆధ్వ ర్యంలో నిర్వహించిన 10 కోట్ల మాదకద్రవ్య రహిత ప్ర తిజ్ఞ మెగా ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం యువత సామాజిక మాధ్యమాలు, డిజిటల్ , డ్రగ్స్ ,మద్యం,సిగరెట్ వంటి వ్యసనా లకు బానిసలు కావడం వ ల్ల వీటి వినియోగం పెరిగిందని కలెక్టర్ అన్నారు.ఒకప్పుడు డబ్బున్న వా రికి మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్ ఇ ప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీనికి వ్యవస్థతో పాటు, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించా ల్సి ఉందన్నారు. యువతరం అనేక కారణాల వల్ల మా దక ద్రవ్యాల భారిన పడుతున్నారని, దాని వల్ల వారి కెరీర్ నాశ నం అవుతుందని తెలుసుకోవా లన్నారు. డ్రగ్స్ తీసుకోకుం డా నిగ్రహం పాటించాలని, ఒక్కసారి డ్రగ్స్ కు అలవాటు పడితే వ్యక్తిగతంగా, కుటుంబం, సమాజం ప్రభావితమవు తాయని అన్నారు. ఒక దశలో ఏకాకితనం ఆవ హిస్తునదని అన్నారు. ఒక వేళ ఎవరైనా మాదక ద్రవ్యాల భారిన పడితే ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.
తమ చుట్టు పక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ తీసు కొమ్మని బలవంతపెట్టినా, అమ్మినా 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఇప్ప టికే నల్లగొండ జి ల్లా లో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2047 స్వాతంత్ర్య భా రత శతాబ్ది ఉత్సవాల నాటికి మన దేశం ప్ర పంచంలోనే మూడవ ఆర్ధిక శక్తిగా ఎదగాలంటే ముందు డ్ర గ్స్ తీసుకోవడం లాంటి అల వాట్లను యువత పక్కకు పెట్టా లని అన్నారు.ఇప్పటి జెన్ జి త రం డ్రగ్స్ ఫ్రీ తరంగా ఉండా లని ఆకాంక్షించారు. గత మే లో జరిగిన ” ప్రజా పాలన ప్రగ తి ప్రణాళిక” లో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగo వల్ల కలిగే నష్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించామని గు ర్తు చేశారు.
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇ లాంటి సామాజిక కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని ముందుకు తీ సుకుపోవడం అభినందనీయమని అలాగే ఎన్ జికళాశాల ఎన్ ఎస్ ఎస్ ఎన్ సి సి విభాగాలను ఆయన అభినందిం చారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్ ను ఆవి ష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటీండెంట్ ర మే ష్ విద్యార్థులచే “మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ” చేయిం చారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, బ్రహ్మకు మారి రాజయోగి ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవే ణి, డిప్యూటీ డిఎంహెచ్ ఓ నగేష్, జిల్లా లయ న్స్ క్లబ్ గవ ర్నర్ ఆర్. మదన్ మో హన్,శ్రీధర్, ప్రజాపి త బ్ర హ్మకుమారీస్ కుమారి మో నిక, ఎన్ సి సి ఆఫీసర్ లెఫ్టినెం ట్ సిహెచ్ సుధాకర్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్లు, వెంకట్ రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.



