Tuesday, October 27, 2026
More
    HomeOpinionNalgonda SP Sharath Chandra Pawar : పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘననివాళి, నల్లగొండలో బైక్...

    Nalgonda SP Sharath Chandra Pawar : పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘననివాళి, నల్లగొండలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి న ఎస్పీ శరత్ చంద్రపవార్

    📰 Generate e-Paper Clip

    Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన ,నల్లగొండ క్రైమ్: దేశ రక్షణలో, ప్రజల ప్రాణాలు మరియు ఆ స్తుల పరిరక్షణలో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ న ల్లగొండ పట్టణంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీ స్ అమరవీరుల సంస్మరణ వారో త్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమై న ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ దేశ వ్యా ప్తంగా ఈ ఏడాది 154 మంది, తె లంగాణలో నలుగురు పోలీసు లు విధి నిర్వహణలో అమరుల య్యారని తెలిపారు. వారి త్యా గాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరి రక్షణ, ప్రజల భద్రత కోసం పోలీసులు అనేక స వాళ్లు, ప్రమాదా లను ఎదుర్కొంటూ నిరంతరం విధులు నిర్వ ర్తిస్తున్నారని చెప్పారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరు ల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయ కమని, వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత మె రుగైన సేవలు అందించడ మే వారికి అర్పించే నిజమైన ని వా ళి అని ఎస్పీ స్పష్టం చేశారు.

    పోలీసుల సేవలపై ప్రజల్లో అవగాహన

    పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం అ మరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతో పా టు, పోలీ సుల విధి నిర్వహణలో ఎదు ర య్యే సవాళ్లపై అవ గాహన కల్పించడమేనని ఎస్పీ వివరించారు. ప్రజలు పోలీసు లకు సహకరించాలని, చట్టాలను గౌరవిస్తూ సమాజంలో శాం తిభద్రతల పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించా లని పిలుపునిచ్చారు.

    జిల్లా పోలీస్ కార్యాలయం నుం చి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఎన్‌ జీ కళాశాల, రామగిరి, క్లాక్ ట వర్ మీదుగా కొనసాగింది. పో లీ స్ అమరవీరుల సేవలు, త్యా గా లను స్మరించుకుంటూ సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో పోలీసుల విధుల పట్ల అవగాహన పెంపొందించేలా నిర్వహించారు.అమరవీరుల సం స్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ వివిధ అవగా హన కార్యక్రమాలను చేపడుతోం ది. దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల సేవలను గుర్తుంచుకో వడం, వారి కుటుంబాల త్యాగా లను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీస్ శాఖ పేర్కొంది.

    ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, 12వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ నాగే శ్వ రరావు, నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివా సులు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ ఐ లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.