Cm Revanth Reddy hot comments : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ఆధ్యాత్మిక గుండెకాయ యా దగి రిగుట్ట (యాదాద్రి) భవిష్యత్తు రూపరేఖలు మారబోతు న్నా యి. కేవలం ఒక ఆలయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థా యి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా యాదాద్రిని తీర్చి ది ద్దేందుకు ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీ ఎం తీసుకున్న నిర్ణయాలు యాదాద్రి భవిష్యత్తును సరి కొ త్త మలుపు తిప్పనున్నాయి.అంతర్జాతీయ స్థాయికి ‘ఇ స్కా న్’ ఆధ్యాత్మిక సేవలు ఆధ్యా త్మిక చైతన్యంలో భాగంగా యాద గిరిగుట్టపై హరేరామ హరేకృష్ణ (ఇ స్కాన్) ఫౌండేష న్ భారీ ప్రాజెక్టును చేపట్టబోతోంది. దీనికోసం ప్రభుత్వం మా ర్కెట్ రేటు ప్రకారమే భూ మిని కేటాయించాలని నిర్ణయిం చింది.ఇక్కడ అంతర్జాతీయ స్థా యి ధ్యాన కేంద్రాలు, ఆధ్యా త్మిక శిక్షణా సంస్థలు రాబోతున్నాయి.

తిరుమల మోడల్లో మఠాలు, గెస్ట్‌హౌస్‌లు
తిరుమల (TTD) అనుసరిస్తున్న దశాబ్దాల నాటి విజయ వంతమైన విధానాన్ని యాదాద్రిలో అమలు చేయాలని సీ ఎం రేవంత్ రెడ్డి ఆదే శించారు. ఇకపై ఇక్కడ భూముల కే టాయింపులు, మౌలిక వసతుల కల్పన అంతా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది.
వివిధ పీ ఠాలు, మఠాలకు భూములు కేటా యించేందుకు తిరుమల తరహాలో నే ఒక సుస్థిరమైన పాలసీని (వి ధాన రూపకల్పన) తీసుకురాబో తున్నారు.విఐపిలు, సామాన్య భ క్తుల వసతి కోసం తిరు మల కాటే జీల తరహాలోనే భారీ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీని పై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
భవిష్యత్తు చిత్రం ఎలా ఉండబోతోంది?
వసతి సౌకర్యాల పరంగా పరిమిత హోటళ్లు, గదులు, భారీ విఐపి కా టేజీలు, కామన్ గెస్ట్‌హౌస్ కాం ప్లె క్స్‌లతో పాటు ఆధ్యాత్మిక వాతా వరణం కేవలంలో బాగంగా దర్శ నానికే పరిమితం కాకుండా ఇస్కాన్ వంటి సంస్థల భాగస్వామ్యం తో గ్లోబల్ కల్చరల్ హబ్ గా తీర్చిది ద్దాలని నిర్ణయించారు. అదే సమ యంలో సాధారణ కేటాయింపులు పక్కా రూల్స్ తో కూడిన “తిరుమ ల స్టైల్” ల్యాండ్ పాలసీని అమలు చే యాలని కూడా అంగీకారానికి వచ్చారు.
కేవలం కొండపై దై వ దర్శనం మాత్రమే కాకుండా భక్తులకు తిరుమల వెళ్లిన ఫీలింగ్, అంతర్జా తీయ స్థాయి సౌకర్యాలు యాదగిరిగుట్ట లోనే అందించడమే లక్ష్యం గా రేవంత్ సర్కా ర్ అడుగులు వే స్తోంది. రాబోయే రోజుల్లో యాదాద్రి ఒక గ్లో బల్ స్పిరిచు వల్ డెస్టినేష న్గా మారడం ఖాయంగా కనిపి స్తోందన్న అభి ప్రాయం వ్యక్తం అవుతోంది.


