Sunday, October 25, 2026
More
    HomeOpinionEx minister Jagadish Reddy : మునుగోడులో కరువు విలయ తాండవం, రైతుల కన్నీళ్లు ప్రభు...

    Ex minister Jagadish Reddy : మునుగోడులో కరువు విలయ తాండవం, రైతుల కన్నీళ్లు ప్రభు త్వానికి కనిపించడం లేదా?

    📰 Generate e-Paper Clip

    –కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిప్పులు

    Ex minister Jagadish Reddy ప్రజా దీవెన, చండూరు: రా ష్ట్రంలో కరువు విలయతాండ వం చేస్తోందని, ముఖ్యంగా ము నుగోడు నియోజకవర్గంలో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వి మర్శించారు. చండూరులో మీ డియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజక వర్గంలో ఎటుచూసినా ఎండిపోయిన పత్తి చేలు, వరి పొలాలే క నిపిస్తున్నాయని, రైతుల కష్టాల ను పట్టించుకు నే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు.

    రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శ

    మునుగోడు ఎమ్మెల్యేకు నియోజ కవర్గ ప్రజల సమస్యలపై శ్రద్ధ లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. మంత్రి పదవుల పం చాయితీలు, కాంట్రాక్టులు, బిల్లుల వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ రోపించారు. మునుగోడు ప్రాంతం తీవ్ర సమ స్యల్లో చిక్కుకు న్నా, ప్రజల కష్టాలను పరిష్కరించేందుకు తగి న చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.నల్లగొండ జిల్లా లో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని విమర్శించారు. హెలికాప్టర్లలో తిరగ డం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

      24 గంటల ఉచిత విద్యుత్ ఏదీ?

    గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందిం చిన 24 గంటల ఉచిత వి ద్యుత్‌ ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అందించలేక పోతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రైతులకు రోజుకు ఐదా రు గంట ల విద్యుత్ కూడా సరిగా రావ డం లేదని, దీంతో మోటార్లు, స్టా ర్టర్లు కాలిపోతున్నాయని అన్నారు. ట్రాన్స్‌ ఫార్మర్ కాలిపోతే రోజు ల తరబడి మరమ్మతులు చేయ డం లేదని విమర్శించారు.రైతులకు అవసరమైన విద్యుత్ సరఫ రాపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చే శా రు. ప్రజలు ప్రభుత్వ పనితీ రు ను గమనిస్తున్నారని, తగిన స మయంలో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారని హె చ్చరించారు.

    మళ్లీ ఫ్లోరైడ్ సమస్య తలెత్తిందని ఆరోపణ

    మునుగోడు ప్రాంతంలో మరోసారి ఫ్లోరైడ్ సమస్య తలెత్తుతోం దని జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తో ఫ్లోరైడ్ సమస్యను నియంత్రిం చి, ప్రజలకు సురక్షిత తాగునీరు అందించారని పేర్కొన్నారు. ప్రస్తు త ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు తాగు నీ రు అందించడంలో వి ఫలమవుతోందని ఆరోపించారు. ప్రజ లకు కనీస మౌలిక వసతు లు, రైతులకు నాణ్యమైన విద్యు త్, తాగునీరు అందించడంలో ప్ర భుత్వం తక్షణ చర్యలు తీసు కోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    నల్లగొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఓటు నమోదు

    నల్లగొండ:గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్లగొం డ పట్టణంలో ఓటరు నమోదు ప్రక్రి య ఊపందుకుంది. శని వారం నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి పలు వురు యువ కులు, విద్యావంతులు స్వచ్ఛం దంగా తరలి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు.ఓటరు నమోదుకు సంబంధించిన ఫారా లను అందజేసిన యువత అనం తరం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన యువతను అభినందించి, ప్రజాస్వామ్య ప్రక్రి యలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

      యువత చైతన్యంతోనే మార్పు సాధ్యం

    ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మా ట్లాడుతూ యువత చైతన్య వం తంగా ఆలోచించి, తమ ఓటు హక్కును బాధ్యతగా విని యో గించుకోవాలని అన్నారు. ఎన్ని క ల సమయంలో ఇచ్చిన హామీల ను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని విమ ర్శించారు. రాబోయే గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగా తీర్పు ఇవ్వాలని యువతకు పిలుపుని చ్చారు.గ్రాడ్యుయేట్లు ఓటరు న మోదు ను పూర్తి చేసుకోవడంతో పాటు, ప్రజాస్వామ్యాన్ని బలోపే తం చేసేలా ఎన్నికల్లో భాగస్వా ములు కావాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మం కెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, నల్లగొండ మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కార్పొరేటర్ మారగోని భవాని గణేష్, రావుల శ్రీనివా స రెడ్డి, కన్నారావు, పెండం ధనంజయ, గంజి రాజేందర్, బొ మ్మర బోయిన నాగార్జున, రాపోలు వెం కటేశ్వర్లు, గాదె వివేక్ రెడ్డి తది త ర నాయకులు పాల్గొన్నారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుపై యువతలో ఆసక్తి పెరుగుతోం దని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చేసుకోవడం కీ లకమని నాయకులు పేర్కొన్నా రు.

    Ex minister Jagadish Reddy

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.