–సీఎంఆర్ బకాయిల వసూలుకు RR చట్టం ప్రయోగం –యంత్రాల వేలానికి రంగంసిద్ధo
Civil supplies department key news : ప్రజా దీవెన, హైదరాబాద్: ధా న్యం సేకరణకు సం బంధించిన కస్టమ్ మి ల్లింగ్ రైస్ (CMR) బకాయిల వసూలుపై తెలంగాణ పౌర స రఫరాల శాఖ మరిం త కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధ మైంది. ప్రభుత్వానికి బియ్యం లేదా ధాన్యం అప్పగించకుండా బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవ రీ (RR) చ ట్టం కింద చర్యలు చేపట్టాలని నిర్ణ యిం చింది. అవసరమైతే బకాయిదారుల ఆస్తులను జ ప్తు చేయడంతోపాటు మిల్లు ల్లో ని యంత్రాలను వేలం వేసి బకాయిలను రాబట్టేందుకు కార్యా చరణ రూపొందిస్తోంది.
అధికారులకు కమిషనర్ కీలకఆదేశాలు
పౌర సరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అ ఫీషియో ప్రిన్సి పల్ సెక్రటరీ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.. బకాయిల వసూలుకు చేపట్టాల్సిన చ ట్ట పరమైన చర్య లపై క్షేత్రస్థాయి అధికారులకు శి క్షణ ఇచ్చారు. మూడు బ్యాచ్ లుగా పాల్గొన్న డిప్యూటీ తహశీల్దార్లకు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వ హించవద్దని సూచించారు. నిబంధనల ప్రకారం ని జాయితీగా, నిర్భయంగా పనిచేసే అధికారులకు శాఖాపరమైన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చా రు.
ప్రతి బుధవారం ఆకస్మిక తనిఖీలు
బకాయిదారుల వద్ద నిల్వల వివరాలను గుర్తించేందుకు ఫి జికల్ వెరిఫికేషన్ (PV) మొబైల్ యాప్ను వినియోగిం చను న్నారు. ప్రతి బుధవారం రైస్ మిల్లుల్లో ఆకస్మిక స్టాక్ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. తనిఖీల సమయంలో నిల్వల వివ రా లు, ధాన్యం, బియ్యం లెక్కలను పరి శీలించి, అవ సర మైన డిజిటల్ ఆధారాలను సేకరించేలా అధికా రులకు శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్త కుండా చట్టబద్ధమైన వి ధానాల్లోనే చర్యలు చేపట్టడంపై దృష్టి సారించా రు.
బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ
శిక్షణ అనంతరం అధికారుల సామర్థ్యాన్ని పరీక్షిం చేందుకు ప్రాక్టి కల్ మాక్ టెస్టులు నిర్వహించారు. నగదు రూపంలోనై నా, ధాన్యం లేదా బియ్యం రూ పంలోనైనా ప్రభుత్వానికి రావా ల్సిన బకాయిలను నిబంధనల ప్రకారం వసూలు చేయడమే లక్ష్యంగా శాఖ ముందుకు సాగుతోంది.
జిల్లా స్థాయి అధికారులకూ శిక్షణ
తదుపరి దశలో జిల్లా పౌర సర ఫరాల అధికారులు (DCSO లు), జిల్లా మేనేజర్లకు (DMలు) కూడా ఇదే తరహా చట్ట పర మైన, వ్యూహాత్మక శిక్షణ ఇవ్వనున్నా రు. ప్రభుత్వ ఖజా నాకు రావాల్సిన బకా యిలను రాబట్టడం, ప్రజాధనాన్ని పరి రక్షిం చడం లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ ఈ చర్యలను చేప డు తోంది. బకా యిల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై చట్టప్ర కారం చర్యలు తీసుకునే దిశగా అధికారులు సిద్ధమవుతున్నారు.
Civil supplies department key news


