Cm Cup Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేసిం దన్న అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యు వ తను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థి తులకు నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చే శారు. హైదరాబాద్ గచ్చీ బౌలీ స్టేడియంలో తెలంగాణ పోలీ సు శాఖ ఆధ్వర్యంలో జరుగుతు న్న 74వ బోలానాథ్ ముల్లి క్ స్మార క ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపి యన్ షిప్ 2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొ న్నా రు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వివిధ విభా గాలకు చెందిన పోలీసు క్రీడాకారులను ఉద్దేశిం చి ముఖ్య మంత్రి ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లో నే.. యువత నెమ్మదిగా క్రీడలకు దూరమవుతున్నారు. క్రీ డామైదానాలను వ దిలిపెట్టి యువత తప్పుచేస్తున్నారు. దే శంకోసం ఏమైనా చేయడాని కి మనందరం సిద్ధంగా ఉం డా లి. యువత సరైన దశలో వెళ్లకపోతే భవిష్యత్తు ప్రమా దక రంగా మారు తుందని హెచ్చరించారు. క్రీడాకారులను ప్రో త్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సి ద్ధంగా ఉంది. క్రీడాకారులను త యారు చేసి దేశ ప్రతిష్ట ను నిలబెట్టాలి. యువతను క్రీడల్లో ప్రోత్సహించండి అని పి లుపునిచ్చారు.
భారత్ ఫుట్‌బాల్ చరిత్రలో హైదరా బాద్ నగరానికి విశేష పేరు ప్రఖ్యా తులున్నాయి. 1950-60 దశకం లో నర్సరీ ఆ ఫ్ ఇండియన్ ఫుట్ బాల్‌గా హైదరాబాద్ పేరు గడిం చింది. దేశంలోనే ఫుట్‌బాల్‌ను అం తగా ఆదరించింది. 1956 ఒ లంపి క్స్‌లో ఆడిన ఫుట్‌బాల్ జట్టులో ఏడుగురు క్రీడాకా రులు హైదరాబాద్ కు చెందిన వారే. ఆక్రమంలో ఆల్ ఇం డియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ హైదరాబాద్‌లో నిర్వ హించడం గర్వంగా ఉంది. ఈ క్రీడల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన పోలీసు విభా గా నికి మనస్ఫూర్తిగా అభి నందనలు. దేశం నలుమూలల నుంచి ఈ క్రీడల్లో పాల్గొని అ ద్భు తమైన నైపుణ్యం ప్రదర్శిం చిన టీ మ్‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి గా అందరికీ అభి నందనలు.
140 కోట్ల జనాభా కలిగిన భారత్ ఒలింపిక్స్‌లో కనీసం ఒ క్క గోల్డ్ మె డల్ కూడా సాధించలేకపోవడం గు రించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. గతంలో ఇదే గచ్చీబౌలీలో ఎన్నో క్రీ డలు నిర్వహించాం. గడిచిన కొ న్నేళ్లుగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో మనవాళ్లు ఓడిపోగానే కొద్ది రోజులు చర్చించి ఆ తర్వాత విస్మరిస్తున్నారు. యువత మా దక ద్రవ్యాల వలలో పడి నిర్వీర్యమైపోతోంది. వీరుల భూ మి, ఎంతోమంది త్యాగధనులకు కేంద్రమైన పంజాబ్‌లో ఈ రోజు మా దకద్రవ్యాల గురించి వినిపిస్తోంది.అందుకే ఆలో చించి తెలంగాణ ప్ర భుత్వం ఒక అడుగు ముందుకేసిం ది. ఎంతో మంది నిష్ణాతులతో కలి సి రాష్ట్రంలో యంగ్ ఇండి యా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొ ల్పాం. క్రీడల్లో రాణించి న వారికి అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభు త్వం సిద్ధంగా ఉంటుంది.
సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలతో స మాజంలో సరికొత్త స వాళ్లు ఎదుర వుతున్నాయి. పోలీసు విభాగాల కు చెందిన క్రీడాకారులు మైదానా ల్లో ఎలాగైతే ప్రతిభను, స్ఫూర్తిని కన బరిచారో సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నియంత్రణలో కూ డా ప్రతిభను కనబరచాలి.. అని ముఖ్య మంత్రి నొక్కి చె ప్పారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు జాతీయ స్థా యి లో నిర్వహించిన ఈ చాంపియ న్ షిప్ ముగింపు కార్యక్ర మంలో మంత్రి వాకిటి శ్రీహరి, డీజీపీ శివధ ర్ రెడ్డి, తెలంగా ణ స్పోర్ట్స్ అకాడ మీ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఐడీ డీజీ శిఖా గోయల్, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు డైరె క్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వప్న తివారి, తె లంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబరాబా ద్ సీపీ రమేష్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా మై దా నంలో మ్యాచ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ చాంపియన్‌షిప్ లో ప్రతిభ కనబరిచిన టీమ్‌లకు ట్రోఫీలను అందించారు.



