Cm revanth reddy : ప్రజాదీవెన, హైదరాబాద్: సమా జంలో మహిళల రక్షణ కో సం మగవారే బ్రాండ్ అంబాసిడ ర్లుగా నిలబడాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఫిర్యాదులు, కేసు ల నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బా ధ్యతగానూ భావించాలన్నారు. ఆడ పిల్లలను ఎవరైనా ఇ బ్బందికి గురి చేసినప్పుడు నిల బడి ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు ము ఖ్యమంత్రి సూచించారు. వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుందని హితవు పలికారు. సొంత కు టుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురై తే ఏ విధంగా స్పందిస్తామో, ఇతర ఆ డపిల్లల విషయంలోనూ అదే తీరుగా ఆలోచించాలన్నారు. హైదరాబాద్ జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భ ద్రతా విభాగం ఆధ్వర్యం లో నిర్వహించిన “స్టాండ్ విత్ హ ర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్ర మంలో ముఖ్యమంత్రి పా ల్గొన్నా రు.
Stand With Her క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరిం చా రు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కా పాడడం లో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విమెన్ సేఫ్టీ విభాగాన్ని ముఖ్యమంత్రి అభినందిం చారు. మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం తెలం గాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివ రించారు. ఈ సంద ర్భంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని జరుపుకుంటున్న సందర్భంలో కేవలం కార్యక్రమాల నిర్వహణతో బాధ్యత తీరిపోయినట్టు కాదు. మహిళను శక్తితో పోల్చుతాం. మహి ళలను కుటుంబ గౌరవంగా భావి స్తాం. అలాంటిది మహిళ లు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థి తులు ఉండకూడదు. ఈ దుస్థితిని నివారించేలా మనల్ని మనం సవరించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక మహి ళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వా న్ని నడుపుతోంది. దేశ స్వతంత్రానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీ లక పదవులు, బాధ్యతలు కట్టబె ట్టిన చరిత్ర మా పార్టీకి ఉంది. నా డు తెలంగాణ ఏర్పాటులోనూ మ హిళామణులే కీలకంగా వ్యవహరించారు.
మహిళల శక్తి సామర్థ్యాల పట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది.ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభు త్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళ లే అధికారిణులుగా ఉన్నా రు. ఆడబిడ్డలు సామాజికంగా, ఆ ర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధించినట్టు గా భావించాలి.తెలంగాణలో ఓవైపు మహి ళా భద్ర తకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆర్థిక స్వావలంబన దిశ గా మహిళ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. ఇం దిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహి ళ ల పేరుమీదే ఇ స్తున్నాం. సోలార్ వి ద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, ఆర్టీసీ బస్సు లకు వారిని యజమాను లు గా చేస్తున్నాం. తెలంగాణ గ్రా మీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తు లను అంతర్జా తీ యంగా విక్రయించే లా అమెజాన్ వంటి సంస్థలతో ఒ ప్పం దాలు చేసుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చా కలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం.
తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డనే స్పూర్తిగా ఉండాలని ‘తె లంగాణ త ల్లి’ మూర్తులను ప్రతిష్టించుకు న్నాం.తెలంగాణ రైజింగ్ 2047 వి జన్ లక్ష్యసాధనలో మహిళల ముందడుగే కీలకం. మహిళలు ఆ ర్థిక ప్రగతి సాధించడంతోనే తెలం గా ణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. మహిళలకు సంపూర్ణ భద్ర త కల్పించ డంతో నే ఇవన్నీ నెరవే రుతాయి. గతంలో కొన్ని ప్రాంతా ల్లోనో, బ హిరంగ ప్రదేశాల్లో మహిళ లకు వేధింపులు ఎదురయ్యేవి. కా నీ ఈరోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్‌లైన్ క్రైమ్ పెరిగి పోయింది. డీ ప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తు న్నారు. వీ టిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా పటి ష్టం చేశాం.
ఏదైనా జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అని నిందలు వే సే చెడు సం ప్రదాయాన్ని మనం వదులుకోవాలి. ఇబ్బం దు ల్లో ఉన్న మహిళల కో సం ‘స్టాండ్ విత్ హర్’ అనే నినాదం తీసుకొని వారికి అండగా నిల బడాలని ముఖ్యమంత్రి అ న్నారు.స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ప్రారంభ కార్య క్ర మం లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, విమెన్ సేఫ్టీ విభాగం అడిషనల్ డీజీపీ చారు సిన్హా, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, పలువురు పోలీస్ ఉన్నతాధి కారులు, విద్యార్థినులు పాల్గొన్నా రు.


