BRS MLA Guntakandla Jagadish Reddy : ప్రజా దీ వెన, హైదరాబాద్: తెలంగా ణ రాజకీయ వేదికపై మళ్లీ రాజ కీయవేడి రాజుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వ హించిన క్యాబినెట్ సమావేశంలో విద్యుత్ కొనుగోలు సం స్థల ఏర్పాటు అంశాలపై సిబిఐ విచారణ కోరేందుకు తీర్మా నం చేయడంతో మళ్లీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమ ర్శలు ప్రతి విమర్శలకు తావిచ్చినట్లయిoది. ప్రభుత్వం వి ద్యుత్ కొనుగోళ్లపై సిబిఐ విచారణ కోరుతున్నట్లు ప్రకటన చేసిన మరు నాడే మంగళవారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తె లంగాణ భవన్ లో మీడియా స మావేశం నిర్వహించి సాధా రణ విమర్శల సమాహారం కాకుండా భవిష్యత్ పాలనపై ఒ క హెచ్చరికలా విమర్శలు ఆరోపణలు గుప్పించారు.
ప్రస్తుత ప్రభుత్వం పాలన అంటే ఏమిటో మర్చిపోయిందని ఆయన ప్రారంభించిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయికి చేరుకున్నా యి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( Re vanth Reddy) నాయక త్వంపై నేరుగా ప్రశ్నల బాణాలు సంధించారు. పుంకాను పుంకాలు గా అనుమానాలు లేవనె త్తుతూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిం చడం ప్రధాన అ జెండాగా మారింద ని విమర్శించారు. ఇది కేవలం పాలన లో వైఫల్యం కాదని, రాష్ట్రం అజ్ఞానుల చేతుల్లో పడిందని ఆయ న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రా వు ( K. Chandrashekar Rao) పదేళ్ల పరిపాలన కాలాన్ని గుర్తుచేస్తూ, “ఆ సమయంలో కేబినెట్ నిర్ణయా ల కోసం ప్రజ లు ఎదురుచూసే వా రని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గం గురించి, అందులో ప్రజల అంశాల గురించి చర్చల ఆ లోచనే లేదన్నారు.విద్యుత్ కొను గోలు ఒప్పందాలపై సీబీఐ విచార ణ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శి స్తూ, “ఇది పనికిమా లిన నిర్ణయం మాత్రమే కాదని, రాజకీయంగా ప్రమాదకరం కూడా” అని పేర్కొన్నా రు.
సి.బి.ఐ (Central Bureau of In vestigation) పై గతం లో విమర్శలు చేసిన మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) ఇప్పుడు అదే సంస్థకు విచారణ అప్పగిం చడం ఎలా సమర్థించగలరని ప్ర శ్నించారు. ఈ నిర్ణయం ప్ర ధాన మంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi) వైపు మొ గ్గు చూపినట్టుగా ఉందని కూడా సుతిమెత్తగా చేశారు.
రా ష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్య క్తం చేశారు. “కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు రైతులకు 12 గంటలకే పరిమితం చేశారు. గ్రా మాల్లోనూ, హైదరాబాద్‌లోనూ క రెంట్ కోతలు పెరిగాయని చెప్పారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని ఒక సవాలు కూడా అని “ఏ మంత్రి అయినా నాతో చర్చకురండి, నిజం నిరూపి స్తా” అని సవాల్ విసిరారు.
రైతు సంక్షేమ పథకాలు, ధాన్యం కొ నుగోళ్లు, బోనస్ ఇవన్నీ ప్రభుత్వ చేతకానితనాన్ని దాచడానికి మాత్రమే వాడుతు న్నారని ఆయన ఆరోపించారు. “ఈ విచారణలతో ఏ మీ జరగదని, కేసీఆర్ ఎప్పటిలాగే కడిగిన ముత్యంలా బయట కు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత దిశపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఇది నిజంగా రాహుల్ గాంధీ డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వ మా, లేక మోడీ ప్రభా వంలో ఉందా అని అడిగారు. ఈ మీ డియా సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష మయ్య గౌడ్, బీఆర్ఎ స్ నేతలు ఒంటెద్దు నరసింహారెడ్డి, కే కిషోర్ గౌడ్, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.

