Tirumala Srivari Seva Lucky dip : ప్రజా దీవెన, తి రుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కు అలర్ట్ . అక్టోబర్ నెలలో కలియుగ వైకుంఠనాథుడి దర్శ నం కోసం ప్రణాళిక వేసుకుంటున్నారా అయితే మీ క్యాలెం డర్‌పై ఒక కన్నే సి ఉంచండి. టీటీడీ (TTD) సరికొత్త దర్శన భాగ్యాల వేటను జూలై మూడో వారం నుంచి ప్రారంభించ బోతోంది. ఆ కౌంట్‌డౌన్ వివరాలు మీకోసం…
లక్కీ డ్రా (ఎలక్ట్రానిక్ డిప్)తో శ్రీ వారి సేవలకు శ్రీకారం. శ్రీవా రి ప్ర త్యేక ఆర్జిత సేవల్లో పాల్గొనే అదృష్టం మీ లక్ మీద ఆ ధారపడి ఉంటుంది. దీని కోసం రిజిస్ట్రేషన్ టై మ్ నోట్ చే సుకోండి. జూలై 18 (ఉ దయం 10:00): ఎలక్ట్రానిక్ డిప్ రి జిస్ట్రేషన్లు ప్రారంభం.జూలై 20 (ఉదయం 10:00): లక్కీ డ్రా న మోదు ముగింపు.జూలై 20 – 22 (మధ్యాహ్నం 12:00 లోపు) డ్రాలో టికెట్లు దక్కిన వారు ఈ సమయానికి డబ్బు లు చెల్లించి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
టికెట్ల జాతర ఏ రోజు.. ఏ కోటా
మీకు కావాల్సిన సేవలు, దర్శనాల తేదీలను బట్టి అలారా లు సెట్ చే సుకోండి. జూలై 21 (ఉదయం 10 :00) కల్యాణో త్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహ స్రదీపాలం కార సేవలు. జూలై 21 (మధ్యాహ్నం 3:00) వర్చువల్ సేవ లు & వాటికి సంబంధించిన దర్శన స్లాట్లు. జూలై 23 (ఉద యం 10:00) భక్తి శ్రద్ధలతో చేసుకునే అంగప్రదక్షిణ టోకె న్లు.జూలై 23 (ఉదయం 11:00) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు. జూలై 23 (మధ్యాహ్నం 3:00)వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడేవారికి ప్రత్యేక దర్శన టోకెన్లు.
జూలై 24 (ఉదయం 10:00) మో స్ట్ అవేటెడ్ రూ. 300 ప్రత్యేక ప్ర వేశ దర్శన టికెట్ల కోటా.జూలై 24 (మధ్యాహ్నం 3:00) తిరుమల, తిరుపతిలో వసతి గదుల (Accommo dation) బుకింగ్.ఇదిలా ఉండగా సైబర్ మోసగాళ్ల బారిన పడకండి.గోవిందుడి దర్శన టికెట్లను కేవలం అధికారిక వెబ్ సై ట్https://ttdevasthanams. ap.gov.in ద్వారా మా త్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడిస్తున్నా రు.


