Sunday, September 27, 2026
More
    HomeIndiaCm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, రేవంత్ రెడ్డి విమానానికి తప్పిన గండం, బెంగళూరుకు...

    Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, రేవంత్ రెడ్డి విమానానికి తప్పిన గండం, బెంగళూరుకు మళ్ళిన ఎమర్జెన్సీ ల్యాండింగ్

    📰 Generate e-Paper Clip

     

    Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి శంషా బాద్ ఎయిర్‌పో ర్ట్‌లో పెను ప్ర మాదం తప్పింది. గగ నతలం లో ఒక్కసారిగా మారిన వా తావరణం, ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం కారణంగా సీఎం విమానం తీవ్ర ఒడుదొడుకు లకు లోనైంది. చివరి నిమిషంలో పైలట్లు అప్ర మత్తమవడంతో తృటిలో ముప్పుతప్పి, విమానం బెంగ ళూ రుకు సురక్షితంగా డైవర్ట్ అయింది.

    విమానయాన శాఖ ఉన్నతాధికా రులు వెల్లడించిన వివరా ల ప్రకారం…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారిక పర్య టన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ హై డ్రామా చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం (RGIA) ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి మరికొద్ది నిమి షాల సమయం ఉందనగా, ఒక్క సారిగా వాతావరణం అల్లకల్లోలంగా మారింది.

      కనుచూపు మేరలో లేని రన్‌వే ?

    అకస్మాత్తుగా తారుమారైన వాతా వరణ పరిస్థితులతో భారీ గా వీచిన గాలులు, దట్టమైన మేఘాల వల్ల ‘విజిబిలిటీ’ (క నిపించే సామర్థ్యం) పూర్తిగా పడిపోయింది. దీంతో వి మా నం పైలట్ల చాకచక్య ప్రావీణ్యంతో ల్యాండింగ్ చేయడం అ త్యంత ప్రమాదకరమని గ్రహించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), పైలట్లకు అలర్ట్ పంపింది. పైలట్లు కూడా ఏమాత్రం సాహసం చేయ కుండా విమానాన్ని వెంటనే బెంగళూరు వై పు మళ్లించారు.

    బెంగళూరులోని కెంపెగౌడ అంత ర్జాతీయ విమానాశ్ర యం లో సీఎం రేవంత్ రెడ్డి విమానం సురక్షితంగా ల్యాండ్ అ యింది. ముఖ్యమంత్రి తో పాటు విమానంలో ఉన్నవారం తా సురక్షితంగా ఉన్నారని అధికా రులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం అను కూ లించిన తర్వాత సీ ఎం రేవంత్ రెడ్డి బెంగళూరు నుంచి తి రిగి హైదరాబాద్‌కు బయలుదేర నున్నారు.

    శంషాబాద్ పరిసరాల్లో వాతావరణ పరిస్థితిని అధికారులు నిరంతరం ప ర్యవేక్షిస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ ఆటం కంతో అటు అధికార యంత్రాం గం, ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కాసేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి పైలట్ల సమయ స్ఫూర్తితో సీ ఎం ప్రయాణిస్తున్న విమానం క్షేమంగా బెంగ ళూరు చేరింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.