Big Breaking: ప్రజా దీవెన, నిజామాబాద్: నిజా మాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామశివారు లోని బ్రహ్మం గారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహ దారిపై టూరిస్ట్ బ స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్ర మాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రు ల్లో చికిత్స పొందుతున్నారు.
స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు అర్ధరాత్రి సుమా రు 2 గంటల సమయంలో హైదరా బాద్ నుంచి నా గ్‌పూర్ వెళ్తున్న టూరిస్ట్ బస్సు వేగంగా ప్రయాణిస్తోంది. అ యితే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు ఒక్క సారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన స మయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణి కులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో విషాదo
ఆకస్మాత్తుగా బస్సు బోల్తా పడిన వెంటనే పెద్దశబ్దం రా వ డంతో స మీ ప గ్రామాల ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చా రు. వారు గాయపడిన ప్రయాణికులను బయటకు తీసేం దుకు తీవ్రంగా ప్రయత్నించారు. అ దే సమయంలో పోలీసు లకు, అ త్యవసర సేవలకు సమాచారం అందించారు. పోలీ సులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకు ని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడి కక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉ న్నా రు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల కొంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికుల సహాయం తో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొందరి పరిస్థి తి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇతర పె ద్ద ఆస్పత్రులకు పంపించినట్లు సమాచారం. వైద్యులుగా యపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జా మ్ ఏర్పడింది. అనంతరం పోలీసు లు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనా ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లా, లేక ఇతర సాంకేతిక కార ణాల వల్లా ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ కొ నసాగుతోంది. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
