cloud burst Aquarius in jammu kashmir : ప్రజా దీవెన, శ్రీనగర్: ప్రకృతి క న్నెర్ర జేసింది. జమ్మూకశ్మీర్‌ను ఊహించని మెరుపు వరదలు ముంచెత్తాయి. నిన్నటి వర కూ ప్రశాంతం గా ఉన్న ప్రాంతాలు.. ఇప్పుడు జలదిగ్బంధం లో చిక్కుకున్నాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కురి సిన భీకర వర్షాలకు రాజౌరి, పూంచ్ జిల్లాలు అతలాకుతల మయ్యాయి.వరదల ధాటికి దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రం గా గాయపడి ఆసుపత్రుల్లో చికి త్స పొందుతున్నారు.వరద గుప్పిట్లో చిక్కుకున్న 14 మంది ని రెస్క్యూ టీమ్స్ సాహసో పేతంగా ప్రాణాలతో బయటకు తీశా యి.అబ్దుల్లా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లోని 50కి పైగా కు టుంబాలను అధికారులు యుద్దప్రాతిపదికన సురక్షిత ప్రాం తాలకు తరలించారు.
ఉగ్రరూపం దాల్చిన నదులు..
రాజౌరి జిల్లాలో నదులు ప్రమాద ఘంటికలను దాటి ప్రవ హిస్తున్నాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదుల ఉధృతికి దార్హాలి నది రక్షణ గోడ (సేఫ్టీ వాల్) సైతం కొట్టు కుపోయింది. స్థానిక బ స్టాండ్ పూర్తిగా నీట మునగగా, కళ్ల ముందే వాహనాలు కాగితపు పడవల్లా వరద ప్రవాహంలో కొ ట్టుకుపోవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. మరో వైపు పూంచ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడుతుండటం తో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రం గంలోకి దిగిన విప త్తు నిర్వహణ బృందాలు సహాయక చ ర్యలను ముమ్మరం చేశాయి.
ఐఎండీ హై అలర్ట్
కశ్మీరీ ప్రజలారా, ఇప్పుడే ము ప్పు తప్పలేదని జులై 23వ తేదీ వరకు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రజలంతా అప్ర మత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఐఎండి అధికారులు సూచిస్తున్నారు.



