Tuesday, November 17, 2026
More
    HomePoliticsLIDCAP Lands Protection : లిడ్ క్యాప్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే వేముల...

    LIDCAP Lands Protection : లిడ్ క్యాప్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి

    📰 Generate e-Paper Clip

    LIDCAP Lands Protection : ప్రజా దీవెన, చిట్యాల: గచ్చి బౌలి రాయదుర్గంలోని లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, వాటి పరిరక్షణకు తక్షణ చర్యలు చేప ట్టాలని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ప్ర భుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కోరారు. చి ట్యాల మండలంలోని మదర్ డెయిరీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే వే ముల వీరేశాన్ని మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా లిడ్ క్యాప్ భూముల పరిరక్షణతో పా టు కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాల ను ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

    గచ్చిబౌలి రాయదుర్గంలోని లిడ్ క్యాప్ భూముల్లో 6.5 ఎకరా లను యూనిట్ మాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కే టాయించడాన్ని వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలా గే పెట్రోల్ బంక్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కోసం కేటాయించిన 3.5 ఎకరాల భూముల కేటాయింపులను కూడా రద్దు చేసేలా చొర వ చూపాలని కోరారు. లిడ్ క్యాప్ కార్పొరేషన్‌కు ప్రత్యేక బడ్జె ట్ కేటాయించాలని, సంస్థ అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

    స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

    మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరితో త్వర లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. లిడ్ క్యాప్ భూ ముల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, భూములు అన్యాక్రాంతం కాకుండా అవసర మైన చర్యలు తీ సుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశం లో ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ నరే ష్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజన్ వెంకటస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి కోళ్ల శివ మాది గ, రాష్ట్ర సమన్వయకర్త జానకిరామ్ చౌదరి, నకిరేకల్ ని యో జకవర్గంతో పాటు నల్గొండ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.