Saturday, November 14, 2026
More
    Homeనల్గొండNine people arrested in Nalgonda 38 theft cases : ఎయిర్‌టెల్ టవర్లే...

    Nine people arrested in Nalgonda 38 theft cases : ఎయిర్‌టెల్ టవర్లే టార్గెట్.. ఇంజినీర్ల ముఠాగుట్టురట్టు, పనిచేస్తున్న సంస్థకే కన్నం, 38 చోరీ కేసుల్లో తొమ్మిదిమంది అరెస్ట్

    📰 Generate e-Paper Clip

     

    –రూ.1.62 కోట్ల విలువైన రేడియో రిమోట్ యూనిట్ల చోరీ
    –నల్లగొండ సీసీఎస్ పోలీసుల మెరుపు ఆపరేషన్

    –వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

    Nine people arrested in Nalgonda 38 theft cases:  ప్రజా దీవెన, నల్లగొండ: నమ్మకం గా పనిచేస్తున్న సంస్థకే కొంద రు ఉద్యోగులు కన్నం వేశారు. తమకు ఉన్న సాంకేతిక పరిజ్ఞా నాన్ని దుర్వినియోగం చేస్తూ ఖరీదైన ఎయిర్‌టెల్ మొబైల్ ట వర్ల రేడి యో రిమోట్ యూనిట్లను (RRU) లక్ష్యంగా చేసు కు ని వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాగుట్టును నల్లగొండ సీసీఎస్ పోలీ సులు రట్టు చేశారు. ఈ వ్యవహా రంలో సంస్థలో పనిచేస్తున్న ము గ్గురు ఇంజినీర్లు, టెక్నీషియన్లు సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లా ల్లో ఏకంగా 38 చోరీలకు పాల్ప డిన ఈ ముఠా సుమారు రూ.1. 62 కోట్ల విలువైన రేడియో రి మోట్ యూనిట్లను అప హరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన మూడు కార్లు, రెండు బైకులు, రూ. 15 లక్షల న గదు, ఎనిమిది మొబైల్ ఫోన్లను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు.

    ప్రత్యేక బృందాలతో రంగంలోకి పోలీసులు

    జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొబై ల్ టవర్లకు సంబంధించిన ఖరీదై న రేడియో రిమోట్ యూనిట్లు వరుసగా చోరీ అవుతుం డటంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక దృష్టి సారిం చారు. సీసీఎ స్ ఇన్‌స్పెక్టర్ ఎం.జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో రెండు ప్రత్యేక పో లీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.మొదట ఈ చోరీల వెనుక బయటి వ్యక్తుల హస్తం ఉందని భావించిన పోలీ సులు సాంకేతిక ఆధారాలు, ని ఘా సమాచారంతో లోతుగా విచారణ చేపట్టారు. అయితే, ఈ దొంగతనాలకు పాల్పడుతున్నది అదే సంస్థలో పనిచేస్తున్న ఇంజి నీర్లు, రిగ్గర్లు, టెక్నీషియ న్లు, డ్రై వర్‌తో పాటు గతంలో సంస్థలో పనిచేసిన వ్యక్తి అని గుర్తించి వి స్తుపోయారు.

      రాత్రివేళల్లో టవర్లపై దోపిడీ

    విలాసవంతమైన జీవితానికి అ లవాటుపడి తక్కువ సమ యంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో నిందితు లు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమ పరి ధిలోని మొబైల్ టవర్లపై ఉన్న ఖరీదైన ఆర్‌ఆర్‌యూ యూనిట్లను ముందుగానే గుర్తించి, రాత్రివేళ ల్లో టవర్ల వద్దకు చేరుకునేవారు.తమకు తెలిసిన సాంకేతిక పరి జ్ఞానంతో వైర్ల ను కత్తిరించి యూ నిట్లను తొలగించి అపహరించే వారు. అ నంతరం వాటిని హైద రాబాద్‌లో విక్రయించి వచ్చిన డ బ్బు తో కార్లు, బైకులు కొనుగోలు చేయడంతో పాటు విలాసాలకు ఖర్చు చేసేవారని పోలీసుల వి చారణలో వెల్లడైంది.

       వాహన తనిఖీలతో చిక్కిన ముఠా

    నవంబర్ 14న నల్లగొండ రూరల్ పోలీసుల బృందం గిగిరకల బావిగూడెం శివారులోని చింతచెట్టు వద్ద వాహన తనిఖీలు ని ర్వహిస్తుండగా రెండు కార్లు, ఒక బైక్‌పై అనుమానాస్పదంగా వస్తున్న ఐ దుగురిని అదుపులోకి తీసుకుంది. విచారణలో వారు కాంచనపల్లి ప్రాంతంలో ఆర్‌ఆర్‌యూ యూనిట్ల చోరీకి వెళ్తున్నట్లు వెల్లడించారు.అదే సమయంలో త్రిపురారం పో లీసులు బాబాసాయిపేట వద్ద ని ర్వహించిన వాహన తనిఖీల్లో మ రో నలుగురిని అదుపులోకి తీ సుకున్నారు. వారిలో గతంలో నే రాలకు పాల్పడిన వ్యక్తి కూడా ఉండటంతో మరింత లోతుగా విచారించగా, గతంలో జరిగిన పలు చోరీల వివరాలు వెలుగు లోకి వచ్చాయి.

      38 చోరీ కేసులు..జిల్లాలవారీగా వివరాలు

    పోలీసుల విచారణలో ఈ ముఠా మొత్తం 38 చోరీ కేసుల్లో పాల్గొ న్నట్లు గుర్తించారు.నల్లగొండ 9 కేసులు, మిర్యాలగూడ 16 కేసు లు,దేవరకొండ2 కేసులు, సూ ర్యాపేట 8 కేసులు, ఇ తర జిల్లా లు 3 కేసులు,ఈ కేసును సమ ర్థ వంతంగా ఛేదించి తొమ్మిది మం ది నిందితులను అరెస్టు చేయ డంలో కీలక పాత్ర పోషించిన త్రి పురారం ఎస్‌ఐ కె.నరేష్, నల్ల గొం డ రూరల్ ఎస్‌ఐ, సీసీఎస్ ఎస్‌ఐ సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణు వర్ధన్ గిరి, పుష్ప గిరి, ఫయాజ్, నాగరాజు, కానిస్టేబుళ్లు అస్రార్, సా యి, శివరాజు, నరేష్‌లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభి నందించి రివార్డులు ప్రకటించారు. సాం కేతిక పరిజ్ఞానాన్ని నే రాలకు ఉపయోగించినా చ ట్టం నుంచి తప్పించుకోలేరనే విష యాన్ని ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.

    Nine people arrested in Nalgonda 38 theft cases

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.