–నవంబర్ 1న రాంలీలా మైదా నంలో ఇండియా కూటమి మహార్యాలీ
–నల్లగొండ జిల్లా నుంచి 2,000 మంది తరలిరావాలి
— ఏఐసీసీ పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి
Pcc ChaloDelhi Voting Rights Protest : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హ క్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ లక్ష్యం గా నవంబర్ 1న నిర్వ హించనున్న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో ఓట్ల తొలగిం పు పై నిరసనగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూట మి ఆధ్వర్యంలో జరిగే మహా ర్యాలీకి నల్లగొండ జిల్లా నుంచి సుమారు 2, 000 మంది తరలిరావాలని కో రారు.సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాంభూపాల్రెడ్డి, వినోద్ రెడ్డి అనంతరం మీ డియా సమావేశంలో మాట్లాడా రు.
దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించా రంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానే శ్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఓటర్ల జాబితాలో అక్రమా లు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కుకు భంగం కలిగితే ప్రజాస్వా మ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలకు ఆశించిన ప్రయోజనాలు అందలేదని వారు విమర్శించారు. ప్రజల్లో ప్రభు త్వంపై అసంతృప్తి పెరుగుతోంద ని, అందుకే ఓటర్ల జాబితా అంశం రాజకీయంగా ప్రాధాన్యం సం తరించుకుందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి
సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కాపాడాల్సిన అ వసరం ఉందని కాంగ్రెస్ నేత లు పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల క మిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓటును కాపాడు కుందాం, దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఛలో ఢిల్లీ కార్య క్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నవం బర్ 1న ఢిల్లీలో జరి గే ఇండియా కూటమి మహా ర్యా లీలో కాంగ్రెస్ కార్యకర్తలు, నా యకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు జిల్లపల్లి పరమే ష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, టీపీసీసీ మేని ఫె స్టో కమిటీ సభ్యుడు చామల శ్రీని వా స్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమయ్య, మిర్యాల గూడ మున్సిపల్ చైర్మన్ చిలు కూరి బాలకృష్ణ, వివిధ మండ లాల కాంగ్రెస్ అధ్య క్షులు గథగోని కొండయ్య, లింగాల వెంకన్న, ఎడ్ల ప్రవీణ్, అల్లం పల్లి జానయ్య, గాయం శ్యామ్ సుందర్ రెడ్డి, ఎదులపురి కృష్ణ, ఎల్లంపల్లి నరసింహ, మర్రి చంద్రారెడ్డి, మేకల సాగర్ రెడ్డి, భీమ నపల్లి సైదులు. మ హిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సు కన్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, సీనియర్ కాంగ్రెస్ నాయకు లు, ఎన్‌ఎస్‌యూఐ,యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Pcc ChaloDelhi Voting Rights Protest


