Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshFive Friends Missing in CAR accident: బిగ్ బ్రేకింగ్, వివాహ వేడుకలో వి షాదం,...

    Five Friends Missing in CAR accident: బిగ్ బ్రేకింగ్, వివాహ వేడుకలో వి షాదం, కారు కాల్వలోకి దూసుకె ళ్లి ఐదుగురు స్నేహితుల గల్లంతు

    📰 Generate e-Paper Clip

    Five Friends Missing in CAR accident : ప్రజా దీవె న, అమరావతి: పెళ్లి వే డుక ముగించుకుని, నవ్వులు చిం దిస్తూ సాగిన ఆప్రయాణం కాసేపట్లోనే తీరని విషాదంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడిలాకుల వద్ద చోటు చే సుకున్న ఘోర ప్ర మాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహానికి హాజ రై తిరుగు ప్రయాణమైన ఐదుగురు మిత్రుల కారు అదుపు తప్పి క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా ప్రవహిస్తున్న కా లు వలోకి దూసుకెళ్లింది. నీటి ప్రవాహం బలంగా ఉండటoతో కారులోని వారంతా గల్లంతయ్యారు. అయితే, ఆభయానక క్షనల్లోనూ ఒక యువకుడు అద్భుతమైన తెగువ ప్రదర్శించి, ప్రాణాలను పణంగా పెట్టి ఈదుకుంటూ ఒడ్డుకు చేరి సురక్షి తంగా బయటపడ్డాడు.

    ప్రమాద సమాచారం అందుకు న్న వెంటనే రెస్క్యూ బృందా లు, పోలీసులు హుటాహుటిన ఘ ట నా స్థలానికి చేరుకుని విస్తృ తం గా గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువ ప్రవా హంలో గాలించగా ఒకరి మృతదేహం లభ్యమవ్వగా, ఆ చూకీ తెలియని మరో ముగ్గురి కోసం బోట్లు, ప్రత్యేక గజ ఈతగాళ్ల సాయంతో ముమ్మరం గా అన్వేషిస్తున్నారు. సం తోషంగా సాగాల్సిన వివాహ ప్రయాణం అనుకోని ప్రమాదం తో విషాదాం తం కావడంతో బాధిత కుటుం బాల్లో తీవ్ర శో కం అలుముకుంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.