Monday, September 28, 2026
More
    HomeIndiaATM cash driver ascaped in Hyderabad: బిగ్ బ్రేకింగ్, పక్కాస్కెచ్‌తో చెక్కేసిన క్యాష్ వ్యాన్...

    ATM cash driver ascaped in Hyderabad: బిగ్ బ్రేకింగ్, పక్కాస్కెచ్‌తో చెక్కేసిన క్యాష్ వ్యాన్ డ్రైవర్, ఏటిఎం మిషన్ రూ.17లక్షలతో ఉడాయింపు

    📰 Generate e-Paper Clip

     

    ATM cash driver ascaped in Hyderabad : ప్రజా దీ వెన, హైదరాబాద్:అది ఎ ప్పుడూ రద్దీగా ఉండే రెయిన్ బజార్ సంతోష్ నగర్ ప్రధాన రహదారి. ఏటీఏంలలో నోట్ల కట్టలను నింపేందుకు ఒక క్యాష్ మేనేజ్‌ మెంట్ వ్యాన్ వచ్చి ఆగింది. సి బ్బంది అంతా తమ పనిలో నిమగ్నమయ్యారు. కానీ, అ క్కడ అందరితో పాటే ఉన్న ఆ వ్యాన్ డ్రైవర్ మైండ్‌ లో మా త్రం ఒక సినిమా లెవెల్ క్రైమ్ ప్లాన్ రన్ అవుతోంది. సమా యం కోసం చూశాడు. అనుకున్నదే తడవుగా కళ్లజూ డకుండానే రూ. 17 లక్షల క్యాష్‌తో మాయమయ్యాడు.

    ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగిన ఈ హై-వోల్టేజ్ దారిదో పిడీ ఘటన ఇప్పుడు నగరంలో తీ వ్ర సంచలనంగా మారింది.ఈ చోరీ ఏదో ఆషామాషీగా, అప్పటికప్పుడు జరి గింది కాదు.. దీని వెనుక “ముందస్తు మాస్టర్ ప్లాన్” ఉందం టున్నారు పోలీసులు.తోటి సిబ్బం ది ATM మెషీన్ల వైపు దృ ష్టి పెట్టగా నే, డ్రైవర్ తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. అ త్యంత చాకచక్యంగా క్యాష్ బాక్స్ తెరిచి, అందులోని రూ. 17 లక్షలను గుట్టుచప్పుడు కాకుండా లాగేశాడు.

    ఎవరికీ అనుమానం రాకుండా ఉం డేందుకు, అతను ముం దే ఒక బైక్‌ ను ఆ ప్రాంతంలో సిద్ధం చేసి పెట్టుకున్నాడు. డ బ్బు బ్యాగ్‌తో నేరుగా ఆ ద్విచక్ర వాహనం ఎక్కి క్షణాల్లో ట్రా ఫిక్‌లోకి కలిసిపోయాడు. కాసే పటికి బాక్స్ ఖాళీగా ఉండ టం, డ్రై వర్ సీట్లో మనిషి లేకపోవడంతో తోటి సిబ్బందికి గుండె గుభేల్ మంది. వెంటనే అలర్ట్ అయి పోలీసులకు స మాచారం అందించారు. అత్యంత భద్రతతో కూడిన క్యాష్ మేనేజ్‌మెంట్ వ్యాన్ల నుంచే ఇలా ఈ జీగా డబ్బులు మాయ మవ్వడం.. ఏటీఎం నగదు తరలింపు భద్రతా లోపాలను మరోసారి వేలెత్తి చూపుతోంది.

    రంగంలోకి ‘స్పెషల్ టీమ్స్’.. సీసీటీ వీలపైనే కన్ను

    సమాచారం అందుకున్న ఐఎస్ సదన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించారు. కేసు నమో దు చేసుకుని వేట ప్రారంభించారు. సంతోష్ నగర్ ప్ర ధాన రహదారి దాని పరిసర ప్రాం తాల్లోని CCTV ఫుటేజీలను పో లీ సులు జల్లెడ పడుతున్నారు. నింది తుడు పారిపోయిన బైక్ నంబర్ ఏంటి? అతను ఏ రూట్‌లో వెళ్లా డు? అనే విష యాలపై నిశితంగా పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం నింది తుడిని పట్టుకోవడానికి, పోయిన రూ. 17 లక్షల నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక బృందాలు (S pecial Teams) రంగం లోకి దిగాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.