Sunday, September 27, 2026
More
    HomeOpinionThungathurthi pacs Congress inner fight : తుంగతుర్తి ‘పీఏసీఎస్’ కురుక్షేత్రం, రేపటి పీఠం ఎవరిదిపై...

    Thungathurthi pacs Congress inner fight : తుంగతుర్తి ‘పీఏసీఎస్’ కురుక్షేత్రం, రేపటి పీఠం ఎవరిదిపై పెరిగిన పైరవీల వేడి

    📰 Generate e-Paper Clip

    Thungathurthi pacs Congress inner fight : ప్రజా దీ వెన, తుంగతుర్తి: రాష్ట్రం లో నామినేటెడ్ పదవుల పంపకా ల పర్వం క్లైమా క్స్‌కు చేరుతోంది. ఈ క్రమంలోనే తుంగ తు ర్తిని యోజకవ ర్గంలోని ప్రాథమిక వ్య వసాయ సహకార సం ఘాల (PACS) చైర్మన్ల నియామక ప్రక్రియ మరికొద్ది రోజుల్లో నే అధికారి కంగా ప్రారంభం కానుంది. అయితే, ఈసారి ఎ న్నికలు లేకుండా కేవలం నామినేషన్ల ద్వారానే పాత చైర్మన్ల స్థానంలో కొత్త వారిని నియమించబోతుండటంతో తుంగ తుర్తి కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధిష్ఠా నం పెద్దల ఆశీస్సులు పొంది పీఏసీఎస్ పీఠాన్ని దక్కించుకో వడానికి నియోజ కవర్గంలోని ఆశావహులు ఇప్పటి నుంచే ‘గాంధీ భవన్’ చుట్టూ క్యూ కడుతున్నారు.

    తుంగతుర్తిలో ముదురుతున్న అంతర్గతపోరు

    ప్రస్తుతం తుంగతుర్తి కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండు వర్గాలు గా విడిపోయిన స్థానిక నేతల వద్దకు అనుచరులు పదవుల కో సం భారీగా చేరుతున్నారు. ఈ నియామకాల్లో “వలస వచ్చిన వారికి నో ఛాన్స్ కేవలం సీని య ర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి అనే ని నా దం గట్టిగా వినిపిస్తోంది. ఈ నే పథ్యంలో స్థానిక శాసనస భ్యుడి (MLA) మనసు గెలుచుకునేందుకు, తమకు అను కూలమైన పెద్దల ద్వారా చక్రం తిప్పేందుకు నాయకులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

      రేసులో ‘కీలక’ నాయకులు వీరే

    తుంగతుర్తి పీఏసీఎస్ చైర్మన్ పద వి ఈసారి అత్యంత ప్రతి ష్ఠాత్మ కంగా మారింది. రేపటి రేసులో నిలిచేందుకు ప్రధానం గా నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. గతంలో బిఆ ర్ఎస్ హయాంలో పీ ఏసీఎస్ చైర్మన్ గా, జిల్లా డైరెక్టర్‌ గా ప నిచేసిన ఈయన, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మా రారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఈయన, మళ్లీ ఆ పదవిని నిల బెట్టుకోవాలని చూస్తున్నారు.

     

    ముక్కాల అవిలమల్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ తన అను చరుడైన ము క్కాల అవిలమల్లు (మద్దిరాల మండలం, కుక్కడం గ్రామం, మా జీ మండల పార్టీ అధ్యక్షుడు) పే రును బలంగా స్క్రీన్‌పైకి తెచ్చా రు. ఈ పేరుకు ఎమ్మెల్యే కూడా సుముఖంగా ఉన్నట్లు టాక్. అదే విధంగా పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న మరో సీనియర్ నేత శ్రీనివాసరావు కూడా ఈసా రి పీఠం తనదే అనే ధీమాతో ఉన్నారు. ఇక గుండ్ల వెంకన్న గు మ్మడవెల్లి మాజీ సర్పంచ్, మద్ది రాల మాజీ ఎంపీపీ భర్త అయిన ఈయన, మధ్యలో బిఆర్ఎస్‌లో కి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరా రు. ఈయన కూడా పీఏసీఎస్ చైర్మన్ సీటుపై కన్నేశారు.

    అధిష్ఠానానికి తలపోటుగా ‘మార్కెట్ కమిటీ’

    ఇదిలా ఉండగా రానున్న కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో ని మా ర్కెట్ కమిటీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగియ నుంది. పీఏసీ ఎ స్ గ్రూప్ పాలిటిక్స్ ఒకవైపు ఉంటే, మార్కె ట్ కమిటీల నియామ కం కాంగ్రెస్ అధిష్ఠానానికి మరింత త లపోటుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. సీనియర్ – జూని యర్ల మధ్య ఉన్న విభేదాలు ఏ క్షణమైనా భగ్గుమనే అవ కాశం లేకపోలేదు.

      రంగంలోకి ‘సమన్వయ కమిటీ’

    తుంగతుర్తిలో వర్గ పోరు రోడ్డున పడకుండా ఉండేందుకు, నామినే టెడ్ పదవుల భర్తీ కోసం కాంగ్రెస్ హైకమాండ్ త్వర లోనే ఒక ప్రత్యే క సమన్వయ కమిటీ (Coordi nation Co mmittee)ని య మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ఆధ్వర్యం లోనే తుది పేర్లను ఖరారు చేయ ను న్నారు.ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో తుంగతుర్తి నామినే టెడ్ పదవుల పంపకం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అగ్నిపరీక్షే కానుంది. గ్రూ పు తగాదాలు రాకుండా, అందరికీ సముచిత న్యాయం చేస్తూ ఎమ్మెల్యే మరియు అధిష్ఠానం ఈ రాజకీ య కురుక్షేత్రాన్ని ఎలా ముగిస్తారో చూడాలి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.