Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshCOVID-19 in Andhra Pradesh : బ్రేకింగ్ న్యూస్, ఏపీలో మళ్లీ కల కలం రేపుతున్న...

    COVID-19 in Andhra Pradesh : బ్రేకింగ్ న్యూస్, ఏపీలో మళ్లీ కల కలం రేపుతున్న కరోనా వైరస్, రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ

    📰 Generate e-Paper Clip

    COVID-19 in Andhra Pradesh : ప్రజా దీవెన, అమరా వతి: ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా తలుపు తడుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కావడంతో వై ద్య ఆరోగ్యశాఖ ఒక్కసారిగా అ ప్రమత్తమైంది.తాజా పరిస్థి తులపై వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సం క్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ కీలక వివరాలను వెల్ల డించారు. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొ త్తం12 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన ప్రకటించారు. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అ వ సరం లేదని, కాకపోతే అప్రమత్తత మాత్రం చాలా అవస ర మని స్పష్టం చేశారు.

    జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా

    ఈ సారి నమోదైన కేసులు ఒకే చోట కాకుండా, రాష్ట్రంలోని నా లుగు జిల్లాల్లో చెదురుముదు రు గా వెలుగు చూశాయి. ఎక్కడా సామూహిక వ్యాప్తి (క్లస్టర్) జర గలేదని అధికారు లు ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు.

    తొలుత కడప జిల్లాలో ఈ ఏడా ది తొలి కేసు జూన్ 26న ఇక్కడే నమోదైంది. మొత్తం కేసుల్లో అ త్యధికంగా 8 కేసు లు ఇక్కడే ఉన్నాయి. ఆ తర్వాత గుంటూ రు జిల్లాలో 2 కే సులు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నంలో 1 కేసు, కాకి నాడలో 1కేసు వెలుగు చూసింది.మొత్తం 12 కేసుల్లో ఇద్ద రు వ్యక్తులు.. ఇప్పటికే క రో నా సోకిన వారితో సన్నిహితం గా మెలిగిన (ప్రైమరీ కాంటాక్ట్స్) వారిగా అధికారులు గు ర్తించారు.

    బాధితుల ప్రస్తుత పరిస్థితి మర ణాల వెనుక అసలు నిజం ప్రస్తు తం యాక్టివ్‌గా ఉన్న కేసుల వివరాలు ఇలా ఉన్నా యి. స్వీయ గృహ నిర్బంధం (HomeIsolation) ముగ్గురు, ఆసుపత్రిలో చికి త్స ఇద్దరు, కోలుకుని డిశ్చార్జ్ అయిన వా రు 3 గురు కాగా నలు గురు మృతి కానీ ఈ వైరస్ వల్ల న లుగురు (కడపలో ముగ్గురు, కాకినాడలో ఒకరు) మర ణించారు. అయితే, వీరి మరణానికి కేవలం కరోనా మాత్ర మే కారణం కాదని వైద్యశాఖ స్పష్టం చేసింది. మరణించిన వారంతా ముందే తీ వ్ర రక్తపోటు (BP), మధుమేహం (Su gar), కిడ్నీ సంబంధిత దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడు తు న్నట్లు అధికారులు వెల్లడించారు.

    రంగంలోకి పుణె ఎన్‌ఐవీ (NIV) కొత్త వేరియంట్?

    రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న వై రస్ రూపాంతరం చెందిం దా లేదా అని తెలుసుకోవడానికి అ ధి కారులు వేగంగా అ డుగులు వేశారు. జూలై 9న ఐదునమూనాలను (Sampl es) జన్యుక్రమ విశ్లేషణ (Genome Sequencing) కోసం పుణెలోని జాతీయ వైరాల జీ సంస్థ (NIV)కు పంపించారు. ఈ రిపోర్ట్స్ వస్తే వైరస్ ఏ వేరియంట్ అనేది స్పష్టత రానుం ది.

    రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై 15 వరకు 67 మందికి టె స్టులు చేయగా 11 మందికి పాజి టివ్ వచ్చింది. మరో వ్య క్తికి త మిళనాడులోని వేలూరు సీఎంసీ (CMC) హాస్పి టల్‌ లో పరీక్షించ గా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య 12కు చేరింది.ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఎలా ఉందంటే దేశవ్యాప్తంగా మొత్తం 339 కరోనా కేసులు నమోదయ్యా యి. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళ115 (టాప్), కర్ణా టక 64, మహారాష్ట్ర 43, తమిళనా డు 39, అండమాన్18, ఢిల్లీలో 18, రాజస్థాన్ 12 లు నమోదైనట్లు తెలుస్తోంది.

    అయితే నిర్లక్ష్యం వద్దు కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, కా బట్టి ప్రతి ఒక్కరూ జా గ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ కో రింది. జ్వరం, దగ్గు, జలు బు లేదా ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయ వద్దు, వెంటనే దగ్గరలోని వైద్యు లను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకో వాలని సూచించింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.