Monday, November 16, 2026
More
    Homeనల్గొండAIKS calls for nationwide struggles against policies : నల్లగొండలో మార్మోగిన రైతుఉద్యమనినాదాలు,...

    AIKS calls for nationwide struggles against policies : నల్లగొండలో మార్మోగిన రైతుఉద్యమనినాదాలు, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానాలపై దేశవ్యాప్త పోరాటాలకు ఏఐకేఎస్ పిలుపు

    📰 Generate e-Paper Clip

     

    –-రైతు ఐక్యతే కేంద్ర ప్రభుత్వ వి ధానాలకు అడ్డుకట్ట
    -600 రైతు సంఘాల ఐక్యతతో సంయుక్త కిసాన్ మోర్చా
    –నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు,
    –27న చక్కాజా మ్‌కు రాకేష్ టికాయత్ పిలుపు

    AIKS calls for nationwide struggles against polici es :  ప్రజా దీవెన, నల్లగొండ: రైతాంగ హక్కుల పరిరక్షణ, ప్రజా స్వామ్య విలువల సంరక్షణ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశ వ్యాప్త ప్రతి ఘటనకు రైతు సంఘలు సిద్ధ మవుతున్నాయి. వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యత తో విస్తృత ఉ ద్యమాలు ని ర్మించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు పిలుపునిచ్చాయి. నల్లగొండ వే దికగా జరుగుతున్న ఈ మహాసభల్లో రై తాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, భవిష్య త్ ఉద్యమ కార్యాచరణ పై జా తీయ స్థాయి నాయ కులు కీలక ప్రసంగాలు చేశారు.

    బిజేపీ విధానాలపై బహుముఖ పోరాటం

    ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే మాట్లాడు తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అను సరిస్తున్న విధానాలు కా ర్పొ రేట్ సంస్థలకు ప్రయో జనం చేకూ ర్చేలా ఉన్నాయని విమ ర్శించారు. రై తులు, కార్మికులు, వ్యవసా య కూలీలు సహా అ న్ని వర్గాల ప్రజల హక్కుల పరిరక్షణకు సం ఘటిత పోరాటా లు అవసరమ న్నారు. ఆర్‌ఎస్‌ఎస్–బీజే పీ భావజాలాన్ని ఎ దుర్కొనేందుకు రాజకీయ, సై ద్ధాంతిక, సామాజిక, సాంస్కృ తిక, మీడియా, ఆం దోళనాత్మక, సంస్థాగత రంగాల్లో ఏడు వి ధాలుగా నిరంతర పోరా టాలు సాగించాలని పిలుపునిచ్చా రు. ప్రజల్లో చైతన్యం పెంచు తూ వామపక్ష, ప్రజా స్వామిక, లౌకిక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని సూచించా రు.లెనిన్ ప్రతిపాదించిన ఆందోళన, ప్రచారం, సంస్థాగత నిర్మా ణం అనే మూడు సూత్రాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల ని, ఏ ఐ కేఎస్ స్వతంత్ర సంస్థాగత బలాన్ని మరింత పెంచుకో వాలని స్ప ష్టం చేశారు.

    600 రైతు సంఘాల ఐక్యత, చారిత్రక విజయం

    రైతు ఉద్యమ నాయకుడు రాకే ష్ టికాయత్ మా ట్లాడుతూ రైతాంగం, వ్యవసాయ కార్మికులు, భూ మిలేని పేదలు, ఆదివాసీలు ఐక్యంగా పోరాడితేనే రైతు వ్య తిరేక విధానాలను అడ్డుకోగల మన్నా రు. ఢిల్లీలో 13 నెలల పాటు సాగిన రైతు ఉద్య మం ఐక్య తా శక్తికి నిదర్శనమని గుర్తుచే శారు. సు మారు 600 రైతు సం ఘాలను సంయుక్త కిసాన్ మోర్చా వేదికపైకి తీసుకురావడం చారిత్రక పరిణా మమన్నారు. రై తులతో పాటు కార్మికులు, ఆది వా సీలు, చిన్న వ్యాపారులు, సా మాన్య ప్రజలు భాగ స్వాములైన ఆ ఉద్యమం మూడు వ్యవసాయ చ ట్టాల రద్దుకు దారితీసిందని వివరించారు.

    నవంబర్ 26న దేశవ్యాప్త ఆందో ళనలు

    రైతాంగ ఉద్యమాన్ని మరింత వి స్తరించేందుకు సం యుక్త కిసాన్ మోర్చా భవిష్యత్ కార్యాచరణ రూ పొందిస్తోందని టికాయత్ తె లిపారు. నవంబర్ 26 న దేశవ్యా ప్తంగా రైతు ఆందోళనలు నిర్వ హించా లని, 26వ తేదీ రాత్రి నిర సన ప్రదేశాల్లోనే బస చే సి ఉద్య మాన్ని కొనసాగించాలని పిలుపు నిచ్చా రు. నవంబర్ 27న ఉద యం చక్కాజామ్ నిర్వ హించాలని సూచించారు.

    తెలంగాణ రైతాంగ పోరాటానికి ఘన నివాళి

    నిజాం నిరంకుశ పాలనకు వ్య తి రేకంగా సాగిన తెలంగాణ సా యుధ రైతాంగ పోరాటాన్ని రాకే ష్ టికాయత్ స్మరించుకు న్నా రు. వేలాది మంది రైతులు, వ్యవసా య కార్మికులు, మహిళ లు, యు వత చేసిన త్యాగాలు దేశ చరిత్ర లో చిరస్థాయిగా నిలిచాయని పే ర్కొన్నారు. రైతు హక్కుల కోసం నాడు సాగిన పోరాట స్ఫూర్తి నేటి ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలవాల న్నారు.

    రైతు సంక్షోభానికి పరిష్కారమే లక్ష్యం

    వ్యవసాయ పెట్టుబడుల పెరుగు దల, గిట్టుబాటు ధరల కొర త, అ ప్పుల భారం, సాగునీటి సమస్య లు రైతు కుటుంబాల ను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయని మహాసభలో ఆం దోళన వ్యక్తమైంది. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధ ర, రైతుల రుణభారం తగ్గింపు, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ బ లోపేతం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు భద్రత కల్పిం చాలని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

      ప్రముఖులకు మహాసభ నివాళులు

    మహాసభలో సీతారాం ఏచూరి, వి.ఎస్. అచ్యుతానందన్, బుద్ధ దేవ్ భట్టాచార్య, ఎన్. శంకర య్య, సారంపల్లి మల్లారెడ్డి తది తర ప్రముఖ నాయకుల సేవ ల ను స్మరించుకుంటూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. రైతు, కార్మిక ఉద్యమాల్లో ప్రాణాలర్పిం చిన అమరవీరులకు నివాళుల ర్పించారు. యు ద్ధాలు, ప్రకృతి విపత్తులు, రైతుల ఆత్మహత్యల్లో ప్రాణాలు కో ల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు.

    రైతు పోరాటాల చరిత్రకు నల్లగొండ వేదిక

    ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూ లకంటి రంగారెడ్డి మాట్లాడు తూ.. రైతాంగ పోరాటాల చరిత్రలో ప్ర త్యేక స్థానం కలిగిన నల్లగొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాస భలు నిర్వహిం చడం గర్వకారణ మన్నారు. 1936లో స్థాపించబ డిన అఖిల భారత కిసాన్ సభ తొమ్మిది దశాబ్దాల ప్రస్థానం రైతుల హ క్కు ల పోరాటాలతో ముడి పడి ఉందని వివరించారు.

    తెలం గాణ సాయుధ రైతాంగ పోరాట వారస త్వాన్ని గుర్తు చేస్తూ, భూమి, గిట్టుబాటు ధర, రైతుల ఆ త్మగౌరవం, సామాజి క న్యాయం కోసం భవి ష్యత్తులోనూ ఐక్య ఉద్యమాలు కొన సాగించాలని పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి తర లివ చ్చిన ప్రతినిధులకు నల్లగొండ ప్రజల తరఫున స్వా గతం పలికారు.రైతాంగ ఐక్యత, సంఘటిత పోరాటాలు, ప్రజా ఉ ద్యమాల బలోపేతమే భవిష్యత్ కార్యాచరణగా నల్లగొండలో జరుగుతున్న ఏఐకే ఎస్ 36వ జాతీయ మహాసభలు స్పష్టమై న సందేశాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు.

    AIKS calls for nationwide struggles against policies

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.