Former Maoist Leader Devji Secures Rank 349 in LAWCET: లాసెట్‌లో దేవ్‌జీ సత్తా.. 349వ ర్యాంకు

Former Maoist Leader Devji Secures Rank 349 in LAWCET: వయసు ప్రతిభకు అడ్డంకి కాదని మరోసారి ని రూపించారు కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఆయన, ఇప్పుడు విద్యారంగంలో తన ప్రతిభను చా టుతూ లాసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 349వ ర్యాంకు సాధిం చారు.
గురువారం విడుదలైన లాసెట్ ఫలితాల్లో దేవ్‌జీ పేరు మె రిసింది. ఆరు పదుల వయసులో న్యాయ విద్యను అభ్య సించాలనే లక్ష్యంతో ఆయన గత నెల ప్రవేశ పరీక్షకు హాజ రయ్యారు. క్రమశిక్షణ, పట్టుదలతో సిద్ధమై మంచి ర్యాంకు సాధించడం విశేషంగా మారింది.ఇటీవలే ఉద్యమ జీవితం నుంచి పూర్తిగా బయటకు వచ్చి సాధారణ జీవితాన్ని ఎం చుకున్న దేవ్‌జీ, అసంపూర్తిగా మిగిలిపోయిన చదువును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా దశాబ్దాల క్రితం మిగిలిపోయిన ఇంటర్మీడియట్ తెలుగు పేపర్‌ను కూడా ఇటీవల పూర్తి చేశారు.
Also Read: Pahlaj Nihalani Passes Away at 76: పహలాజ్ నిహలానీ మృతి.. బాలీవుడ్‌లో విషాదం
43 సంవత్సరాల క్రితం పూర్తికాని విద్యను తిరిగి కొన సా గించడం ఆయన సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఇం టర్ బోర్డు అనుమతితో పరీక్ష రాసిన అనంతరం న్యాయ విద్యలో చేరి పేదలకు న్యాయ సహాయం అందించాలని తన లక్ష్యాన్ని ప్రకటించారు.ఇప్పుడు లాసెట్‌లో సాధించిన ఈ ర్యాంకుతో ఆయన లక్ష్యానికి మరింత దగ్గరయ్యారు. జీవితంలో ఎప్పుడైనా కొత్త ఆరంభం సాధ్యమేనని, కృషి ఉంటే విజయాన్ని అందుకోవచ్చని దేవ్‌జీ విజయగాథ యువతతో పాటు అన్ని వయసుల వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.




