Thursday, November 19, 2026
More
    HomeOpinionToli Chowki Inspector ACB Bribery Case : బిగ్ బ్రేకింగ్, టోలీచౌకి ఇన్‌స్పెక్టర్‌కు ఏసీబీ...

    Toli Chowki Inspector ACB Bribery Case : బిగ్ బ్రేకింగ్, టోలీచౌకి ఇన్‌స్పెక్టర్‌కు ఏసీబీ షాక్, రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు హోటల్‌కు ప్రత్యేక అనుమతుల పేరుతో రూ.40 వేల డిమాండ్

    📰 Generate e-Paper Clip

    Toli Chowki Inspector ACB Bribery Case : ప్రజా దీవె న, హైదరాబాద్:అవినీతి నిరోధక శాఖ (ఏసీ బీ) మరో అవినీతి అధికారిపై కొరడా ఝళిపించింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గో ల్కొండ జోన్, టోలీచౌకి పోలీస్ స్టేష న్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఈ ఘటన నవం బర్ 18న రాత్రి సుమారు 9.40 గంటలకు చోటుచేసుకుంది. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉం డ టంతో పాటు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ల కోసం హోటల్ కేఫెటేరియా ను అర్ధరాత్రి 1 గంట తర్వాత అదనంగా మరో గంటపాటు నిర్వహించుకునేందుకు అనుమతి స్తానని చెప్పి ఇన్‌స్పెక్టర్ రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

    మిగిలిన మొత్తం తీసుకుంటూ పట్టుబాటు

    ఈ వ్యవహారంలో అక్టోబర్ 31నే ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు దారుడి ని నెలకు రూ.50 వేల చొప్పున లంచం ఇవ్వాల ని కోరినట్లు ఏసీబీ తెలిపింది. అప్పట్లోనే రూ.20 వేలు తీసుకుని, మొదటి నెలకు రూ.10 వేల రాయితీ ఇస్తాన ని చెప్పి మొత్తం లంచాన్ని రూ.40 వేలకు ఖరారు చేసి నట్లు పేర్కొంది. తాజాగా మిగిలిన రూ.20 వేలు తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకు న్నారు.

       నాలుగు కవర్లలో రూ.1.80 లక్షల నగదు

    ఏసీబీ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ వద్ద నుంచి లంచం సొమ్ము రూ.20 వేలతో పాటు, ఎలాంటి లెక్కాపత్రాలు లేని మరో రూ.1.80 ల క్షల నగదు కూడా గుర్తించారు. ఈ నగదును నాలుగు వేర్వేరు కవర్లలో దాచినట్లు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వ హోదా ను దుర్వినియోగం చే స్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు విధులను దు రు ద్దేశపూర్వకంగా నిర్వహించినట్లు ఏసీబీ పేర్కొంది.

       అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్

    నిందిత ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసిన అధికారులు, నాం పల్లి లో ని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థా నంలో హాజరుపరిచారు. అనంతరం ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొన సాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరా ల ను ఏసీబీ గోప్యంగా ఉంచింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ కా ర్యాలయాల్లో ఎవరైనా అధికారి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ధైర్యం గా తెలంగాణ ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.టోల్ ఫ్రీ నంబర్ 1064,వాట్సాప్ 944 04461 06,ఫేస్‌బుక్ Telangana ACB,ఎక్స్ @Tela ngana ACB ల తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.