Monday, October 12, 2026
More
    Homeఆంధ్రప్రదేశ్Vijayawada tragedy EV car fire accident : బిగ్ బ్రేకింగ్, విజయవాడ బైపాస్‌ పై...

    Vijayawada tragedy EV car fire accident : బిగ్ బ్రేకింగ్, విజయవాడ బైపాస్‌ పై ఘోర విషాదం, ఈవీకారులో నలుగురు సజీవ దహనం

    📰 Generate e-Paper Clip

     

    –రెయిలింగ్‌ను ఢీకొని క్షణాల్లో మంటల్లో చిక్కుకున్న ఎలక్ట్రిక్ కారు

    Vijayawada tragedy EV car fire accident :  ప్రజా దీవె న, విజయవాడ: విజయవాడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రవిషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్‌ (ఈవీ) కా రు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండ గానే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

    ఈ ప్రమాదంలో కారు లో ప్రయా ణిస్తున్న నలుగురు మంటల్లో చిక్కుకుని సజీవ ద హనమైనట్లు సమాచారం. మరో వ్యక్తి తీ వ్రంగా గాయపడటం తో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు స్తోంది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు.

    ప్రమాదంతో బైపాస్‌పై తీవ్ర కలకలం నెలకొంది. కారు మంటల్లో పూర్తిగా దగ్ధం కావడంతో ఘట నాస్థలంలో విషాదకర వాతా వరణం ఏర్పడింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

    Vijayawada tragedy EV car fire accident

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.