Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshChennai suitcase murder case : బిగ్ బ్రేకింగ్, సూట్‌కేస్ మర్డర్ మిస్టరీ, 'ఆఒక్క బార్‌కోడ్'...

    Chennai suitcase murder case : బిగ్ బ్రేకింగ్, సూట్‌కేస్ మర్డర్ మిస్టరీ, ‘ఆఒక్క బార్‌కోడ్’ తిప్పిన చెన్నై మర్డర్ కేస్ ట్విస్ట్

    📰 Generate e-Paper Clip

     

    Chennai suitcase murder case :  ప్రజా దీవెన చెన్నై: పెరంబూర్‌ రై ల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌.. ఎప్పుడూ ప్రయాణి కులతో రద్దీగా ఉండే ఆ చోట ఒక అనాథ సూట్‌కేస్ పడి ఉంది. కాసేపటికి దాని నుండి వ స్తున్న భయంకరమైన దు ర్వాసన తో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. తీరా పోలీ సులు వచ్చి ఆసూట్‌కేస్ తెరిచిచూశాక ఒక్క సారిగా గుండె గుభేల్ మంది. అందులో ఉన్నది కేవ లం ఒక మనిషి మొండెం మాత్ర మే, తలలేదు.. చేతులు లేవు..కాళ్లు లేవు.. కేవలం కుళ్లిపోయిన మొండెం మాత్రమే ఉండటంతో చెన్నై పోలీసులకు ఇదొక మైండ్ బ్లాకింగ్ మిస్టరీగా మారిం ది. అస్స లు ఎవరీ వ్యక్తి? ఎవరు చంపారు? అనే ప్రశ్నలకు ఆధారాలే దొరకలేదు.

      క్లూలేనిచోట.. దొరికిన ‘ఆఒక్క బార్‌కోడ్’

    హంతకులు శవాన్ని ముక్కలు ము క్కలుగా నరికి, ఎలాంటి ఆధారా లు దొరకకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు. కానీ, ఎంతటి క్రిమినల్ అ యినా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడనే ది పోలీసు సూత్రం. ఇక్కడ కూ డా అదే జరిగింది. ఆ మొం డెంపై ఉన్న బ్రాండెడ్ షర్ట్ కాలర్‌పై ఉన్న ‘బార్‌కోడ్’ పోలీసు ల కంటపడింది.వెంటనే అలర్ట్ అయిన ఇన్వెస్టిగే ష న్ టీమ్ ఆ బార్‌కోడ్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసింది. చివర కు ఆ దుస్తులను కొనుగోలు చేసిన నిర్దిష్టమైన షాపును కను గొన్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిం చగా.. ఆ బట్ట లను ఇద్దరు వ్యక్తు లు కలిసి కొనుగోలు చేసినట్లు తేలింది.

    కాల్ డేటా.. వాట్సాప్ లొకేషన్ ఎంట్రీ

    ఇక అక్కడి నుండి రంగంలోకి దిగి న సైబర్ క్రైమ్ విభాగం, ఆ అ ను మానితుల కాల్ డేటా రికార్డులను (CDR), వారి వాట్సాప్ లొకేషన్ హిస్టరీని జల్లెడ పట్టింది. సాంకేతిక పరి జ్ఞానం సాయంతో నిందితుల క దలికలను ట్రాక్ చేస్తూ.. వా రు తేనాంపేట, టి.నగర్ పరిసర ప్రాంతా ల్లోనే నక్కి ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు సేకరించారు. అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచా రించడంతో అసలు నిజం బయ టపడింది. ఆ మొండెం మ రెవరో కాదు.. స్వయానా నిందితురాలి భ ర్తదే వివాహేతర సంబంధం, ని త్యం ఇంట్లో జరిగే కుటుంబ కలహాల నేప థ్యంలో ఆ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను వదిలించు కోవాలని స్కెచ్ వేసింది.

    అత్యంత క్రూరంగా అతడిని హ త మార్చి, గుర్తుపట్టకుండా ఉండేందు కు శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కే సులో కుక్కి రైల్వే స్టే షన్‌లో వదిలేశారు. సినిమా స్క్రీన్‌ ప్లే ను తలపించేలా ప్లాన్ చేసినా, సాంకేతిక పరిజ్ఞానం ముందు ఆ కి రాతక జంట ఆటలు సాగలేదు. చి వరకు చెన్నై పోలీ సులు ఈ సవాల్‌తో కూడిన కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.