–నల్గొండ రైతాంగ చిరకాల ఆ కాంక్షలకు ముందడుగు
–డీకే అరుణ డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సరికాద
–పాలమూరు,రంగారెడ్డికి జాతీ య హోదా కోసం కృషి చేయాలి
Mlc Gutha Sukender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: డిం డి ఎత్తిపోతల పథకానికి 0.5 టీఎంసీల నీటిని కేటాయిం చా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయ మ ని తెలంగాణ శాసన మండలి చై ర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా రు. ఈ నిర్ణయం ఉమ్మడి నల్గొం డ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష లను నెరవేర్చే దిశగా కీలక ముం దడుగని పేర్కొన్నా రు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు.నల్గొండలోని తన క్యాంపు కార్యా లయంలో ఆ దివారం నిర్వహిం చిన మీడియా సమావేశంలో గుత్తా సుఖేం దర్ రెడ్డి రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వినియో గం, డిండి ఎత్తిపోతల పథ కం, పాలమూరు–రంగారెడ్డి ప్రా జె క్టులపై మాట్లాడారు.
డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సమంజసం కాదు
డిండి ప్రాజెక్టును రద్దు చేయాలం టూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు సరికావని గుత్తా అభిప్రాయప డ్డారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కంటే, రెండు జిల్లాల రై తాంగానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రజాప్రతినిధు లు కృషి చేయాలని సూచించారు. బీజేపీ ఎంపీ గా కేంద్ర ప్రభు త్వంపై ఒత్తిడి తీ సుకొచ్చి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించాలని కోరారు. జాతీయ హోదా లభిస్తే నిధుల సమీ కరణకు, ప్రాజెక్టు పనుల వేగవం తానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు జీవనాధారం డిండి
డిండి ఎత్తిపోతల పథకం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కా దని, దశాబ్దాలుగా ఫ్లోరైడ్ స మస్యతో ఇబ్బందులు ఎదు ర్కొం టున్న దేవరకొండ, మునుగోడు ప్రాంతాల ప్రజలకు సురక్షి తమైన నీటిని అందించాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక పథకమని గుత్తా వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్ర జల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు.
నీటి వనరులను జిల్లా సరిహద్దు ల పేరుతో విభజించి వివా దా లకు తావివ్వడం సరికాదని పేర్కొన్నా రు. ఏ జిల్లా నీరు ఆ జి ల్లాకే పరి మితం కావాలనే వాదనను అను సరిస్తే, అంతర్రాష్ట్ర జలాల విష యంలో తెలంగాణకే ఇబ్బందు లు ఎదురయ్యే ప్రమాదం ఉంద న్నారు. ఏఎంఆర్పీ ద్వారా హైద రాబాద్‌కు 30 టీఎంసీల నీటిని అందిస్తున్న విషయాన్ని గుర్తుచే స్తూ, రాష్ట్ర సమగ్ర ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకొని నీటి విని యోగంపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిపా దిత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యం ఉందని, ప్రస్తుతం 7.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబం ధించిన సాగు నీటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం, డిండి, దేవాదుల తది తర ప్రాజెక్టుల ద్వారా 7.58 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందిం చే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ప నులు పూర్తిస్థాయిలో పూర్తి కా లేదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో కృ ష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు త గి న ప్రాధాన్యం దక్కలేదని విమ ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఖర్చు చేసిన నిధుల్లో సగం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కేటా యించి ఉంటే, మరిన్ని ప్రాజెక్టులు పూర్త య్యేవని అభిప్రాయ పడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూ ర్తయ్యే వరకు ప్ర త్యామ్నాయంగా లిఫ్ట్ విధానం ద్వారా నీటిని అందించే అవ కాశాలను పరిశీలించా లని సూచించారు. రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అం దించేందుకు అందుబాటులో ఉన్న అ న్ని మార్గాలను వినియోగించుకోవాలని అన్నారు.
పాలమూరు రైతాంగానికి సాగు నీరు అత్యవసరం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో సుమారు 10 లక్షల ఎకరా లకు సాగునీరు అందించాలనే ప్రతిపాదనలు ఉండగా, 8.50 లక్షల ఎకరాలకు సంబంధించిన సాగునీటి సదుపాయాలు ఉన్నా యని గుత్తా తెలిపారు. పాలమూరు ప్రాంతంలో దశా బ్దాలుగా కొనసాగుతున్న వలసలను అరి కట్టాలంటే రైతులకు సాగునీరు అందించడం అత్యంత కీలకమని చెప్పారు. పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత రై తాంగానికి గణనీయమైన ప్రయో జనం చేకూరుతుందని పేర్కొన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులు నీటి కోసం ప ర స్పరం వివాదాలుపడటం వల్ల రెండు ప్రాంతాలకూ నష్టమే జ రుగుతుందని హెచ్చరించారు. ఇరు జిల్లాల రైతాంగ ప్రయోజ నాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.
చర్చలతోనే జల సమస్యలకు పరిష్కారం
రాష్ట్రాల మధ్య జలవనరులకు సంబంధించిన సమస్యలను చ ర్చల ద్వారా పరిష్కరించుకో వా లని గుత్తా సుఖేందర్ రెడ్డి సూ చించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తో తెలంగాణ ప్రభుత్వం జరుపు తున్న చర్చలు సఫలమై రాష్ట్రా నికి అనుకూలమైన ఫలితాలు రావాలని ఆకాంక్షించారు. సాగు నీటి ప్రాజెక్టుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీపీఐ, సీపీఎం నా యకులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులను అభినందించారు.ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, నీటి లభ్యతకు సం బంధించి న పరిస్థితులను ప్రజ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిం చారని పేర్కొన్నారు. రా ష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రా జెక్టు లను పూర్తి చేయాలనే సంక ల్పంతో ప్రభుత్వం ముందుకు సా గుతోందని తెలిపారు.
రాజకీయాలకుఅతీతంగా రైతుల ప్రయోజనాలే ముఖ్యం
ప్రాంతీయ విభేదాలు, రాజకీయా లకు అతీతంగా నల్గొండ, మ హబూబ్‌నగర్ జిల్లాల రైతాంగ ప్రయోజనాల కోసం ప్రజాప్ర తినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసం ఘాలు సమష్టిగా కృషి చేయాల ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పి లు పునిచ్చారు. కృష్ణా బేసిన్లో పెండింగ్ ప్రాజె క్టు లను త్వరితగ తిన పూర్తి చేసి రై తులకు సాగునీరు అందించడమే అత్యంత ప్రాధాన్య అంశమని ఆయన స్పష్టం చేశారు.
Mlc Gutha Sukender Reddy


