Sunday, September 27, 2026
More
    HomeOpinionBJP G.Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్య, మంత్రివర్గ సమావేశాల్లో పంపకాలపై...

    BJP G.Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్య, మంత్రివర్గ సమావేశాల్లో పంపకాలపై చర్చజరుగుతోంది

    📰 Generate e-Paper Clip

    కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్య, మంత్రివర్గ సమావేశాల్లో పంపకాలపై చర్చ జరుగుతోంది

    –రాష్ట్రంలో భూదందాలతో గతం లో కేటీఆర్​ చేసినట్లుగాఇప్పుడు నే రుగా మంత్రులు
    –ఇచ్చిన హామీల్లో ఏం అమలు చే శారని విజయోత్సవాలు
    –సీఎం రేవంత్​ రెడ్డి ప్రజలకు జవా బు చెప్పాలి
    –ఇండిగో విమానాల రద్దుపై కేంద్రం దర్యాప్తు చేస్తోంది
    –రిజర్వేషన్ల అంశంపై ఏకాభిప్రా యం రావాలి
    –పత్తి కొనుగోళ్లపై ఎలాంటి పరిమి తి లేదు
    — నల్లగొండ మీడియా సమావేశం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

    BJP G.Kishan Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: బీఆర్​ఎస్​ పార్టీ పదేండ్లు ఎలా పాలన చేసిందో ఒక శాతం అటు ఇటు కాంగ్రెస్​స ర్కారు కూడా అదే పాలన చేస్తోంది. అదే రకమైన అవినీతి, అదే రకమై న అక్రమాలు ఉన్నాయని, ఇందు లో తేడా ఏముందంటే అప్పుడు కేం ద్రీకృతి అవినీతి ఉంటే, ఇప్పుడు వి కేంద్రీకృతి అవినీ తి కనిపిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయి లో ధ్వజ మెత్తారు. నాడు కేసీఆర్​ కుటుంబం అవినీతికి పాల్పడితే ఇ ప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వంలో మం త్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు దుకా ణాలు తెరిచి మాస్​ కరప్సన్​ కు పాల్పడుతున్నారు. మంత్రివర్గ స మావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్య పంపకాల చర్చ లు జరుగుతున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు న్నారని మంత్రివర్గ సమావేశాల కూడా మం త్రుల మధ్య సఖ్యత కుదర్చడం కో సమే పెడుతున్న సందర్భాలు అనేకం ఉంటున్నా యని వివరించారు. ఆదివారం నల్గొండ జిల్లా కార్యలయంలో నిర్వ హించిన ప్రెస్​ కాన్ఫరె న్స్​ లో మాట్లాడారు. ఈ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు యావత్తు అయన మాటల్లోనే…

    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభు త్వం ఏర్పాటై రెండేండ్లు పూర్త వుతున్న సందర్భంగా విజయోత్సవా ల పేరిట సీఎం రేవంత్​ రెడ్డి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రభు త్వం తరఫున కూడా అ నేక కార్య క్ర మాలు చేయడానికి ప్లాన్​ చేస్తున్నా రు. నిర్దిష్టంగా గత రెండేండ్లుగా కాం గ్రెస్​ ప్రభుత్వం సాధించిన విజయం ఏదీ లేదు. మార్పు తీసుకొస్తామని, ప్రజాపాలన తీసుకొస్తామని అనేక రకాల హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు ఏదీ కూడా మన కండ్ల ముం దు కనిపించడం లేదు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో కేసీఆర్​ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాం గ్రెస్​ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొ ని మంత్రివర్గంలో స్థానం కూడా క ల్పించారు. ఈరోజు కాంగ్రెస్​ కూడా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను పార్టీలో చే ర్చుకున్నది.

    గత ప్రభుత్వంలో కేసీఆర్​ తనకు తాను మేధావిగా చెప్పుకునేవారు. ఇప్పుడు నేనేం తక్కువ అన్నట్లు రేవంత్​ రెడ్డి కూడా గొప్ప మేధావి అని చెప్పుకుంటున్నారు. నేను రే వంత్​ రెడ్డికి ఒక్కటే సవాల్​ చేస్తు న్నాను. మీరు ఎన్నికల ముందు ప్రతి ఊరికి వెళ్లి దేవుళ్లపై ఒట్లు వేస్తూ.. అధికారంలోకి వస్తే.. వారిని అరెస్ట్​ చేస్తం, వాళ్ల అవినీతి కక్కిస్తం అని హామీ ఇచ్చారు కదా? మరి రెం డేండ్లలో ఏం చేశారని నేను ప్రశ్నిస్తు న్న. ఏమన్నంటే.. ఉచిత బస్సు, స న్నబియ్యం పేరు చెప్తున్నారు. సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వమే రూ.4 3 ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 5 మాత్రమే సర్దుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల కు కేంద్ర ప్రభుత్వం లక్షా యాభైవేలు ఇస్తున్నది. కౌలు రైతుల కు, రైతు కూలీలకు ఇస్తానన్న సా యం ఇవ్వలేదు. మహిళలకు ఇస్తా నన్న రూ.2500 మరిచిపోయారు.

    పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వడం లే దు. ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామ న్నారు. చేయలేదు. నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అన్నారు. బీసీ లకు లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కా మారెడ్డి డిక్లరేషన్​ లో చెప్పారు. వి ద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్​ ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు కావడం లేదు. పంట బోనస్​ ఇస్తామని మోసం చేశారు. ఇ చ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఈ రెండేండ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా నేను కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తు న్నాను.

    రెండు మాత్రం అమలు చేస్తున్నా రు. అందులో ఒకటి భూదం దాలు. సింగరేణి భూముల నుంచి మొద లు హైటెక్​ సిటీ భూముల వరకు వి పరీతమైన అక్రమ భూదందా న డు స్తున్నది. గతంలో కేటీ ఆర్​ ఎలాగైతే కేంద్రీకృతమైన వసూళ్లకు పాల్పడ్డా డో.. ల్యాండ్​ బి జినెస్​ గానీ, రియ లె స్టేట్​ లో గానీ.. ఇప్పుడు కాంగ్రెస్​ ప్ర భుత్వం లోని పెద్దలు అలాగే దం దా లు చేస్తున్నారు. దందాల కోసం మం త్రులు పోటీలు పడి ఏం కావా లో చెప్పాలంటూ ఒక్కరి దగ్గరికి ముగ్గురు ముగ్గురు పోతున్నారు. ఇండ్ల పర్మిషన్​ కోసం నోవోసీ ఇవ్వ డం కోసం ఇబ్బందులు ఉన్నయి. హైదరాబాద్​ లో రియలెస్టేట్​ కుప్ప కూలిపోయింది. కృత్రిమ వేలంలు పెట్టి రియలెస్టేట్​ వ్యాపారం పెరిగిం దని చూపించే ప్రయత్నం చేస్తు న్నా రు. పెద్ద ఎత్తున బీఆర్​ఎస్​ పార్టీ భూములు అమ్మింది.. ఇప్పుడు కాంగ్రెస్​ అదే పనిచే స్తోంది.

    భూము లు, బీరు, బ్రాంది అమ్మకుండా ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా పని చేసే పరిస్థితి లేదు. మద్యం ద్వారా లక్ష కోట్లు రాబట్టా లని టార్గెట్​ పెట్టుకున్నరట.. ఎవరి సంక్షేమం కోసం మద్యం విక్ర యాలను పెంచి పోషిస్తున్నరో చెప్పాలి. ఎవరి కొంపలు కూలుస్తారో కాంగ్రెస్​ నాయకులు చెప్పాలి. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మేనిఫె స్టోలో పెట్టారు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క బెల్టు షాపు కూడా రద్దు చేయలేదు.రిటైర్​ అయిన ఉద్యోగస్తులకు వారు దాచుకున్న డబ్బు లు వాళ్లకు ఇ చ్చేందుకు ప్రభుత్వం భూములు అమ్ముతూ సర్దుతు న్నది.

    ఒక్క సింగ రేణి సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం విద్యు త్​ సంస్థల ద్వారా దాదాపు రూ.42 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. బీ రు, బ్రాంది తయారు చేసే కంపెనీల కు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇ వ్వడం లేదు. ఇలా రాష్ట్ర ఆర్థిక వ్య వస్థ గతంలో కేసీఆర్​ హయాంలో ఎట్ల ఉండేనో.. ఈరోజు కాంగ్రెస్​ ప్ర భుత్వం హయాంలో కూడా అలాగే తయారైంది. సీఎం రేవంత్​ రెడ్డికి నేను సవాల్​ వేస్తున్నాను. మీరు ఇ చ్చిన హామీలు, గ్యారంటీలు, 420 సబ్​ గ్యారంటీల్లో ఎన్ని అమ లు చే శారో చెప్పాల్సిన అవసరం ఉంది. పరిపాలన ఇలాగే సాగితే తప్ప కుం డా రానున్న రోజుల్లో ప్రజల ఆగ్రహా నికి ఈ ప్రభుత్వం గురికావాల్సిన పరిస్థితి వస్తుంది. రేవంత్​ రెడ్డి ఫుట్​ బాల్​ ఆడినంత మాత్రాన.. ఇచ్చిన గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించలేరని నేను చెప్తున్న.

    అందుకే ఈ రోజు తెలంగాణలో అ న్ని వర్గాల్లో చర్చ జరుగుతు న్నది. ఈ రెండు పార్టీల్లో ఎలాంటి తేడా లేదు. తప్పకుండా ఈ విషయంపై బీజేపీ రానన్న రోజుల్లో ప్రభుత్వ తీరుపై పోరాటాలు చేస్తుందని తెలు పుతున్నాను. ఇండిగో విమానాలు రద్దు విషయం పై కేంద్రం ఇప్పటికే స్పందించింది. ఆ కంపెనీ తీరుపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసు కుంటాం. బీసీ రిజర్వేషన్లకు సం బంధించి బీజే పీ కాంగ్రెస్​ పార్టీ అసెంబ్లీలో పెట్టిన బిల్లుకు మద్దతు తెలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రా యం కుద రాల్సిన అవసరం ఉన్న ది. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎ లాంటి పరిమితి లేదు. వ్యవసాయ అధికారి సర్టిఫై చేస్తే.. రైతుకు ఎంత పండినా సీసీఐ కొనుగోలు చేస్తుంది. తేమ శాతం ఇబ్బందులు కూ డా ఎక్కడా లేవు. వచ్చే ఏడాది మార్చి వరకు సీసీఐ చివరి క్వింటా లు వర కు పత్తిని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.