–రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష సూచన
–ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Telangana Weather report : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వాయు గుండం ప్రభావం చూపే అ వకాశాలు ఉండటంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. రా ష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూ చనలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భూపాలపల్లి, హన్మకొండ, మహ బూబాబాద్, వరంగల్, సిద్దిపే ట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చే సింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉ న్నట్లు హెచ్చరికలు జా రీ అయ్యా యి.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూ చిస్తున్నారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞ ప్తి చేస్తున్నారు.వాయుగుండం ప్రభావం తో రాష్ట్రంలో వర్షాలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు, రై తులు అప్రమత్తంగా ఉండాలి.
Telangana Weather report

