— ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ప్రయోజనం
Telangana government Sweet News : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (F TE) కు రేవంత్ రెడ్డి ప్ర భుత్వం తీపికబురు అందించింది. ఎన్నో ఏ ళ్లుగా గ్రాట్యుటీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల పో రాటా నికి ఫలితం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 3,800 మం ది ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజా గా అధికారిక ఉత్తర్వు లు జారీ చేసినట్లు సమాచారం.
కనీసం రూ.4 లక్షలు,గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం అర్హులైన ఉద్యో గులకు పదవీ విరమణ సమయంలో కనీసం రూ.4 లక్షల గ్రాట్యుటీ లభించనుంది. పదేళ్ల స ర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సుమారు రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రయో జనం చేకూరే అ వకాశం ఉంది. దీంతో దీర్ఘకాలంగా సేవలం దిస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భ రోసా లభించనుంది.
ఉద్యోగ సంఘాల్లో హర్షాతిరేకాలు
ఏళ్ల తరబడి తమ హక్కు కోసం పోరాడిన ఉద్యో గులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. పదవీ విరమణ తర్వాత కుటుంబ పోషణ, ఆర్థిక అవసరాలకు గ్రాట్యుటీ ఉపయోగపడుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. దసరా పం డుగకు ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యో గులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, సం బంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల భవి ష్యత్తుకు భరోసా కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలక ముంద డుగుగా నిలుస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Telangana government Sweet News

