Sunday, September 27, 2026
More
    HomeOpinionACB Trap in Hyderabad : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ ఎల్ నగ ర్‌లో ఏసీబీ...

    ACB Trap in Hyderabad : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ ఎల్ నగ ర్‌లో ఏసీబీ ట్రాప్, రూ.లక్ష లంచం కేసులో ఇద్దరు పోలీస్ అధికారుల అరెస్ట్

    📰 Generate e-Paper Clip

    ACB Trap in Hyderabad : ప్రజా దీవెన, హైదరాబాద్: హై దరాబాద్‌లోనిLB నగర్ చౌరస్తా వద్ద అ వినీతి నిరోధక శాఖ (ACB) అధికా రులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్‌లో ఇద్ద రు పోలీస్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మ ల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీ స్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమో ద్ గౌడ్, జాత వత్ బాబు నాయక్ ఇద్దరూ ఈ కేసులో నింది తులుగా గుర్తించారు.

    సైబర్ క్రైమ్ కేసులో ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా సహ కారం అందించేందుకు వారిద్దరూ లక్ష రూపాయల లం చం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం ఫి ర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా సెక్షన్ 35 BNSS (గ తంలోని 41-A Cr.P.C.) కింద నోటీసు జారీ చేస్తామని హా మీ ఇచ్చిడబ్బు కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదు దారుడి నుండి లక్ష రూపాయలు లంచం స్వీకరి స్తుండగా AO-2ను అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కళంకిత లంచం మొ త్తం స్వాధీనం చేసుకున్నారు. విచా రణలో ఆ డబ్బు తనతో పాటు A O-1 తరపున కూ డా తీసుకున్నట్టు వెల్లడైంది. దీంతో ఇద్దరు అధికారులు త మ విధులను నిజాయితీగా నిర్వర్తించకుండా అనవసర ప్ర యోజనం పొందినట్లు అధికారులు తెలిపారు.

    ఇద్దరినీ అరెస్టు చేసి నాంపల్లి SPE, అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యా యస్థానంలో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరుపరుస్తు న్నా రు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొ నసాగుతున్నoదున భద్రతా కార ణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వి వరాలను గోప్యంగా ఉంచామని చేసి అధికారులు తెలిపారు.

    లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం కోరితే వెంటనే ఏసీబీ టో ల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని ఏసీ బీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చే శారు. ప్రజల తెలిసిన సమాచారాన్ని క్రిం ది మార్గాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని అప్పిల్ చేశారు. వాట్సాప్ 9440446106 నంబర్ కు, ఫేస్ బుక్ Telangan a ACB అకౌంట్ లో, ఎక్స్ సామాజికమధ్యంలో @Telang anaACB ఎకౌంటు ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూ చిం చారు.

    అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రద ర్శించిన ACB QR కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యా దు చేసిన వ్యక్తి పేరు మరియు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీ బీ అధికారులు స్పష్టం చేశారు. అ వినీతి పై పోరాటంలో ప్రజల సహ కారం కీలకమని అధికా రులు పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.