–బిజెపి నాయకులు యూరియాపై బాధ్యతగా మాట్లాడాలి
–జిల్లాలో ప్రస్తుతం యూరియా సమస్య లేనేలేదు
–యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించిన, అధిక ధరలకు అమ్మిన కఠిన చర్యలు
–నల్లగొండ ఎంపీ కుందూరు రఘు వీర్ రెడ్డి
MP Kunduru Raghuveer Reddy : ప్రజా దీవెన, నల్ల గొండ: యూరియా పై బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాల ని చూస్తున్నారని నల్గొండ పార్లమెం ట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి విమర్శిం చారు. సోమవారం న ల్గొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ యూరియాపై బీఆర్ఎస్ నా యకులు శవాల మీద పేలాలు ఏరు కుతిన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే గన్మెన్ యూరియాను పక్కదారి పట్టించినట్లు వస్తున్న దానిలో నిజం లేదన్నారు.
యూరియాను ఎలాంటి బ్లాక్ మా ర్కెట్ కు తరలించలేదని వివరిం చారు. కుక్కడం రైతులకు అవసరం ఉంటే అక్కడికి ఎక్కువగా పంపించ డం జరిగిందని వెల్లడించారు. వాస్త వాలు తెలుసుకో కుండా కేటీఆర్ కూ డా దీనిపై మాట్లాడడం సిగ్గుచేట న్నారు. చైనాతో గతంలో దెబ్బతిన్న సంబంధాల వల్ల యూరియా పంపి ణీలో ఆలస్యం జరిగిందని,ప్రస్తుతం సంబంధాలు మెరుగుపడటం వలన యూరియా భారత్ కు కావాల్సినం త దిగుమతి అవుతుం దని క్లారిటీ ఇచ్చారు.
గత 15 రోజుల క్రితం జిల్లాలో యూ రియా కోసం రైతులు ఇబ్బం దులు పడిన విషయం వాస్తవమేనని, ప్ర స్తుతం అలాంటి పరిస్థితి లేదని స్ప ష్టం చేశారు. యూరియా కేంద్ర ప్రభు త్వం నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం రై తులకు పంపిణీ చేస్తుందని వివ రించారు. దీనిపై తాము కేంద్ర ప్రభు త్వాన్ని నిందించడం లేదని, బీజేపీ నాయకులు బాధ్యతగా వ్యవహరిం చాలని సూచించారు. యూరి యాపై బీఆర్ఎస్, బిజెపి నాయకులకు అ నుమానాలు ఉంటే కలెక్టర్ ను కలి సి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లే కుండా రైతులకు యూరియాను స రఫరా చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో 5.68 లక్ష ల ఎకరాలలో పత్తి, 5.38 లక్షల ఎక రాలలో వరి పంటను సాగు చేస్తు న్నారని అన్నారు. గతంలో కంటే ఎ క్కువగానే సాగు విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. రబీ సీజన్ లో ఎరు వులకు సంబంధించి రైతులకు ఎ లాంటి ఇబ్బందులు ఉండవని పే ర్కొన్నారు. గత సంవత్సరం జిల్లా లో 57 వేల మెట్రిక్ టన్నుల యూ రియాను సరఫరా చేయగా, ఈసారి ఇప్పటివరకు 61 వేల మెట్రిక్ టన్ను ల యూరియా జిల్లాకు రావడం జరి గిందని తెలిపారు.
బుధవారం వరకు యూరియా పూ ర్తిస్థాయిలో జిల్లాకు సరఫరా అవు తుందని రైతులకు ఎలాంటి ఇబ్బం దులు ఉండవని తెలిపారు. జిల్లా లో యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించిన, అధిక ధరలకు విక్ర యించిన కఠిన చర్యలు తీసుకోవ డం జరుగు తుందని, పీడీ యాక్ట్ లు కూడా నమోదు చేయడం జరుగు తుం దని ఈ సందర్భంగా ఎంపీ హె చ్చరించారు. ఈ విలేకరుల సమావే శంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, మాజీ మున్సి పల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్ల గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి ల క్ష్మయ్య,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగ రాజు, వంగా ల అనిల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గాదరి రవి తదితరులు పాల్గొన్నారు.
