Tuesday, September 29, 2026
More
    HomeOpinionSuryapet Arvapalli Road Accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్ల...

    Suryapet Arvapalli Road Accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్ల దుర్మరణం, సూర్యా పేట జిల్లా అర్వపల్లి వద్ద ఘటన

    📰 Generate e-Paper Clip

    Suryapet Arvapalli Road Accident : ప్రజా దీవెన, సూ ర్యాపేట: సూర్యా పేట జిల్లా అర్వపల్లి మండలo పరి ధిలో కారు బోల్తాకొట్టి ప్రభుత్వ ఇద్దరు ఉపాధ్యాయురాళ్ళు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. పాఠశాలకు వెళ్తు న్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో విషా దం నెలకొంది.

    సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి వ ద్ద ఈ దు ర్ఘటన జరిగింది.సంక్రాంతి పండుగ సెలవులు ము గిసి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపధ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రం నుండి పాఠశాలలకు బయలుదేరి వెళుతున్న ఐదుగురు ప్రధాన ఉపాధ్యాయుల బృందం కారు శనివారం ఉదయం 8 గంటల సమయoలో అర్వపల్లి మండల కేంద్రం లో 365 బి ప్రధాన రహదారిపై కారు అదు పుతప్పి రోడ్డు ప క్కన ఉన్న గుంతలు పల్టీలు మీద పల్టీలు కొడుతూ పడి పో వడంతో కస్తూర్బా గాంధీ ఏఎస్ ఓ కల్పన ఘటనా స్థలం లోనే మృతి చెందగా మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు.

    గాయపడిన వారిలో రావులపల్లి జిహెచ్ఎం గీత పరిస్థితి వి షమించడంతో హైదరాబాద్ కు తరలిస్తోన్న క్రమంలో మార్గ మధ్యలోనే తుది శ్వాస విడిచింది. కారులో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు ఉపాధ్యాయుల లో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. గా యపడ్డ వారిలో తుంగతు ర్తి మండలo తుంగతుర్తి జిహె చ్ఎం ప్రవీణ్, అన్నారం జిహె చ్ఎం సునీతరాణి, అల్వల ప్రవీణ్ కుమార్, అల్వల సునీత లు అన్నా చెల్లెలని తెలిసింది.ఇదిలా ఉండగా గాయపడ్డ వా రిని 108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి త రలించారు.

    ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జ రుపుతున్నారు. మొత్తానికి పండుగ సెలవులు ముగించుకొ ని పాఠశాల పునః ప్రారంభంకానున్న క్రమంలో సంతోషంగా ప్రయాణిస్తూ కాసేపట్లోనే పాఠ శాలకు చేరుకునే అంతలోనే ఈ ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకోవడం వారి కుటుం బాల్లో విషాదాన్ని నింపింది. నల్లగొండలోని వారివారి కుటుం బాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.