Tuesday, September 29, 2026
More
    HomeOpinionCM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో సీఎం రేవంత్...

    CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో సీఎం రేవంత్ పర్యటన, ఈనెల 14న చరిత్రసాక్షిగా నిలవబోతున్న హుజుర్‌నగర్

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొం డ జిల్లా లో పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14వ తే దీన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వ ర్గంలో పర్యటించనున్నారు. దీంతో హుజుర్‌నగర్ ప్రజల ఎన్నో ఏళ్ల కల కు మరికొన్ని రోజుల్లో సాకారం కాబోతోంది.

    రామస్వా మిగుట్టపై విస్తరించిన 110 ఎకరాల భూమి ఒక ప్పుడు నిర్లక్ష్యానికి గురై చెత్త మైదానంలా కనిపించిన ఆప్రదే శo ఇప్పుడు వేలాది కుటుంబాల భవిష్యత్తును వెలిగించే మోడల్ హౌసింగ్ కాలనీగా రూపాంతరం చెందింది. హుజూ ర్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి కలల ప్రాజెక్టు అయినటువంటి ఈ మహత్త ర ప్రాజెక్ట్‌ను మార్చి 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదు గా ఘనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

    110 ఎకరాల్లో కొత్త ఆశల నగరం : హుజుర్‌నగర్ సమీ పంలోని రామస్వామిగుట్ట వద్ద రూ.125 కోట్ల వ్యయంతో (భూసేకరణ ఖర్చులు మినహా) నిర్మించిన ఈ గృహకాలనీ ప్రత్యేకతలు కొత్త పుంతలు తొక్కుతోంది. మొత్తం 110ఎ క రాల విస్తీర్ణంలో 2,160 గృహాలు సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు నిర్మాణం పూర్తి చేసుకోగా ఆర్థికంగా వెనుక బడిన వర్గాలు, పేద కుటుంబాలు, గ్రామీణ కూలీలు, రైస్ మిల్ కార్మికులు ల బ్ధిదారులుగా ఎంపికయ్యారు.

    మొదటి దశలో వెయ్యి మంది అ త్యంత అర్హులైన లబ్ధిదా రులు ఎంపిక కాగా ప్రతి ఇల్లు ఆధునిక సదుపాయాలతో ని ర్మించబడిందని, పారదర్శకంగా ఎంపికైన కుటుంబాలకు ఇ ళ్లు కేటాయించేందుకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆధ్వ ర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తోందని మంత్రి వెల్లడించా రు.

     

    నిర్లక్ష్యం నుంచి నూతనోదయం వరకు... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2 014లోబి ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. పను లు వేగంగా సాగుతున్న సమయంలో ప్రాజెక్ట్ నిలిచిపో యిం దని, ప్రాంతం చెత్త మైదానంగా మారిన నేపధ్యంలో 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే ఈ ప్రా జెక్ట్‌కు మళ్లీ జీవంపోశామని మంత్రి పేర్కొన్నారు.

    ఎండోమెంట్స్ శాఖ నుంచి పూర్తి మార్కెట్ విలువ చెల్లించి, అన్ని చ ట్టబద్ధ అనుమతులతో ప్రభుత్వం భూమిని కొనుగో లు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎ టువంటి అవకతవకలకు తావులే కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా మని మంత్రి వెల్లడించా రు. “అర్హత లేని ఒక్కరికి కూడా అవకాశం ఉండకూడదు. అ త్యంత పేద కుటుంబాలకే ప్రాధాన్యమని ఆయన స్పష్టం చే శారు.

          ప్రారంభోత్సవానికి భారీ సన్నాహాలు

    ఈ నెల 14న జరిగే ప్రారంభోత్స వానికి విస్తృత ఏర్పాట్లు జరుగు తున్నాయని, కాలనీ పరిసరాలను సుందరీకరిస్తూ ముఖ్యమంత్రి ప్ర సంగించేందుకు ప్రత్యేక సభా వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రజలు, లబ్ధిదా రులు భారీగా హాజరవుతారని అం చనా వేస్తున్నారు. కాగా ఈ మోడ ల్ హౌసింగ్ కాలనీ కేవలం ఇళ్ల స ముదాయం కాదని, ఇది వేల కు టుంబాల ఆత్మగౌరవానికి చిరు నా మాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది పేదరికం నుంచి ప్రగతివైపు వేసిన అడుగు.ఇది హుజుర్‌నగర్ భవిష్యత్తుకు కొ త్త అధ్యాయం గా నిలుస్తుందన్నారు. ఏది ఏమైనా మార్చి 14వ తేదీ హు జుర్‌నగర్ చరిత్రలో మరో స్వర్ణాక్షరాలరోజు కాబోతోందని అ భివర్ణించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.