Monday, September 28, 2026
More
    HomeIndiaMinister Uttam Kumar Reddy key comments : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, మేడ్...

    Minister Uttam Kumar Reddy key comments : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, మేడ్ ఇన్ తెలంగాణ, ప్రపంచ ఏరోస్పేస్ ‘రాజధాని’గా హైదరాబాద్

    📰 Generate e-Paper Clip

     

    Minister Uttam Kumar Reddy key comments :  ప్ర జా దీవెన, హైదరాబాద్: ఒకప్పు డు యుద్ధ విమానంలో పై లట్‌గా ఆకాశాన్ని శాసించా.. ఇప్పుడు గ్లో బల్ ఏరోస్పేస్ రం గాన్నే తెలంగాణ వైపు తిప్పేందుకు సిద్ధమయ్యామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సర ఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉ త్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పటంలో హైదరా బాద్ అంటే నిన్నటివరకు ఐటీ…మొన్నటివ రకు ఫార్మా, కా నీ రేపటి ప్రపంచం లో భూమిపై నుంచి అంతరిక్షంలోకి దూ సుకెళ్లే ఏ అత్యాధునిక విమా నం చూసినా, గాల్లో శత్రువు లను ముప్పేట దాడి చేసే ఏ యుద్ధ విమానాన్ని కదిలించి నా… అందులో మేడ్ ఇన్ తెలంగాణ ముద్ర కని పించబోతోం ది. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు, రాబోయే రోజుల్లో ప్రపం చ విమానయాన భవిష్యత్తును డిసైడ్ చేయబోయే పవర్‌ హౌస్ అని, ఈ సంచలన మార్పునకు వేదికైంద న్నారు. నగ రంలో ఘనంగా ప్రా రం భమైన ఏరోమార్ట్ హైదరాబాద్– 20 26′ అంతర్జాతీయ ఏరోస్పేస్ & డిఫెన్స్ బిజినెస్ కన్వెన్ష న్‌ లో మం త్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్లోబల్ దిగ్గ జా లకు విసిరిన స్మార్ట్ వెల్‌కమ్ ఛాలెంజ్ ఇప్పుడు పారిశ్రా మిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత వైమానిక దళంలో సూపర్‌సోనిక్ యుద్ధ విమానాల ను నడిపిన లీడర్‌ గా, ఒక విమానం రెక్కల వెనుక ఉండే టెక్నాలజీ విలువ మంత్రి ఉ త్తమ్‌కు బాగా తెలుసు. ఆ అనుభవంతోనే ఆయన గ్లోబల్ కంపెనీలకు భరోసా ఇచ్చారు.

    ఆకాశంలో ఒక్క చిన్న విడిభాగం ఫెయిల్ అయినా మిషన్ కొలాప్స్ అవుతుంది. అలాంటి అత్యున్నత రక్షణ ప్రమాణా లను (Defense S tandards) తెలంగాణకు చెందిన ఎంఎ స్‌ఎంఈలు (MSMEs) అల వోకగా డెలివరీ చేస్తున్నాయ న్నారు. అమెరికా ప్రెసిడెంట్ ప్రయా ణించే అత్యంత సురక్షి తమైన హెలికాప్టర్ క్యాబిన్ల నుండి… అపాచీ హెలికాప్టర్లు, ఎఫ్-16 ఫైటర్ జెట్ల రెక్కల వరకు అన్నీ మన హైదరా బాద్‌ లోనే రూపుదిద్దుకుంటున్నాయన్నారు.

    తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే ఇది ఒక సరికొత్త స్వర్ణ యుగం. దశాబ్దాలుగా రాష్ట్రానికి బ్రాండ్ అం బాసిడర్‌గా ఉన్న ఫార్మా (ఔషధ) రంగాన్ని వెనక్కి నెట్టి…ఏరోస్పేస్ ఎగు మతులు ఏకంగా 103 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 1, 500 కు పైగా ఏరోస్పేస్ అనుబంధ పరి శ్రమలు, డీఆర్‌డీఓ (DRDO) వం టి డిఫెన్స్ ల్యాబ్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అందిం చే నైపుణ్యం కలిగిన యువత… ఇ వ న్నీ హైదరాబాద్‌ను గ్లోబల్ రేస్‌ లో టాప్‌లో నిలబెడుతు న్నాయని చెప్పారు. ఇప్పటికే స్పెయిన్, కెన డా, ఫ్రాన్స్, ఇట లీ సహా 25 దేశాల గ్లోబల్ దిగ్గజాలు (ITP Aero, FT G Aer ospace) హైదరాబాద్‌ను తమ నెక్స్ట్ హబ్‌గా మార్చుకు న్నాయి.

    వరంగల్ టు ఆదిలాబాద్…విమానవిప్లవం

    హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, ఈ ఏరోస్పేస్ ఎకో-సిస్ట మ్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం మూడు కీలక ప్రాజెక్టు లతో సిద్ధమైందని మంత్రి ప్రకటించారు. వరం గల్ విమానాశ్రయం వచ్చే నెలలోనే శంకుస్థాపన కమ ర్షియ ల్ హబ్‌గా మార్పుచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్ పౌర మరియు సైనిక (Ci vil & Militar y) అవసరాలకు తగ్గట్టుగా రీ-డిజై న్ చేశామ ని, కొత్తగూడెం విమానా శ్రయం కేంద్ర ప్రభుత్వం నుండి త్వ రలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఈ మూడు కొత్త కేంద్రాలు భ విష్యత్తు లో విమానాల తయారీ, మరమ్మ త్తులు (MRO), రక్షణ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయని తెలి పారు.

    ప్రపంచ ఏరోస్పేస్ ఇన్వెస్టర్లకు మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. మీ నెక్స్ట్ మాన్యుఫ్యా క్చరింగ్ ప్లాంట్ తె లంగాణలోనే ఉం డాలి. మీ తదుపరి పెట్టుబడి హైద రాబా ద్‌లోనే ల్యాండ్ అవ్వాలని, ఇక్కడ పాలకుల నుండి అధి కారుల వరకు అందరం 24 గంటలూ మీకు అందుబాటులో ఉంటాం. మీ బిజినెస్ సక్సెస్‌లో మేము భాగస్వాములం అ వుతామని స్పష్టం చేశారు. ‘ఏరోమార్ట్ హైదరాబా ద్–2026’ అనేది కేవలం మూడు రోజుల మీటింగ్ కాదు..ప్రపంచ ఆ కా శాన్ని శాసించబోయే గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్‌లో తెలంగాణ తన శాశ్వత సింహాసనాన్ని ఖరారు చేసుకున్న చారిత్రక మై లురాయని పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.