Monday, September 28, 2026
More
    HomeOpinionBRS MLA Jagadish Reddy : కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే రేవంత్ రెడ్డి...

    BRS MLA Jagadish Reddy : కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే రేవంత్ రెడ్డి విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ 

    📰 Generate e-Paper Clip

     

    BRS MLA Jagadish Reddy : ప్రజా దీవెన, దేవరకొండ: తెలంగా ణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, క రెంట్, నీళ్లు కూ డా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమ ర్శించారు. కేసీఆర్ అభి వృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే, రేవంత్ రెడ్డి విధ్వంసానికి కే రాఫ్ అడ్రస్ అయ్యారని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల పాల నలో తెలంగాణను అ భివృద్ధి పథంలో నడిపించిన దార్శని క నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

    బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీకి మ రో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీని యర్ నాయకుడు ముత్యాల సర్వయ్యతో పాటు వం దలా ది మంది నాయకులు బీఆర్‌ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. మాజీ మంత్రి, సూర్యా పేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగ దీష్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవ రకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సమ క్షం లో వీరంతా అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసంచేస్తూ పరిపాలన సాగిస్తోం దని వారు ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన రై తుబంధు నిధులు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తు న్నా రని మండిపడ్డారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో రై తు లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నా ర ని, కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా రైతులను ఆదుకు న్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రైతుబంధు డబ్బుల ను ఎగ్గొడుతూ దేవుళ్లపై ఒట్లు పెట్టి కాలం గడుపుతున్నా ర ని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.

    ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటు న్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయు గం వచ్చిందని, అన్న దాతలు ఎంతో సంతోషంగా జీవిం చా రని చెప్పారు. అయితే ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వంలో రై తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

    కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా రాష్ట్రంలో అ భివృద్ధి కనిపించడం లేదని, సంక్షేమ పథకాలకు కోతలు పె ట్టారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో మంత్రుల అ వినీతి బయటపడుతోందని అన్నా రు.అధికారంలోకి రాకముందు కాం గ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమ లు కాలేదని విమర్శించారు. సోనియాగాంధీ, రాహుల్ గాం ధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ 800 రోజు లు గడిచినా ఆ హామీల అమలు కనిపించడంలేదని అన్నారు.

    దళితులకు ఎస్సీ డిక్లరేషన్ పేరుతో 18 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, విద్యార్థు లకు టెన్త్, ఇం టర్, డిగ్రీ, పీజీ చది వితే ఆర్థిక సహాయం ఇస్తామని చె ప్పి నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించా రు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఏ టా రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటా యిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపిం చా రు. రైతులకు రైతుబంధు రూ.15 వేలుగా పెంచుతామని, పంటల బీమా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని అన్నారు.

    అవ్వాతాతలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి నా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శిం చారు. మహి ళల ఖాతాల్లో ప్రతి నెల రూ.2,500 జమ చేస్తామని చెప్పి ఓ ట్లు తీసుకున్నారని, కానీ ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూ డా ఆ డబ్బు అందలేదన్నారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ యువ వి కాసం వంటి పథకాలు కూడా అమలు కా లేదని తెలిపారు.

    కనీసం ఈ బడ్జెట్‌లో అయినా ఇ చ్చిన హామీలను అమలు చేసేలా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వా రు డిమాండ్ చేశారు.అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజలు మ ళ్లీ బీఆర్‌ఎస్ వైపు చూస్తు న్నారని, తెలంగాణలో మళ్లీ కేసీ ఆర్ నాయకత్వం అవసరమని వారన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.