Monday, September 28, 2026
More
    HomeIndiachhattisgarh boiler blast : బిగ్ బ్రేకింగ్, ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో విషాదం, పవర్ ప్లాంట్...

    chhattisgarh boiler blast : బిగ్ బ్రేకింగ్, ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో విషాదం, పవర్ ప్లాంట్ బాయిలర్ పేలి పదిమందిదుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    chhattisgarh boiler blast : ప్రజా దీవెన, ఛత్తీస్గఢ్: చత్తీ స్గడ్ రాష్ట్రం సక్తి జిల్లాలో పెను విషాద సంఘటన చోటుచే సుకుంది. వేదాంత పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్న కా ర్మికులు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ అకస్మాత్తుగా భారీ శబ్దంతో బాయిలర్ పేలిపో యింది. క్షణాల్లోనే అక్కడి వాతా వరణం వూహించని విధంగా మారిపోయింది. అగ్ని జ్వాలలు, దట్టమైన పొగ మధ్య కార్మికులు ప్రాణాల కోసం పరుగులు తీశారు.ఈ భయానక ప్రమాదంలో 10 మంది కా ర్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కో ల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్లాంట్ పరిసర ప్రాం తాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనలకు గురయ్యా రు.సాంకేతిక లో పమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమా నిస్తున్నారు. గాయపడిన వారిని వెం టనే సమీప ఆసుపత్రులకు త రలించి చికిత్స అందిస్తున్నా రు. అయితే, వారిలో కొందరి పరిస్థితి ఇం కా విషమంగానే ఉందని సమాచారం.

    సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రా రంభించారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని ర క్షించేం దుకు గంటల పాటు శ్రమిం చారు.ఈ ఘటనపై అధికారులు వి చారణ ప్రారంభించారు. అసలు కా రణాలపై లోతుగా ప రిశీలన కొనసాగుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.

    ఈ విషాదం మరోసారి ఒక ముఖ్య మైన ప్రశ్నను ముందుకు తెచ్చింది భారీ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు నిజంగా ఎం తవరకు అమలవు తున్నాయి నిపుణులు చెబుతున్నది ఒ క్కటే ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే భ ద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని పరి శీలకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.