Chaya Someswara Temple : ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఛాయాసోమేశ్వరాలయం మరోసారి ప్రత్యేక ఆకర్ష ణగా నిల వనుంది. ఆలయంలోని చారిత్రక కోనేరుకు కొత్తకమిటీ ఆ ధ్వ ర్యంలో పునరు జ్జీవం కల్పించేచర్యలు ప్రారం భమయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోనేరు శుభ్రత పనులకు ఎట్ట కేలకు శ్రీకారం చుట్టారు.
సోమవారం నుంచి కోనేరులో పూడికతీత పనులు ముమ్మ రం గా కొనసాగుతు న్నాయి. ప్రొక్లెయిన్లతో పూడికను తొలగి స్తూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని బ యటకు తరలిస్తున్నారు. ఆలయ క మిటీ సభ్యులు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.
పూడికతీత పూర్తయిన వెంటనే కోనేరుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా ప్రణా ళికలు రూ పొందిస్తున్నారు. ఆలయానికి ఖరారైన కొత్త కమిటీ ఆధ్వర్యం లో జరుగుతున్న ఈ పనులతో భక్తులు, స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటికీ ప్రపోజల్ సభ్యులు కుడుదల ఎల్లయ్య, పల్రెడ్డి వెంకటరెడ్డి, గుండగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షిస్తున్నారు. చారి త్రక ప్రాధాన్యం ఉన్న కోనేరు అభివృద్ధి చెందితే ఆలయానికి మరింత శోభ చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



