Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క వ్యాఖ్య, రైతుల దీర్ఘకాలిక...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క వ్యాఖ్య, రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికే “భూ ముల రీసర్వే”

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన శా లిగౌరారం: రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారా నికే “భూముల రీసర్వే” కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ తెలి పారు.శుక్రవారం ఆయన నల్గొం డ జిల్లా శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో భూ రీ సర్వే పై ఏర్పాటు చేసిన గ్రామ సభ కు హాజరయ్యారు. గ్రా మంలో కొంతమంది రైతులు బాటలు, దారుల సమస్య , ప ట్టాలు లేకపోవడం భూమి ఉన్న కబ్జాలో లేకపో వడం వంటి సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకువచ్చన్నారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎప్పటి క లప్పుడు భూములకు సంబంధిం చిన రికార్డులను అప్డేట్ చేస్తూ వస్తున్నప్పటికీ నక్ష,టీపన్ వంటి వాటిలో మార్పులు లేకపోవడం, అలాగే కాగితాలపై ఉన్నవారు క్షేత్రస్థాయిలో వారి భూములు తె లియకపోవడం, మోకాపై ఉన్న ప్పటికీ సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నా రన్న విషయాలను ప్రభుత్వం గుర్తించి అలాంటి సమస్యలను ప రిష్కరించేందుకు భూముల రీ సర్వ్ చేయిస్తున్నట్లు తెలి పారు.

    భూ రీసర్వేలో భాగంగా రైతుల కు సంబంధించిన ప్రతి కమ తాన్ని సర్వే చేయడం జరుగుతుం దని, ముందుగా సర్వే ద్వారా గ్రా మానికి సంబంధించిన హద్దులను నిర్ణయించడం అనంతరం గ్రామ ఆస్తులను సర్వే చేస్తారని ,అలాగే వ్యవ సాయేతర భూము లను సర్వే చేస్తారని తెలిపారు. రైతులు, గ్రామస్థుల సమక్షంలో సర్వేయర్ ద్వారా వ్యవసాయ భూ ములను సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు.

    పహానిలో ఎవరున్నారో పరిశీలి స్తూ సర్వే చేయడం జరు గుతుందని, అనంతరం ఆ రైతుకు ల్యాండ్ పార్సెల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందని, ఒక రైతుకు ఒకే పార్సల్ ఉండా ల్సిన అవసరం లేదని, ఒక రైతుకు 3 లేదా 4 ల్యాండ్ పార్సి ల్స్ ఉండొచ్చని, వీటన్నిటిని కలిపి భూదార్ నంబర్ కేటా యించడం జరుగుతుం దన్నారు. భూదార్ ఆధారంగానే భూముల వివరాలు తెలుసుకో వచ్చని, ఈ నెంబర్ కే టా యింపు అనంతరం గ్రామంలో ముసాయిదా జాబితాను ప్రచురించడం జ రుగుతుందని, దీనిపై అభ్యంతరాలను స్వీకరించి అనంతరం తుది జాబితాను తయారుచేసి ప్రక టించడం జరుగుతుందన్నారు.

    భూముల రీ సర్వే సందర్భంగా కోర్టు కేసులు, ఎఫ్ఐఆర్ కేసు లు ,ఇవన్నీ కూడా ప్రదర్శించి ఎ లాంటి సమస్యలు లేవని నిర్ధా రించుకున్న తర్వాతే భూముల హద్దులు నిర్ణ యించి మ్యాపు నక్ష ఇవ్వడం జరుగుతుందన్నారు. భూ ముల రీ సర్వే ద్వారా దీర్ఘకా లిక భూ సమస్యలు పరిష్కా రం అవుతాయని, అయితే గ్రామం లోని రైతులు, గ్రామస్తు లు, ప్రజా ప్రతినిధులందరూ సమన్వయం తో ఆలోచించి రిసర్వే త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు సహకరించా లని కోరారు. ఈ సర్వే ద్వారా కొత్త సమస్యలు రాకూడదని ఎలాంటి తగాదాలు గ్రామాలలో తలెత్త కూడదని కలెక్టర్ కో రారు.నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ మా ధవ రావు, సర్పంచు సురేందర్ రెడ్డి , మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ డి. శంకర్ రెడ్డి, ఎంపీడీవో రజిత, తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.