Thursday, October 15, 2026
More
    HomeOpinionDeputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలక ప్రకటన, తెలంగాణలో పె...

    Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలక ప్రకటన, తెలంగాణలో పె ట్టుబడులకు రెడ్ కార్పెట్‌, పారి శ్రామికవేత్తలకు ప్రభుత్వం అండ గా ఉంటుంది

    📰 Generate e-Paper Clip

    –సింగిల్‌ విండో ద్వారా అనుమ తులు, భూమి, విద్యుత్‌, నీటి స దుపాయాలు కల్పిస్తాం

    –పెట్టుబడిదారులకు గార్డియన్‌ గా ఉంటా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లో భాగస్వాములు కావాలి

    — సమాఖ్య గ్లోబల్‌ బిజినెస్‌ మీ ట్‌–2026లో ఉప ముఖ్య మం త్రి భట్టి విక్రమార్క పిలుపు

    Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరా బా ద్‌: తెలం గాణను పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే ల క్ష్యంతో రా ష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తుంద ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క స్పష్టం చే శారు. రాష్ట్రం లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే వారికి సింగిల్‌ విండో విధానంలో అనుమతులు, అవసర మైన భూమి, విద్యు త్‌, నీటి సదుపాయాలు కల్పిస్తామని భరో సా ఇచ్చారు. పెట్టుబడిదారులకు తాను గార్డియన్‌గా ఉంటా నని ప్రకటిస్తూ, తెలంగాణ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములు కా వాల ని ప్రపంచవ్యాప్తంగా ఉ న్న పారిశ్రామికవేత్తలకు పిలుపు ని చ్చారు.హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన సమా ఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గ్లోబల్‌ బి జినెస్‌ మీట్‌–2026లో భట్టి విక్ర మార్క మాట్లాడుతూ సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తల కు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరిశ్ర మల స్థాపనలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొ స్తే వాటి పరి ష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

      పెట్టుబడులకు హైదరాబాద్‌ అనుకూల కేంద్రం

    శాంతిభద్రతలు, మెరుగైన మౌ లిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అను కూలమైన వ్యాపార వాతావ రణం హైదరాబాద్‌కు ప్రధాన బలాలని ఉప ముఖ్యమంత్రి వి వరించారు. భౌగోళికంగా అనుకూలమైన స్థానం, పారిశ్రామిక అవస రాలకు తగిన భూమి, విద్యాసం స్థల ద్వారా అందుబా టులోకి వస్తున్న నైపుణ్యవంతులైన యువత తెలంగాణకు పె ట్టుబడుల ను ఆకర్షించే అంశాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న వ్యా పారవేత్తలు రాష్ట్రంలోని అవక శాలను సద్వి నియోగం చేసుకో వాలని, తమ వ్యాపారాలను వి స్తరించడం తో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించా లని కోరారు.

      మూడు ప్రాంతాలుగా అభివృద్ధి ప్రణాళిక

    హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల ను కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (కో ర్‌), పెరి అర్బన్‌ రీజియన్‌ (ప్యూర్‌), రూరల్‌ అగ్రికల్చర్‌ రీజి య న్‌ (రే ర్‌)గా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తు న్న ట్లు భట్టి వి క్రమార్క వెల్లడించారు.కోర్‌ అర్బన్‌ ప్రాంతంలో ఐ టీ, సేవారంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులుకి ప్రా ధాన్యం ఇస్తామని తెలిపారు. పెరి అర్బన్‌ ప్రాంతంలో పరిశ్ర మ ల అవసరాలకు అ నుగుణంగా ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ప్రతి పాదిత రీ జినల్‌ రింగ్‌ రోడ్డు మ ధ్య ప్రాంతాలను అనుసంధానిం చేలా రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించా రు. ఇప్ప టికే 21 రేడియల్‌ రోడ్ల కు సంబంధించి మంజూరు, రూ పకల్పన ప్రక్రియ చేపట్టినట్లు పే ర్కొన్నారు.

    ఈ అనుసంధానంతో ఫార్మా, బ యోటెక్నాలజీ, విద్య, సాఫ్ట్‌ వేర్‌, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి రంగాలకు ప్రత్యేక పారిశ్రా మిక క్ల స్టర్లను అభివృద్ధి చేసే అవకాశాలు మెరుగుపడతా య ని చెప్పారు. గ్రామీణ వ్యవసాయ ప్రాంతా ల్లో వ్యవసాయ ఆ ధారిత పరిశ్ర మలను ప్రోత్సహించి స్థానిక వన రులకు విలువ జోడించడంతో పాటు గ్రామీణ యువతకు ఉపా ధి కల్పించేలా ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు తెలిపారు.

    సంపద సృష్టిలో పరిశ్రమలదే కీలక పాత్ర

    రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతా ని కి వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవారంగాలు కీలకమని ఉప ముఖ్యమంత్రి అన్నారు. తెలంగా ణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీ ఎస్‌ డీ పీ)లో వ్యవసాయ రంగం వాటా సుమారు 16 శాతం కాగా, సే వారంగం వాటా సుమారు 65 శాతంగా ఉందని వివరించారు.
    ఫార్మా, కోర్‌ ఇండస్ట్రీలు, ఆక్వా, ఎగుమతులు, దిగుమతులు, ఐ టీ, పారిశ్రామిక మౌలిక సదుపా యాలు తదితర రంగాల్లోని వ్యా పారవేత్తలు రాష్ట్ర అభివృద్ధికి మరింతగా దోహదపడాల ని కోరారు. పరిశ్రమలు విస్తరించడం ద్వారా పెట్టుబడులు, ఉ పాధి, ప్ర భుత్వ ఆదాయం పెరిగే అవకా శాలు ఉన్నాయని పేర్కొన్నారు.

    పరిశ్రమల సమస్యల పరిష్కారానికి భరోసా

    సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధా లా సహకరిస్తుందని భట్టి విక్ర మార్క హామీ ఇచ్చారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స హా రాష్ట్ర మంత్రివర్గం పెట్టుబడి దారులకు అవసరమైన సహకా రం అందించేందుకు సిద్ధంగా ఉం దన్నారు.పరిశ్రమల స్థాపనకు అ వసరమైన అనుమతులు, భూ మి, విద్యుత్‌, నీటి సదుపాయా ల కల్పనలో ప్రభుత్వం తోడ్పడు తుందని స్పష్టం చేశారు. ఐటీ, ఏరోస్పేస్‌, రక్షణ, వ్యవసాయం, సినీ పరిశ్రమ సహా వివిధ రంగా ల్లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని వివరించారు.


    అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

    సంపద కొద్దిమంది చేతుల్లోనే కేం ద్రీకృతం కాకుండా, అభివృద్ధి ఫ లాలు సమాజంలోని అన్ని వర్గా లకు అందాలని ఉప ము ఖ్యమంత్రి ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్తలు తమ అనుభ వాన్ని, పరిజ్ఞా నాన్ని కొత్తగా వ్యాపారాలు ప్రా రంభించేవారితో పంచుకోవాలని సూచించారు.ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందడం సమగ్ర ప్రగతి కాదని, తమతోపాటు మరో పది మందిని ముందుకు తీసుకెళ్లిన ప్పుడే సమాజం నిజమైన అభి వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారి శ్రామికవేత్తలకు ప్రభుత్వం అం డగా నిలుస్తుందని పునరుద్ఘాటిం చారు.తెలంగాణలో పరిశ్రమ లు స్థాపించండి.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కం డి.. యువత కు ఉపాధి కల్పించి స మగ్ర ప్రగతి కి బాటలు వే యండి అని భట్టి విక్రమార్క పారిశ్రామిక వేత్తలకు పిలుపుని చ్చారు.

    Deputy CM Bhatti Vikramarka

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.