–ఎస్ఎల్బీసీలో ఇప్పటికే క్లిష్ట దశను దాటామని స్పష్ఠీకరణ
–ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీనశిలల మండలాన్ని దాటి న తవ్వకాలు
–ఐదారు నెలల్లో సుమారు 700 మీటర్ల పురోగతి
–అదనపు యంత్రాలు, జర్మనీ నుంచి లోకోమోటివ్‌తో పనుల వేగం పెంపు
Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్: శ్రీశై లం ఎడమగట్టు కాలువ (ఎ స్ ఎల్బీసీ) సొరంగం పనుల్లో అ త్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థి తులను అధిగ మించి కీలక ముం దడుగు వేశామని రాష్ట్ర నీటిపా రుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్రమాదం జ రిగిన ప్రాంతంలోని బలహీన శిల ల మండలాన్ని (షియర్ జోన్) జాగ్రత్తగా దాటడంతో పనుల వే గం పెంచేందుకు మార్గం సుగమ మైందన్నారు. అద నపు యంత్రా లను రంగంలోకి దించి, తవ్విన రాళ్లు, మట్టిని బ యటకు తరలిం చే వ్యవస్థను మెరుగుపరచాలని అధికారు ల ను ఆదేశించారు. ప నుల్లో వేగంతోపాటు కార్మికుల భ ద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇ వ్వాలని స్పష్టం చేశారు.ఉమ్మడి నల్ల గొండ జిల్లాలోని కీలక నీటి పారుదల ప్రాజెక్టుల అమలుపై ప్ర జాప్రతినిధులు, ఉన్నతా ధికా రు లతో మంత్రి ఆదివారం సుదీ ర్ఘ స మీక్ష నిర్వహించారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, అద నపు యంత్రాల వినియోగంపై చ ర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు 3 0 టీఎంసీలకు పైగా నీటిని అం దించి, ఏళ్ల తరబడి వేధిస్తున్న నీటి కొరతను తీర్చాలన్నదే లక్ష్య మని తెలిపారు. 2028 జూన్ నా టికి నీటిని అందించేందుకు ప క్కా కార్యాచరణ రూపొందించి, పు రోగతిని నిరంతరం పర్యవేక్షిం చాలని సూచించారు.ఐదారు నె లల్లో 700 మీటర్లు గడిచిన ఐదా రు నెలల్లో సొరంగం తవ్వ కాలు సుమారు 700 మీటర్లు ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం మంత్రికి వివరించింది. అవుట్ లె ట్ వైపు సుమారు 4 50 మీటర్లు, ఇన్లెట్ వైపు 250 మీటర్ల మేర పురోగతి నమో దైందని తెలిపింది. తీవ్రమైన భూగర్భ, సాంకేతిక సమస్యలతోపాటు యంత్రాలు, తవ్విన పదార్థాల రవాణాలో ఎ దురైన ఇబ్బందులను అధిగమి స్తూ ఈ పురోగతి సాధించిన ట్లు పేర్కొంది. మొత్తం 43.968 కిలో మీటర్ల ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యా యని, మరో 9.1 కిలోమీటర్ల మే ర తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించింది.
అత్యంత ప్రమాదకరమైన షియ ర్ జోన్‌ను దాటడం ప్రాజెక్టు లో ముఖ్యమైన ముందడుగని ఉ త్తమ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితు ల్లో పనిచేసిన అధికారులు, కా ర్మికుల కృషిని అభి నందించారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ సొరంగంలో 20 కి లోమీటర్లకు పైగా లోపల పనిచేస్తున్న సిబ్బంది భ ద్రతను కా పాడేందుకు అధికారు లు, గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జాగ్రత్తగా సాగిన తవ్వకా లుసొరంగం పనులకు నేతృత్వం వహిస్తున్న భారత సైన్యానికి చెం దిన సొరంగ నిర్మాణ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఇన్లెట్ వ ద్ద ఎదురైన పరిస్థితులను వివరిం చారు.
బలహీనమైన నేల, రాళ్లు ఒక్క సారిగా విరిగిపడే రాక్ బర్స్ట్ వం టి ప్రమాదకర పరిస్థితుల కార ణంగా మరో ప్రమాదం జరగకుం డా తొలి నెలల్లో తవ్వకాల వేగాన్ని ఉద్దేశపూర్వకం గానే తగ్గించినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మెషిన్(టీబీఎం) చిక్కుకుపోయిన ప్రాంతాన్ని చుట్టి వెళ్లేలా చేపట్టిన మళ్లింపు త వ్వకాల్లో మ రింత బలహీనమైన శిలల మం డలం ఎదురైంద ని వివరించారు.ఈ ప్రాంతాన్ని సురక్షితంగా దా టేందుకు 140 మిల్లీమీటర్ల సీమ్ లెస్ పైపులతో తవ్వకాలు జరిగే భాగానికి ముందుగా గొడుగు మాదిరి రక్షణ కవచాన్ని ఏర్పా టు చేసిన ట్లు తెలిపారు. బల మైన రిబ్లను అమర్చడం, దశ లవారీగా తవ్వడం, ముందున్న శిలల పరిస్థితిని తెలుసుకునేందుకు ప రీక్షా డ్రిల్లింగ్ చేయడం, అదనపు రక్షణ ఏర్పాట్లతో ప్ర మాదాలను నియంత్రిస్తూ ముం దుకు సాగినట్లు చెప్పారు. ప్ర స్తుతం శిలల పరిస్థితి మెరుగుప డుతుండటంతో సాధారణం గా పనులు సాగించే అవకాశం ఏర్ప డుతోందని తెలిపారు.
..యంత్రాలతో వేగం పెంపు
ప్రస్తుతం రెండు వైపులా కలిపి రో జుకు సుమారు ఎనిమిది మీటర్ల మేర పురోగతి నమోదవుతోందని ప్రాజెక్టు బృందం తెలి పింది. నిరం తరంగా సాధిస్తున్న పురోగతి రో జుకు ఏడు నుం చి ఏడున్నర మీ టర్లుగా ఉందని, ఒకట్రెండు రో జుల్లో పది మీటర్లకు కూడా చేరిం దని వివరించింది. అవుట్లెట్ వద్ద మూడు డ్రిల్లింగ్ భుజాలున్న బూమర్ యంత్రం ఇప్పటికే పని చేస్తోందని, అక్కడ పనులు అ వ సరమైన వేగానికి చేరువలో ఉ న్నాయని తెలిపింది. ఇన్లెట్ వ ద్ద కూడా ఇదే తరహా మరో యం త్రం అక్టోబరులో అందుబాటు లోకి రానుందని పేర్కొంది. వి ద్యుత్‌తో నడిచే లోడర్లు, అధు నాతన ఎక్స్కవేటర్లను కూడా ప నుల్లో వినియోగిస్తున్నట్లు వివరించింది.
జర్మనీ నుంచి తెప్పిస్తున్న రైలు ఇంజిన్ (లోకోమోటివ్) అక్టోబర్ నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని వినియోగంతో తవ్విన రా ళ్లు, మట్టిని వేగంగా బయటకు తరలించవచ్చని, తద్వారా ఒక్కో దఫా పనికి పట్టే సమయం తగ్గు తుందని వివరించారు. సొరంగం లో 21 కిలో మీటర్ల వరకు దూరం నుంచి తవ్విన పదార్థాలను తర లించాల్సి రావడం ప్రధాన అవరో ధంగా ఉందన్నారు. తరలిం పు ఆ లస్యమైతే రాళ్లు, మట్టి లోపల పే రుకుపోయి, వాటిని తొలగించే వరకు తవ్వకాలు నిలిపివేయా ల్సి వస్తోందని తెలి పారు. గతం లో ఒక్క దఫా పని చక్రం పూర్త య్యేందుకు సు మారు 48 గంట లు పట్టేదని, ప్రస్తుతం దానిని 20 నుంచి 24 గంటలకు తగ్గించిన ట్లు ప్రాజెక్టు బృందం వివరించింది. అదన పు యంత్రాలు, వేగవం తమైన తరలింపు వ్యవస్థతో ఈ సమ యాన్ని పది గంటలకు తగ్గిం చగలమని అంచనా వేసింది.
అక్టోబర్ చివరి లేదా నవంబర్ ప్రారంభం నుంచి పనుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైన యం త్రాలను సకాలంలో సమకూర్చి, తవ్వకాల ప్రతి దశలో సామర్థ్యా న్ని పెంచాలని మంత్రి ఆదేశించారు.2028 మే–జూన్‌లో ప్రధాన సొరంగం అనుసంధానం లక్ష్యం
టన్నెల్–1లో రెండు వైపుల నుంచి సాగుతున్న తవ్వకాలు 2028 మే–జూన్ నాటికి కలిసే దశకు చే రుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తవ్వకాలతో పాటే సొరంగం లోపలి గోడలను బలపరిచే స్ప్రే లైనింగ్ పనులు చేపడుతు న్నారని, దీంతో సొరం గం అనుసంధానం పూర్తయ్యేలో పే లైనింగ్లో అధిక భాగాన్ని పూ ర్తి చేసే అవకాశం ఉందని సమీ క్షలో వివరించారు.
ప్రధాన సొరంగంతోపాటు టన్నె ల్–2, బ్యాలెన్సింగ్ రిజర్వాయ ర్, ఇతర అనుబంధ పనులను కూడా సకాలంలో పూర్తి చేయా లని ఉత్తమ్ ఆదేశించారు. వీటి లో ఏ పని అసంపూర్తిగా ఉ న్నా నీటి సరఫరాకు ఆటంకం కలగ కుండా ముందుగానే చర్య లు తీ సుకోవాలని సూచించారు. సు మారు 7.1 కిలోమీటర్ల పొడవు న్న టన్నెల్–2లో సుదీర్ఘ విరా మం తర్వాత లైనింగ్ పనులు తి రిగి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ఎంపీలు కె. రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్ కుమార్రె డ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, కె. జైవీర్‌రెడ్డి, వేము ల వీరేశం, అనిల్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్; నీటి పా రుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్; ఇంజినీర్ ఇన్ చీఫ్ ఓ.వి. రమేష్ బాబు, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువన గిరి, మహబూ బాబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Minister Uttam Kumar Reddy


