Wednesday, October 21, 2026
More
    Homeనల్గొండBurri Chaitanya Srinivas Reddy : రామగిరి రామాలయంలో వైభవంగా విజయదశమి వేడుకలు

    Burri Chaitanya Srinivas Reddy : రామగిరి రామాలయంలో వైభవంగా విజయదశమి వేడుకలు

    📰 Generate e-Paper Clip

     

    –ప్రత్యేక పూజలు, జమ్మి పూజలలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు

    Burri Chaitanya Srinivas Reddy :  ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: నల్లగొండ నగరంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వా మి దేవాలయం లో విజయదశమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, వై భవం గా నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్క రిం చుకుని ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంది. ప్రత్యేక పూజలు, జమ్మి పూజ కార్యక్రమాలతో ఆల యంలో పండుగ సందడి నెలకొంది. ఈ వేడుకల్లో నల్లగొండ మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంప తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి పూజ అనంతరం ఆలయంలో విజయదశమి వేడుకలు ఘ నంగా కొనసాగాయి. పండుగ సంద ర్భంగా భక్తు లు పెద్ద సం ఖ్యలో ఆలయానికి చేరు కుని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

     విజయానికి ప్రతీక విజయదశమి

    ఈ సందర్భంగా మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి దంపతు లు మాట్లాడుతూ చెడుపై మంచి సా ధించిన విజయానికి ప్రతీ కగా విజయదశమి పండు గను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపు కుంటారని పేర్కొ న్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లకు దసరా పండుగ ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని తెలిపా రు.హిందూ సంప్రదాయంలో జమ్మిపూజకు విశేష ప్రాధాన్యత ఉందని, తరతరాలుగా ఈ ఆచారాన్ని భక్తితో కొనసాగిస్తున్నా రని వివరించారు. పం డుగలు ప్రజల మధ్య సోదర భావం, ఐ క్యతను పెంపొందించ డంతో పాటు మన సంస్కృతి, సంప్రదా యాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తా యని పేర్కొన్నారు.

    విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతో షాలు, శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి ని తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్ర మంలో నల్ల గొండ మున్సిపల్ కా ర్పొరేటర్ అ బ్బ గోని కవిత రమేష్ గౌడ్, వేణు గోపాల్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి , పలువురు కార్పొరేటర్లు, బిజెపి రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, ఆలయానికి వచ్చిన భక్తు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    Burri Chaitanya Srinivas Reddy

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.