Mla Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, ము నుగోడు: అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ఖబడ్దార్ బిడ్డా.. అం టూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దే శిం చి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థా యిలో విరుచుకుపడ్డారు. కొడంగల్ నియోజకవ ర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే త మకు ఎలాంటి అభ్యం తరం లేదని, అయితే మును గోడు అభివృద్ధికి నిధులు అడిగి నందుకు పండబె ట్టి తొక్కుతానని వ్యాఖ్యానించడం ముఖ్య మంత్రి హోదాకు తగదని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న నాయకుడిని ఎన్నుకున్నారని, తనను అం త తేలిగ్గా తీసుకోవద్దని ఘాటుగా హెచ్చరించారు.బుధవారం ము నుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో నిర్వ హించిన నూ తన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపి ణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చండూరు, మునుగోడు, మర్రిగూ డ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాలతో పాటు చండూరు ము న్సిపాలిటీకి చెం దిన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రా లను అందజేశారు.
3,630 మందికి చేయూత పింఛన్లు
మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఎంపికైన 3,630 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇందులో మునుగోడు మండలంలోని 28 గ్రామాలకు చెందిన 845 మంది, చండూరు మండలం లోని 19 గ్రామాలకు చెంది న 530 మంది, చండూరు మున్సిపాలిటీలోని 10 వార్డులకు చెందిన 293 మంది, మర్రిగూడ మండలంలోని 18 గ్రామాలకు చెందిన 785 మంది, నాంపల్లి మండలంలోని 32 గ్రామాలకు చెందిన 651 మంది ఉన్నారు. వితంతువులు, ఒంటరి మహిళ లు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితరు లు పింఛన్లకు ఎంపికయ్యారు.అర్హులైన పేదలకు రాజకీయ జో క్యం లేకుండా పింఛన్లు అందిం చ డమే ప్రభుత్వ లక్ష్యమని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దా దాపు 90 శాతం మం దికి పింఛన్లు మంజూరయ్యాయని తెలి పారు. ప్రభుత్వ సొమ్ము పేదలకు, అర్హులైన రైతులకు మాత్రమే చేరాల ని, అనర్హులకు చేరకూడదని స్పష్టం చేశారు.
రూ.4 వేల పింఛన్ హామీ నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా నెలకు రూ.4 వేల పింఛన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉం దని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఎందు కు అమలు చేయలేకపో తు న్నారో ప్రజలకు వివరించాలని ప్ర భుత్వానికి సూచిం చారు. పింఛన్ రూ.2 వేలే కాకుండా రూ.5 వేలు ఇచ్చి నా తప్పులేదని, వృద్ధుల సంక్షేమం కోసం ప్రతి మం డల కేంద్రంలో ఓల్డేజ్ హోంలు ఏర్పాటు చేయాలని కోరారు.
అభివృద్ధి పేరుతో అవినీతికి తావివ్వొద్దు
గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్పులు చేసి కాం ట్రా క్టర్లకు పనులు అప్పగించి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. గ తంలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లే ఇప్పుడు కూడా కొనసా గుతూ అదే దోపిడీని సాగిస్తు న్నారని ఆరోపించారు. గత ప్రభు త్వ అవినీతిని వెలికి తీసి ప్రజాధనాన్ని రికవరీ చేయడంతో పాటు బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునుగోడులో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు అందకపోవడంతో పనులు మ ధ్యలో నే వదిలేసి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప రి స్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి ఎలాసాధ్యమని ప్రశ్నించారు.
కొడంగల్‌కు వేల కోట్లు ఇచ్చినా అభ్యంతరం లేదు
తెలంగాణ రాష్ట్రం అంటే కొడంగల్, మధిర నియోజక వర్గాలు మాత్రమే కాదని, మునుగోడు, ఆదిలాబాద్, ములుగు వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూ డా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి, ఉ పముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశా రు.కొడంగల్‌కు రూ. 10 వేల కోట్లు కాకుంటే రూ.20 వేల కోట్లు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని, కానీ మునుగోడుకు నిధు లు అడిగితే బెదిరింపులకు దిగడం ఏమిటని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి తండ్రి పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంద ని, ప్రాంతాల మధ్య వివక్ష చూపడం తగదని హితవు పలికా రు.
ప్రజాధనం కోసమే 20 శాతం తక్కువకే టెండర్
తాను ప్రజల సొమ్మును తినే వ్యక్తిని కాదని, ప్రజాధనాన్ని కా పాడే బాధ్యత తనకు ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్ర భుత్వం ఎంత పెద్ద కాంట్రాక్టు ఇచ్చినా అందరి కంటే 20 శాతం తక్కువకే టెండర్ వేసి పనులు పూర్తి చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, పేదలకు అన్యాయం జరిగిన ప్రతిచోటా వారి తరఫున పోరా డ తానని స్పష్టం చేశారు.తాను కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి విధే యుడినేనని చెబుతూనే, మునుగోడు అభివృద్ధి విష యంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రి ప దవి రాలేదనే అసంతృప్తితో మాట్లాడుతున్నానని కొందరు ప్ర చారం చేస్తున్నారని, ప్రజల మంచి కోసమే తనగళం వినిపిస్తు న్నానని పేర్కొన్నారు.
మునుగోడు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటా యించి సహకరించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతున్నానని, వి వక్ష కొనసాగితే మునుగోడులో మరో కు రుక్షేత్రం తప్పదని ము ఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేశా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యం, వి విధ మండలాల అధికారులు, ప్రజాప్ర తినిధులు, కాం గ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.




